ఆదివారం 05 జూలై 2020
Rajanna-siricilla - Apr 05, 2020 , 03:23:57

చేతులెత్తి మొక్కుతున్నా..

చేతులెత్తి మొక్కుతున్నా..

  • పారిశుధ్య కార్మికులూ.. మీ పనితీరు అభినందనీయం
  • విపత్కర సమయంలో మీ ధైర్యం భేష్‌ 
  • ఆరోగ్యం విషయంలో పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలి
  • గ్లౌజులు, మాస్కులు ధరించి పని చేయాలి
  • మంత్రి గంగుల కమలాకర్‌
  • నెలాఖరు వరకూ రేషన్‌ పంపిణీ చేస్తామని వెల్లడి

కార్పొరేషన్‌, నమస్తే తెలంగాణ : ‘చేతులెత్తి మొక్కుతున్నా. విపత్కర సమయంలో ఎం తో ధైర్యంగా ఉన్నారు. మీ పనితీరు భేష్‌' అని పారిశుధ్య కార్మికులను రాష్ట్ర బీసీ సంక్షే మ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అభినందించారు. ఆరోగ్యం విషయంలో పూర్తిస్థాయిలో జాగ్రత్తలు తీసుకోవాలని, తప్పనిసరిగా గ్లౌజులు, మాస్కులు ధరించి పని చేయాలని సూచించారు. నగరంలో ని ధన్గర్‌వాడీ పాఠశాలలో 59, 60వ డివిజన్ల పరిధిలోని పారిశుధ్య కార్మికులకు శనివారం మేయర్‌ వై సునీల్‌రావుతో కలిసి మంత్రి గ్లౌజులు, మాస్కులను పంపిణీ చేశారు. సాయంత్రం నగరంలోని పలు రేషన్‌ షాపులను తనిఖీ చేసి, అక్కడి ప్రజల నుంచి సమాచారం అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నగరంలో కరోనా వైరస్‌ ప్రబలకుండా కార్మికులు పెద్ద ఎత్తున పనులు చేపడుతున్నారని తెలిపారు. రేషన్‌ షాపుల్లో ఉచిత బియ్యాన్ని నెలాఖరు వరకూ పంపిణీ చేస్తామని చెప్పా రు. రాష్ట్రంలో 110 కోట్ల వ్యయంతో 2.80కోట్ల మందికి ఉచితంగా రేషన్‌ అందిస్తున్నామన్నారు. 87 లక్షల ఆహార భద్రత కార్డుదారుల్లో ఇప్పటికే 35 శాతం మందికి బియ్యం పంపిణీ చేశామని, అందరికీ అందే వరకు పంపిణీ కొనసాగిస్తామన్నారు. గ్రామీ ణ ప్రాంతాల్లో బయోమెట్రిక్‌ అవసరం లేకుండానే పంపిణీ చేస్తున్నామన్నారు. బి య్యం తీసుకున్నా, తీసుకోకపోయినా ప్రతి పేద కుటుంబానికి 1500 అందిస్తామని స్పష్టం చేశారు. పలు గ్రామాల్లో ప్రజలు బయటకు రాకుండా ఉండేందుకు ఇళ్ల వద్దకే ప్రజాప్రతినిధులు బియ్యం పంపిణీ చేయ డం శుభసూచకమన్నారు. నిరుపేదలు ఆకలితో అలమటించకుండా ఉండేందుకు సీఎం కేసీఆర్‌ తీసుకున్న ఈ గొప్ప నిర్ణయానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.


logo