శనివారం 04 జూలై 2020
Rajanna-siricilla - Mar 28, 2020 , 02:49:50

అప్రమత్తంగా ఉండాలి

అప్రమత్తంగా ఉండాలి

  • ప్రతిఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించాలి
  • హుస్నాబాద్‌ ఎమ్మెల్యే వొడితల సతీశ్‌కుమార్‌
  • చిగురుమామిడి, సైదాపూర్‌ ఎంపీడీవో కార్యాలయాల్లో ‘కరోనా’పై సమీక్ష
  • అధికారులు, ప్రజాప్రతినిధులకు పలు సూచనలు

చిగురుమామిడి/సైదాపూర్‌: కరోనా వైరస్‌ను అరికట్టేందుకు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించాలని హుస్నాబాద్‌ ఎమ్మెల్యే వొడితల సతీశ్‌కుమార్‌ పిలుపునిచ్చారు. చిగురుమామిడి, సైదాపూర్‌ ఎం పీడీవో కార్యాలయాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులతో ‘కరోనా’పై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ, కరోనా నివారణ చర్యల్లో అధికారులతోపాటు ప్రజాప్రతినిధు లూ భాగస్వాములవ్వాలని ఆదేశించారు. పలు గ్రామాల్లోని బెల్టుషాపుల్లో మద్యం విక్రయిస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని, ఎక్సైజ్‌ శాఖ ప్రత్యేక దృష్టిపెట్టాలన్నారు. వైరస్‌ను అరికట్టేందుకు ప్రభుత్వానికి తన తండ్రి, రాజ్యసభ సభ్యుడు కెప్టెన్‌ లక్ష్మీకాంతారావు ఎంపీ గ్రాంటు, తన ఏసీడీపీ నిధులు, నెల జీతం మొత్తం 8 కోట్లు సీఎంఆర్‌ఎఫ్‌కు అందజేస్తున్నారని చెప్పారు. చిగురుమామి డి ఎంపీటీసీలు, సర్పంచుల నెల వేతనం 1.50 లక్షల చెక్కును ఎంపీపీ కొత్త వినీత, సర్పంచులఫోరం అధ్యక్షుడు జక్కుల రవి ఎమ్మెల్యే సమక్షం లో తాసిల్దార్‌ రవీందర్‌రెడ్డికి అందించారు. రాయికల్‌ గ్రామానికి చెందిన రావుల లావణ్య గంగాధర్‌రెడ్డి సీఎంరిలీఫ్‌ ఫండ్‌కు విరాళంగా 10 వేల చెక్కును ఎమ్మెల్యేకు అందించారు. ఇక్కడ చిగురుమామిడి జడ్పీటీసీ గీకురు రవీందర్‌, వైస్‌ ఎంపీపీ బేతి రాజిరెడ్డి, సర్పంచ్‌లఫోరం అధ్యక్షుడు జక్కు ల రవి, ఎంపీడీవో ఖాజామొహినొద్దీన్‌, తాసిల్దార్‌ రవీందర్‌, ఎస్‌ఐ మధుకర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ జిల్లా నాయకుడు కొత్త శ్రీనివాస్‌రెడ్డి, సింగిల్‌విండో చైర్మన్‌ జంగ వెంకటరమణారెడ్డి, డైరెక్టర్‌ ఎడవెల్లి భాస్కర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షులు రామో జు కృష్ణమాచారి, సోమారపు రాజయ్య, సైదాపూర్‌ ఎంపీపీ సారబుడ్ల ప్రభాకర్‌రెడ్డి, వైస్‌ఎంపీపీ రావుల శ్రీధర్‌రెడ్డి, సింగిల్‌విండో చైర్మన్‌ కొత్త తిరుపతిరెడ్డి, తాసిల్దార్‌ దేవేందర్‌రావు, ఎంపీడీవో వినోద, ఎస్‌ఐ ప్రశాంతరావు, మండల వైదాధికా రి ఫాతిమా, సర్పంచ్‌లు కొండ గణేష్‌, కాయిత రాములు, కొత్త రాజిరెడ్డి పాల్గొన్నారు.


logo