సోమవారం 01 జూన్ 2020
Rajanna-siricilla - Mar 27, 2020 , 02:31:11

వైరస్‌ నియంత్రణకు పకడ్బందీ చర్యలు

వైరస్‌ నియంత్రణకు పకడ్బందీ చర్యలు

  • సామాజిక దూరంతోనే కట్టడి చేయవచ్చు
  • లాక్‌డౌన్‌ను ప్రజలు స్వచ్ఛందంగా స్వీకరించాలి
  • నిబంధనలను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు 
  • ప్రభుత్వ ఆదేశాలను అధికారులు పక్కాగా అమలుచేయాలి
  • నిత్యావసర వస్తువుల రవాణాకు అంతరాయం కలిగించవద్దు
  • రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్‌ 
  • పెద్దపల్లి జిల్లా కేంద్రంలో సమీక్ష 
  • పాల్గొన్న జడ్పీ చైర్మన్‌ మధు, ఎమ్మెల్యేలు కోరుకంటి, దాసరి 

జగిత్యాల, నమస్తే తెలంగాణ/జగిత్యాల రూరల్‌/జగిత్యాల అర్బన్‌: కరోనాపై ముందస్తు జాగ్రత్తలు తప్పని సరిగా తీసుకోవాలని జగిత్యాల కలెక్టర్‌ జీ రవి సూచించారు. జిల్లా కేంద్రంలోని ఐఎంఏ హాలులో జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి ప్రైవేట్‌ మెడికల్‌ అసోసియేషన్‌ వారితో ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌తో కలిసి గురువారం సమావేశం నిర్వహించారు. ఇక్కడ కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వర కు కరోనా పాజిటివ్‌ ఎవరికీ రాలేదని, అయినా మనమంతా అప్రమత్తంగా ఉండాలని సూచించా రు. జిల్లా నుంచి ఇతర దేశాలు, రాష్ర్టాలకు వెళ్లిన వారు 2,248 మంది వచ్చారని, వారిని 14 రోజు ల దాకా హోం క్వారంటైన్‌లో ఉంచి ప్రత్యేక చర్య లు చేపట్టినట్లు తెలిపారు. ఇతర దేశాల నుంచి వచ్చిన వారి లిస్టులో 250 మంది పేర్లు మాత్రమే హైదరాబాద్‌ నుంచి వచ్చాయని, జిల్లా బృందాలు మండలాల వారీగా తిరిగి మిగతా వారి వివరాలు సేకరిస్తున్నాయని తెలిపారు. జిల్లా ప్రధాన వైద్యశాల, మెట్‌పల్లి, దవాఖానలో మొత్తం 100 పడకలతో ఐసోలేషన్‌ వార్డులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇవి సరిపోకుంటే ప్రైవేట్‌ వైద్యశాలలను, సిబ్బందిని తీసుకుంటామన్నారు. ఈ మేర కు వివరాలు అందించాలని, ఉద్యోగ విరమణ పొందిన తాసిల్దార్లు, ఆర్మీ, పోలీస్‌ల వివరాలను సైతం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి, అడిషన ల్‌ కలెక్టర్‌కు ఇవ్వాలని సూచించారు. క్లినిక్‌కు వె ళ్లేందుకు పాస్‌ల జారీపై పరిశీలిస్తామని చెప్పారు. 

ముందు జాగ్రత్త చర్యలతోనే కేసులు లేవు

ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌ మాట్లాడుతూ జిల్లాలో ముందు జాగ్రత్త చర్యల వల్ల కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా చర్యలు తీసుకుంటున్నదని, మన వంతుగా సహాయ సహకారాలు అందించాలని కోరారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ రాజేశం, వైద్య ఆరోగ్య శాఖ అధికారి శ్రీధర్‌, డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో జైపాల్‌ రెడ్డి, ప్రోగ్రాం అధికారి సమీయోద్దిన్‌ పాల్గొన్నారు. 

పలు గ్రామాల్లో ఎమ్మెల్యే అవగాహన

ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌, జడ్పీ అధ్యక్షురాలు వసంత కలిసి జగిత్యాల మండలం కల్లెడ, చల్‌గల్‌, మోరపెల్లిలో ప్రజలకు అవగాహన కల్పించారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు. సర్పంచులు జోగినపెల్లి మహేశ్వర్‌ రావు, ఎల్ల గంగనర్సు,  సింగిల్‌ విండో చైర్మన్లు పత్తిరెడ్డి మహిపాల్‌ రెడ్డి, సందీప్‌ రావు, ఎంపీటీసీలు భూంరెడ్డి, పరశురాంగౌడ్‌ పాల్గొన్నారు. 

స్ప్రే ట్యాంకర్ల ప్రారంభం 

జగిత్యాల పట్టణంలోని పలు వార్డుల్లో శానిటైజేషన్‌ స్ప్రే చేసేందుకు 9ట్యాంకర్లను కలెక్టర్‌ రవి, ఎమ్మెల్యే సంజయ్‌ ప్రారంభించారు.  కరోనాపై సోషల్‌ మీడియా అసత్య ప్రచారాలు చేయవద్దని కోరారు. పట్టణ శుభ్రతకు పాటుపడుతున్న మున్సిపల్‌ సిబ్బందికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. అంతకు ముందు కలెక్టర్‌ రవి టవర్‌ ప్రాంతంలో ప్రధాన కూరగాయల మార్కెట్‌ రోడ్డును పరిశీలిం చి వ్యాపారులతో మాట్లాడారు. కార్యక్రమంలో మున్సిపల్‌ అధ్యక్షురాలు బోగ శ్రావణి, మున్సిపల్‌ కమిషనర్‌ జయంత్‌ కుమార్‌ రెడ్డి, డీఈ లచ్చిరెడ్డి పాల్గొన్నారు. ప్రచార రథం ద్వారా అవగాహన, జాగ్రత్తలతో కూడిన పాటలను ప్రజలకు వినిపించారు. ఆయన వెంట స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు ఉన్నారు. 


logo