సోమవారం 13 జూలై 2020
Rajanna-siricilla - Mar 30, 2020 , 01:25:44

మేమున్నామని..

మేమున్నామని..

  • పేదలు, కూలీలు, యాచకులకు అండగా నిలుస్తున్న దాతలు
  • టిఫిన్స్‌, అన్నదానం, పండ్లు, నిత్యావసర సరుకుల పంపిణీ

లాక్‌డౌన్‌ నేపథ్యంలో పేదలు, కూలీలు, యాచకులకు సామాజిక సేవా కార్యకర్తలు అండగా నిలుస్తున్నారు. కష్ట కాలంలో తామున్నమంటూ భరోసా ఇస్తున్నారు. పనుల్లేక పస్తులుంటున్న పేదల, భిక్షాటన చేసే వారి కడుపు నింపుతున్నారు. ఇతర రాష్ర్టాలకు వెళ్తున్న కార్మికుల ఆకలి తీరుస్తున్నారు. ఇటు నిరంతర సేవలందిస్తున్న పోలీసులకు, పారిశుధ్య కార్మికులకు సైతం అల్పాహారం ఇస్తూ ఉడతా భక్తిని చాటుకుంటున్నారు. 

కరీంనగర్‌ జిల్లా.. 

కరీంనగర్‌ హెల్త్‌/హుజూరాబాద్‌టౌన్‌/వీణవంక/ సైదాపూర్‌: కరీంనగర్‌లోని ‘మీ కోసం స్వచ్ఛంద సంస్థ’ ఇంటర్నేషనల్‌ వైశ్య ఫెడరేషన్‌ అధ్యక్షుడు నగునూరి రాజేందర్‌ తనవంతు స హాయంగా వైద్య, పోలీసు, నగరపాలక సంస్థ సిబ్బందికి ఆరు రోజుల నుంచి ప్రతిరోజూ భోజనాలు అందిస్తున్నారు. ఆదివా రం ప్రభుత్వ దవాఖానలో పని చేస్తున్న సిబ్బందికి ఆహారాన్ని అందజేశారు. కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ పట్టణంలోని 6వ వార్డులోని పేదలకు టీఆర్‌ఎస్‌ రాష్ట్ర సహాయ కార్యదర్శి బండ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో నాయకులు ఇంటింటికీ తిరిగి ఉచితంగా కూరగాయలు పంపిణీ చేశారు. వీణవంకలో దినసరి కూలీలకు బీజేపీ నాయకులు 100 కిలోల బియ్యాన్ని అం దజేశారు. సైదాపూర్‌ మండలకేంద్రంలో ఆరుగురు వలస కూ లీలకు బీజేపీ ఆధ్వర్యంలో 15రోజులకు సరిపడా నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. హైదరాబాద్‌ నుంచి కాలినడకన కరీంనగర్‌కు చేరుకున్న ఉత్తర ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌కు చెందిన పలువురికి కరీంనగర్‌లోని రోటరీ క్లబ్‌ ఆధ్వర్యంలో మజ్జిగ ప్యాకెట్లను ట్రాఫిక్‌ ఏసీపీ శంకర్‌ పంపిణీ చేశారు. భోజన సదుపాయం కల్పించి కారులో గోదావరిఖనికి పంపించారు. కరీంనగర్‌లోని ప్రముఖ వైద్యుడు పుల్లెల పవన్‌కుమార్‌ సుమారు 200 మంది పేదలకు ఆహారం పంపిణీ చేశారు.

జగిత్యాల జిల్లా..

