సోమవారం 06 జూలై 2020
Rajanna-siricilla - Mar 16, 2020 , 02:30:19

నేత్రపర్వం.. త్రిశూల స్నానం

నేత్రపర్వం.. త్రిశూల స్నానం
  • ముక్కంటి సన్నిధిలో వెల్లివిరిసిన ఆధ్యాత్మిక పరిమళం
  • పూర్ణాహుతితో ముగిసిన శివకల్యాణ మహోత్సవాలు
  • పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు..

వేములవాడ కల్చరల్‌: ఐదురోజులుగా రాజన్న ఆలయంలో ఘనంగా నిర్వహించిన శివకల్యాణమహోత్సవాలు ఆదివారం పూర్ణాహుతితో ముగిశాయి. ఉదయం స్వామివారికి ఆలయ స్థానాచార్యులు అప్పాల భీమాశంకర్‌ ఆధ్వర్యంలో అర్చకులు మహాన్యాసపూర్వక  ఏకాదశ రుద్రాభిషేకం, పరివార దేవతలకు దేవతార్చనలు, అభిషేక పూజలను నిర్వహించారు.  ఉదయం  బలిహరణ కార్యక్రమంలో జంగమయ్యలు శరభ గద్యాలను వినిపిస్తూ వీరభద్రున్ని స్తుతించారు. శాస్ర్తోక్తంగా నాకబలిని, యాగశాలలో పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ స్థానాచార్యులు, అర్చకు లు, అనువంశిక అర్చక కుటుంబాలకు చెందిన బ్రాహ్మణ సుహాసినులు త్రిశూలాన్ని ఆలయ ధర్మగుండంలోకి తీసుకువచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం ఆలయ అద్దాల మండపంలో ప్రముఖ సంస్కృత పండితులు అష్టావధాని తిగుళ్ల శ్రీహరిశర్మ శివపురాణ ప్రవచనం, పారాయణాలు  చేశారు. రాత్రివేళ వివిధ రంగాల్లో నిష్ణాతులైన కవి, పండితులతో పండిత గోష్ఠి, స్వామివారి ఉత్సవమూర్తులతో గుడిచుట్టూ  11 ప్రదక్షిణలు చేశారు. రాత్రి 9గంటలకు ఏకాద శ ఆవరణాల కార్యక్రమం, ఏకాంతసేవతో శివకల్యాణ మహోత్సవాలు పూర్తయ్యాయి. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో కృష్ణవేణి, పర్యవేక్షకులు సిరిగిరి శ్రీరాములు, నటరాజ్‌, ప్రతాప నవీన్‌, నా గుల మహేశ్‌, పూజల ఇన్‌చార్జి గట్టు గౌతమ్‌, రవీందర్‌ రెడ్డి, ఆలయ స్థానాచార్యులు  అప్పాల భీమాశంకర్‌, వేదపండితులు సువర్ణ రాధాకృష్ణశర్మ, గర్శకుర్తి శ్రీధర్‌, మధు హరీశ్‌, ప్రధానార్చకులు ఈశ్వరగారి సురేశ్‌, గోపన్నగారి నాగన్న, చంద్రగిరి శరత్‌, దుమాల వాసు, ఒజ్జల ఆదిత్య, పురాణం శివప్రసాద్‌, మామిడిపెల్లి శరత్‌, శ్రీనివాస్‌, బుడెంగారి రాజు, పారువెల్ల శ్రీనాథ్‌, తమ్మ లి అర్చకులు వెంకన్న, ప్రసాద్‌, కృష్ణ, సంతోష్‌,  పట్టణానికి చెందిన బ్రాహ్మణ సుహాసినులు, జంగమయ్యలు గణాచారి సాంబశివుడు,మఠం రాజేందర్‌, రవికుమార్‌, మృత్యుంజయం, మల్లేశం, భూమయ్య  తదితరులు పాల్గొన్నారు. కాగా, ఆలయంలో కాంట్రాక్ట్‌ సేవాదార్లుగా విధులు నిర్వర్తిస్తున్న వారికి ఆలయ ఈవో కృష్ణవేణి వస్ర్తాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ పర్యవేక్షకులు, సిబ్బంది ఉన్నారు.  

రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ

శివకల్యాణమహోత్సవాల ముగింపు సందర్భంగా వేములవాడ శ్రీపార్వతీ రాజరాజేశ్వరస్వామివారి ఆలయం ఆదివారం భక్తులతో రద్దీగా కనిపించింది. వేకువజామునుంచే భక్తులు ధర్మగుండంలో స్నానాలు చేసి మొక్కులు తీర్చుకున్నారు.  క్యూలైన్లలో నిల్చొని స్వామివారిని దర్శించుకున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయంలో ఆర్జిత సేవలను రద్దు చేశారు. ఆలయంలో భక్తులు  కుంకుమపూజలు, గండదీపం మొక్కులు చెల్లించుకున్నారు. వివిధ ఆర్జిత సేవల ద్వారా రాజన్నకు సుమారు 3 లక్షల ఆదాయం సమకూరినట్లు, రాజన్నను దాదాపు 4వేల మంది భక్తులు దర్శించుకున్నారని ఆలయ అధికారులు వెల్లడించారు. 


logo