గురువారం 04 జూన్ 2020
Rajanna-siricilla - Mar 27, 2020 , 02:30:12

ఇంటి వద్దకే రేషన్‌ బియ్యం

ఇంటి వద్దకే రేషన్‌ బియ్యం

  • లాక్‌డౌన్‌లో పేదలకు అండగా సీఎం కేసీఆర్‌
  • ప్రజలు స్వచ్ఛందంగా సహకరిస్తేనే ‘కరోనా’కు చెక్‌ 
  • సామాజిక దూరం పాటించండి n మంత్రి గంగుల కమలాకర్‌
  • కిసాన్‌నగర్‌లో రేషన్‌ సరుకుల పంపిణీ ప్రారంభం

కార్పొరేషన్‌, నమస్తే తెలంగాణ : లాక్‌డౌన్‌ సందర్భంగా నిరుపేదలకు ఇబ్బంది కలుగవద్దనే ఆలోచనతో ఇంటి వద్దే బియ్యం, కూరగాయలు అందిస్తున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ పేర్కొన్నారు. ప్రజలు సంపూర్ణంగా సహకరించినప్పుడే కరోనా వైరస్‌ను కట్టడి చేయడం సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు. కరీంనగర్‌లోని కిసాన్‌నగర్‌లో రేషన్‌ బియ్యం పంపిణీని మంత్రి గంగు ల ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లాక్‌డౌన్‌ వల్ల పేదలు ఇంటికే పరిమితం కావడంతో సీఎం కేసీఆర్‌ మానవతా దృక్పథంతో బియ్యం, కూరగాయలు అందించేందుకు నిర్ణయించారని తెలిపారు. రెండు నెలల కోసం ప్రతి వ్యక్తికీ 12 కిలోల చొప్పున బియ్యం అందిస్తున్నామని పేర్కొన్నారు. ఎవరికీ ఇబ్బంది లేకుండా రేషన్‌ పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు. ప్రజలంతా ఇంటి వద్దే ఉండి, ‘కరోనా’ను కట్టడి చేసేందుకు సహకరించాలని కోరారు. ప్రజలకు అ వసరమైన అన్ని సౌకర్యాలను టీఆర్‌ఎస్‌ ప్రభు త్వం కల్పిస్తున్నదని, అందరూ సహకరించి మరో 20 రోజులు ఇంటికే పరిమితం కావాలని సూచించారు. కూరగాయలు, సామగ్రి కోసం ప్రజలు ఒకేచోట గుమిగూడితే వైరస్‌ ప్రబలే ప్రమాదం ఉన్నదని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా సామాజిక దూరం పాటించాలని కోరారు. ప్రభుత్వాలు ఎన్ని కార్యక్రమాలు తీసుకున్నా, ప్రజలు సహకరించకపోతే ఏమీ చేయలేమన్నారు. వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా ఉన్నదని, ఈ విషయంలో నిర్లక్ష్యం చూపడం సరికాదని చెప్పారు. ఈ కార్యక్రమంలో మేయర్‌ వై సునీల్‌రావు, అదనపు కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌లాల్‌, కార్పొరేటర్‌ సరిత, నాయకులు చల్ల హరిశంకర్‌, పెండ్యాల మహేశ్‌ తదితరులు పాల్గొన్నారు. 

సామాజిక దూరం పాటించండి.. 

ప్రభుత్వం ఎంత చేసినా ప్రజలు గుంపులు గుంపులుగా సంచరిస్తూ, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మంత్రి గంగుల కమలాకర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం ఆయన నగరంలోని పలు మార్కెట్లలో పర్యటించారు. ఈ సందర్భంగా కూరగాయల కొనుగోలు వద్ద, కిరాణా దుకాణాల వద్ద ప్రజలు గుమిగూడి ఉండడంపై మంత్రి మం డిపడ్డారు. సామాజిక దూరం పాటించి క్రమశిక్షణగా సరుకులు తీసుకోవాలని చెబితే ఎవరూ విన డం లేదని అసహనం వ్యక్తం చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ కరోనాను తేలికగా తీసుకోవద్దని, వైరస్‌ను కట్టడి చేసేందుకు ప్రభుత్వం తీసుకున్న సామాజిక దూరం పాటించడాన్ని విస్మరించడం మంచి పద్ధతి కాదని పేర్కొన్నారు. ప్రజల క్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాన్ని పాటించకపోవడం అత్యంత ప్రమాదకరమని హెచ్చరించారు. ఇకనుంచి మార్కెట్ల వద్ద కఠినంగా వ్యవహరించాల్సి వస్తుందని చెప్పారు. నగరంలోని అన్ని మార్కెట్లను మూసివేసి మార్కె ట్‌ యార్డులో ఒకేచోట కూరగాయలు అమ్మేందు కు సన్నాహాలు చేస్తామన్నారు. హోల్‌సేల్‌ మార్కె ట్లు, కూరగాయల మార్కెట్ల వద్ద సామాజిక దూ రం పాటించకుంటే పోలీసులు కఠిన నిబంధనలు అమలు చేయాలని ఆదేశించారు. ఆయన వెంట మేయర్‌ వై సునీల్‌రావు, మున్సిపల్‌ కమిషనర్‌ క్రాంతి, డిప్యూటీ మేయర్‌ చల్లా స్వరూపరాణి, కార్పొరేటర్లు దిండిగాల మహేశ్‌, పిట్టల శ్రీనివాస్‌, ఎడ్ల సరిత, కంసాల శ్రీనివాస్‌, కుర్ర తిరుపతి, మార్కెటింగ్‌శాఖ డీడీ పద్మావతి, అడిషన్‌ మున్సిపల్‌ కమిషనర్‌ బీ శ్రీనివాస్‌, హార్టికల్చర్‌ డీడీ శ్రీనివాస్‌, ట్రాఫిక్‌ ఏసీపీ, టౌన్‌ ఏసీపీ పాల్గొన్నారు. 


logo