జగిత్యాల/ మెట్‌పల్లి/ధర్మపురి, నమస్తే తెలంగాణ/ కోరుట్ల/ కోరుట్లటౌన్‌/మెట్‌పల్లిటౌన్‌/మెట్‌పల్లిరూరల్‌/మేడిపల్లి/ మల్యాల /సారంగాపూర్‌ :  ధర్మపురి క్షేత్రంలోని గోదావరి నది ఒడ్డున గల భిక్షకులకు 4వ వార్డు కౌన్సిలర్‌ పురాణపు కిరణ్మయి-సాం బు దంపతులు ఆదివారం భోజనం అందించారు. ఇంట్లోనే భోజనం ప్యాక్‌చేసి పంపిణీ చేశారు. ధర్మపురి ఎస్‌ఐ శ్రీకాంత్‌ కూడా పండ్లు, బిస్కట్లు అందజేశారు. బంగారం దుకాణాల్లో బూడిద సేకరించేవారికి 3వ వార్డు కౌన్సిలర్‌ సంగబట్ల సంతోషి-దినేశ్‌ భోజనం అందజేశారు. మేడిపల్లి మండల కేంద్రంలో మాజీ సర్పంచ్‌ బొంగోని రాజాగౌడ్‌ ఆధ్వర్యంలో 60 మంది కూలీలకు అన్నం ఫ్యాకెట్లను కలెక్టర్‌ గుగులోత్‌ రవినాయక్‌, జడ్పీ ఉపాధ్యక్షుడు వొద్దినేని హరిచరణ్‌రావు, ఎంపీపీ దోనకంటి ఉమాదేవి పంపిణీ చేశారు. మెట్‌పల్లి పట్టణంలోని స్నే హాలయ ఫ్రెండ్స్‌ అసోసియేషన్‌ సభ్యులు ఫులిహోర, భోజనం ప్యాకెట్లను యాచకులు, అనాథలు, కూలీలకు పంపిణీ చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో పోలీస్‌ సిబ్బందికి, టౌన్‌హాల్‌లో ఉంటున్న పేదలకు వందన ఆటోస్టోర్స్‌ అధినేత సిరిపురం శ్రీనివాస్‌, 45వ వార్డు కౌన్సిలర్‌ జగదీశ్‌ ఆదివారం అల్పాహారం, టీ అందజేశారు. జగిత్యాల హెల్పింగ్‌ హ్యాండ్స్‌ సభ్యుడు నిమిషకవి సాయికృష్ణ, యాచకులకు భోజనం అందజేశారు. మెట్‌పల్లి పట్టణానికి చెందిన కొబ్బరికాయల వ్యాపారి బాల్క అశోక్‌ జ్యూస్‌ తన కూతురు విద్య, కొడుకు రాఘవతో కలిసి పట్టణంలోని పాత బస్టాండ్‌ వద్ద విధుల్లో ఉన్న పోలీసులకు బాదం జ్యూస్‌, అరటి పండ్లు, తాగునీటి బాటిళ్లను అందించారు. కో రుట్ల పట్టణానికి చెందిన నీలి శ్రీనివాస్‌ నక్కల గుట్ట, మాదాపూర్‌ రోడ్డు ప్రాంతాల్లో గుడిసెల్లో ఉంటున్న 30 కుటుంబాలకు 10 కిలోల చొప్పున బియ్యం, సరుకుల ప్యాకెట్లను అం దించాడు. మల్యాల మండలం బల్వంతాపూర్‌కు చెందిన యు వకుడు దొమ్మాటి నవీన్‌ గ్రానైట్‌ క్వారీలో కూలీలకు పది రోజులకు సరిపడా నిత్యావసర వస్తువులు అందజేశాడు. మెట్‌పల్లి మండలం రామలచ్చక్కపేటలో ఉప సర్పంచ్‌ పాలెపు రాజగంగారాం రూ. పది వేల విలువ గల నిత్యావసరాలను అందించారు. పారిశుధ్య పనుల కోసం మేడిపల్లి మండలంలోని కొం డాపూర్‌ మాజీ సర్పంచ్‌ మెన్నేని ధర్మారావు కొడుకు తిరుమల్‌రావు, సర్పంచ్‌ ద్యావనపెల్లి అభిలాష్‌కు రూ.10,111 విరా ళం అందజేశారు. కోరుట్ల మండలం మండలం మాదాపూర్‌ లో సర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షుడు దారిశెట్టి రాజేశ్‌, సిం గిల్‌ విండో అధ్యక్షుడు గడ్డం ఆదిరెడ్డి సహకారంతో గ్రామస్తులకు శానిటేషన్‌ వస్తువులను పంపిణీ చేశారు. సారంగాపూర్‌ మండలం రేచపల్లికి చెందిన టైలర్‌ దీటి మౌనిక 230 వరకు మాస్కులు కుట్టి పంపిణీ చేసింది. ఇదే గ్రామానికి చెందిన టైలర్లు గుజ్జెటి మల్లేశం, జమున సైతం మాస్కులు కుట్టి అందిస్తున్నారు. ధర్మపురి పట్టణానికి చెందిన గోలి శ్రీనివాస్‌ 150 మాస్కులు అందించాడు.   

సిరిసిల్ల జిల్లా..

వేములవాడ, నమస్తేతెలంగాణ/ వేములవాడరూరల్‌/సిరిసిల్ల టౌన్‌/ సిరిసిల్ల రూరల్‌/ ఇల్లంతకుంట : వేములవాడలోని సంచార కార్మికులకు కలెక్టర్‌ ఆదేశాలతో తాసిల్దార్‌ నక్క వెం కటేశం ఒక్కో కుటుంబానికి 12 కిలోల బియ్యం, గోధుమల ను అందజేశారు. మర్రిపల్లిలో వలస కూలీలకు నిత్యావసర సరుకులను రూరల్‌ ఎస్‌ఐ సౌమ్యరెడ్డి అందజేశారు. రుద్రవరంలో వలస కూలీలకు 50 కిలలో బియ్యాన్ని సర్పంచ్‌ ఊరడి రాంరెడ్డి ఆధ్వర్యంలో పంపిణీచేశారు. సిరిసిల్ల మున్సిపల్‌ పరిధిలోని చంద్రంపేటలో ఇటుక బట్టీ కార్మికులకు తాసిల్దార్‌ అంజన్న, మున్సిపల్‌ కమిషనర్‌ సమ్మయ్య బియ్యం అందజేశారు. తంగళ్లపల్లి మండలం తాడూరులో కార్మికులకు రాజేందర్‌రావు సహాయంతో బియ్యం పంపిణీ చేశారు. సిరిసిల్లలోని యాచకులకు జిల్లెల్లలోని నరేన్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో కానిస్టేబుల్‌ శ్రీనివాస్‌తో కలిసి పలువురు సభ్యులు ఉప్మా, ఆహార పదార్థాలు అందజేశారు. అపెరల్‌ కార్మికులకు కౌన్సిలర్‌ సత్యనారాయణ 50 కిలోల బియ్యం అందజేశారు. సిరిసిల్లలోని సుభాష్‌నగర్‌లో ఒరిస్సా, ఉత్తరప్రదేశ్‌ రాష్ర్టాలకు చెందిన వల స కార్మికులకు టీఆర్‌ఎస్‌ యువజన విభాగం ఆధ్వర్యంలో ని త్యావసర సరుకులను మున్సిపల్‌ అధ్యక్షురాలు జిందం కళ పంపిణీ చేశారు. ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లిలో పేద చిరువ్యాపారులైన ఎగుల్ల గంగ-సురేశ్‌ దంపతుల కుటుంబానికి ఉపసర్పంచ్‌ పెంజర్ల దేవయ్య బియ్యం, నిత్యావసర వస్తువులను వితరణగా అందించారు. ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్‌లో జార్ఖండ్‌, బీహార్‌, మహబూబ్‌నగర్‌ ప్రాంత భవన నిర్మాణ కార్మికులకు సర్పంచ్‌ జితేందర్‌ గౌడ్‌ డబుల్‌ బెడ్‌ రూంఇండ్ల నిర్మాణ ప్రాంతంలో ఆశ్రయం కల్పించారు. 50 కిలోల బియ్యం, నిత్యావసర వస్తువులు అందజేశారు. వే ములవాడ పురపాలక సంఘం ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఉచితంగా భోజనాలను అందిస్తున్నామని మున్సిపల్‌ అధ్యక్షులు మాధవి పేర్కొన్నారు. ఆదివారం సాయిరక్షదాబా, బుడగజంగాల కాలనీ, జగిత్యాల బస్టాండ్‌ ప్రాంతంలో సంచార జాతు లు, నిరుపేదలకు, సంచార జాతులకు ఆమె అన్నపూర్ణ పథకం ద్వారా భోజనాన్ని ఉచితంగా అందజేశారు. కమిషనర్‌ మట్ట శ్రీనివాస్‌రెడ్డి, వైస్‌చైర్మన్‌ మధురాజేందర్‌, సెస్‌ డైరెక్టర్‌ రామతీర్థపు రాజు, కౌన్సిలర్లు విజయ్‌, శ్రీలత ఉన్నారు.

పెద్దపలి జిల్లా..

ఫెర్టిలైజర్‌సిటీ / సుల్తానాబాద్‌ : రామగుండం ట్రాఫిక్‌ సీఐ రమేశ్‌బాబు ఆదేశాల మేరకు ఖని ట్రాఫిక్‌ ఏఎస్‌ఐ చారి, హెడ్‌ కానిస్టేబుల్‌ బాయి శ్రీనివాస్‌ తదితరులు పలువురు అన్నార్థులకు ఆహార ప్యాకెట్లను పంపిణీ చేశారు. సుల్తానాబాద్‌ వాకర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో పురం వెంకటరమణ నేతృత్వంలో పేదలకు అన్నదానం చేపట్టగా, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సునీత ప్రారంభించారు.

మానవత్వం చాటిన ఖాకీలు..

గోదావరిఖనిలోని విఠల్‌నగర్‌కు చెందిన స్నేహలత అనే గర్భిణీ పురిటి నొప్పులతో బాధపడుతున్నదని తెలుసుకున్న సీఐ రమేశ్‌, ఎస్‌ఐ వెంకటేశ్వర్లు అంబులెన్స్‌ను తెప్పించి ఏఎస్‌ఐ మల్లయ్య, హోంగార్డు సారయ్య సహకారంతో ప్రభుత్వ దవాఖానకు తరలించారు. మంచిర్యాల ప్రభుత్వ దవాఖాన లో తన భర్త ప్రాణపాయ స్థితిలో ఉన్నాడని, సహాయం చేయమని ఓ పేద మహిళ విన్నవించగా, వన్‌ టౌన్‌ ఎస్‌ఐ వెంకటేశ్వర్లు కొంత డబ్బు ఇచ్చి వాహన సౌకర్యాన్ని కల్పించారు. స్వ తంత్ర చౌక్‌కు చెందిన రాజు అనే వ్యక్తి సోదరి పురిటి నొప్పులతో బాధపడుతుండగా బ్లూకోల్ట్‌ సిబ్బంది మల్లయ్య, కిషన్‌ ఆమెను ప్రభుత్వ దవాఖానలో చేర్పించారు.

నిత్యావసరాల డోర్‌డెలివరీ

సుల్తానాబాద్‌ : పట్టణ ప్రజల సౌకర్యార్థం కిరాణ వస్తువులను డోర్‌ డెలివరీ చేసేందుకు స్థానిక వర్తక సంఘం ముందుకు వచ్చిందని సుల్తానాబాద్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ముత్యం సునీత తెలిపారు. మధ్యప్రదేశ్‌కు చెందిన వలస కూలీలకు స్థానిక కిరాణ వర్తక సంఘం సభ్యులు అందజేసిన నిత్యావసర సరుకులను మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పంపిణీ చేశారు. నిత్యావసర వస్తువుల కొనుగోలు కోసం ఉదయం 6 గంటల నుంచి ఉదయం 9గంటల వరకు మాత్రమే ప్రజలు బయటకు రావాలని సూచించారు. 

మంచిర్యాల జిల్లా..

మంచిర్యాల టౌన్‌/చెన్నూర్‌, నమస్తే తెలంగాణ/మంచిర్యాల అగ్రికల్చర్‌/శ్రీరాంపూర్‌/తాండూర్‌/కోటపల్లి/మందమర్రి:  కరోనా కల్లోలం నేపథ్యంలో వలస కూలీలు, అనాథలు, యాచకులకు అండగా నిలుస్తామని రామగుండం సీపీ సత్యనారాయణ పేర్కొన్నారు. ఆదివారం మంచిర్యాలలో కార్మికులుగా పనిచేస్తున్న ఉత్తరప్రదేశ్‌కు చెందిన 60 కుటుంబాలకు 15 రోజులకు సరిపడా సరుకులు అందించారు. కమిషనరేట్‌ పరిధిలో దాదాపు 47 వేల మంది వలస కూలీలు ఉన్నట్లు గు ర్తించామని.. వీరికి ఇక్కడనే ఉంచాలని తెలిపామన్నారు. కరీంనగర్‌కు చెందిన ఇద్దరు యువకులు మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు కాలినడకన వెళ్తుండగా.. వీరికి సీపీ వాహనాన్ని సమకూర్చారు. మంచిర్యాలలోని రైల్వేస్టేషన్‌ పరిధిలో గల 80 మంది యాచకులకు నల్ల కోటమ్మ, లక్ష్మయ్య మెమోరియల్‌ ట్రస్ట్‌ ఆ ధ్వర్యంలో 13 వార్డు కౌన్సిలర్‌ నల్ల శంకర్‌ ఆహార పొట్లాలను అందించారు. అలాగే మంచిర్యాల బస్టాండ్‌, కూడళ్లలో మంచిర్యాల ఆవోపా, శ్రీ సాయిరాం యూత్‌ గణేశ్‌ మండలి, ఫ్రెం డ్స్‌ యానిమల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో అల్పాహారం, భోజనం ఉచితంగా పంపిణీ చేశారు. హైదరాబాద్‌లో కూలీలుగా పనిచేస్తు న్న దాదాపు 30 మంది పిల్లాపాపలు, ముల్లెమూటతో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌లకు వెళ్తూ, శ్రీరాంపూర్‌ చేరుకున్నారు. వీరికి పత్తి గట్టయ్య చారిటీ ట్రస్ట్‌ చైర్మన్‌ అధ్యక్షుడు పత్తి వెంకటేశ్‌ అన్నదానం చేశారు. తాండూర్‌లో చెక్‌పోస్టు వద్ద 60మంది పోలీసులకు తాండూర్‌ కోఆప్షన్‌ సభ్యుడు రాంచందర్‌ భోజన సదుపాయం కల్పించారు. అలాగే కోటపల్లి మం డలం రాపనపల్లి సమీపంలోని అంతర్రాష్ట్ర వంతెన చెక్‌పోస్టు వద్ద విధులు సిబ్బందికి ఎంపీపీ మంత్రి సురేఖ ఆధ్వర్యంలో భోజన వసతి కల్పించారు. నిరుపేదల ఆకలి తీర్చేందుకు మందమర్రి సీఐ ఎడ్ల మహేశ్‌, ఎస్‌ఐ శివకుమార్‌ ఆధ్వర్యంలో 250 మందికి నిత్యావసర సరుకులను సీపీ సత్యనారాయణ పంపిణీ చేశారు. రామగుండం పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో 575 మంది అనుమానితులను గుర్తించామని, అందులో 60 శాతం మంది క్వా రంటైన్‌ నుంచి హోంక్వారంటైన్‌కు చేరుకున్నారని తెలిపారు.

ఆసిఫాబాద్‌ జిల్లా

ఆసిఫాబాద్‌, నమస్తే తెలంగాణ, కాగజ్‌నగర్‌ టౌన్‌, ఆసిఫాబాద్‌ టౌన్‌, వాంకిడి : లాక్‌డౌన్‌తో ఇటు జిల్లాలో ఉపాధి కరువై అల్లాడుతున్న కూలీలు, నిరుపేదలతో పాటు ఇతర రాష్ర్టాలకు వెళ్తున్న కార్మికులకు మేమున్నామంటూ భరోసా ఇస్తున్నారు పలువురు దయార్ద్ర హృదయులు. సికింద్రాబాద్‌ నుంచి బీ హార్‌ వెళ్తున్న 25 మంది కూలీలు రాష్ట్ర సరిహద్దు వరకు వెళ్లేందుకు జడ్పీ అధ్యక్షురాలు కోవ లక్ష్మి ట్రాక్టర్‌ను సమకూర్చారు. ఖర్చులకు ఆర్థిక సాయంతో పాటు భోజన సౌకర్యం కూడా క ల్పించారు. ఇందులో భాగంగా ఆదివారం హైదరాబాద్‌ నుం చి మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌ వెళ్తూ ఆసిఫాబాద్‌ చేరుకున్న కూ లీలకు ఆర్‌ఎస్‌ఎస్‌ సంస్థ సభ్యులు మసాడే పవన్‌, సంతోశ్‌, విలాస్‌ నిత్యావసర సరుకులు అందజేశారు. వాంకిడి మీదుగా రాజస్థాన్‌కు వెళ్తున్న నలుగురు కూలీలకు పోలీస్‌, రవాణా శాఖ అధికారులు భోజనం, తాగునీటి సౌకర్యం కల్పించారు. కాగజ్‌నగర్‌లో మున్సిపల్‌ చైర్మన్‌ సద్దాం హుస్సేన్‌, లాయర్‌ కిశోర్‌ కుమార్‌ పారిశుధ్య కార్మికులకు పులిహోర ప్యాకెట్లు, తాగునీటి బాటిళ్లను అందజేశారు. కాగజ్‌నగర్‌ యునిటీ ఆధ్వర్యంలో లారీ చౌరస్తా సమీప కాలనీలో నిరుపేదలకు నిత్యావసర సరుకులను ఎస్‌ఐ తహిసొద్దీన్‌, యూనిట్‌ సభ్యులు వసీంతో కలిసి పంచారు. బీజేపీ నాయకులు డాక్టర్‌ కొత్తపల్లి శ్రీనివాస్‌-అనిత 60 మందికి ఆహార పొట్లాలు అందజేశారు.


logo