శుక్రవారం 05 జూన్ 2020
Rajanna-siricilla - Mar 08, 2020 , 01:32:08

పేదలకు వరం ‘కల్యాణ లక్ష్మి’

పేదలకు వరం ‘కల్యాణ లక్ష్మి’

గంభీరావుపేట: ముఖ్యమంత్రి కేసీఆర్‌ అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి పథకం పేద తల్లిదండ్రులకు అండగా నిలుస్తున్నదని టెస్కాబ్‌ చైర్మన్‌ కొండూరి రవీందర్‌రావు కొనియాడారు. మండలంలోని పలు గ్రామాలకు చెందిన 29మందికి కల్యాణ లక్ష్మి పథకం కింద రూ. 29లక్షల 3వేల 364లు మంజూరయ్యాయి. ఈ సందర్భంగా తాసీల్దార్‌ కార్యాలయంలో శనివారం నిర్వహించిన కా ర్యక్రమంలో రవీందర్‌రావు ముఖ్యఅతిథిగా పా ల్గొని సంబంధిత లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. అదేవిధంగా మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని లబ్ధిదారుల, మహిళా ప్రజాప్రతినిధులను ఘనంగా సన్మానించారు. అనంతరం కొండూరి మాట్లాడుతూ.. ఆడబిడ్డల తల్లిదండ్రులకు అండగా నిలిచేందుకు సీఎం కేసీఆర్‌ కల్యాణ లక్ష్మి పథకాన్ని అమలు చేస్తున్నారని వి వరించా రు. ఈ పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని వివరించారు. మహిళల సంక్షేమానికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని వివరించారు. 


విద్యార్థినులకు హైజిన్‌ కిట్లు, సర్కారు దవాఖాన ల్లో ప్రసవిస్తే కే సీఆర్‌ కిట్లు అందిస్తున్నది ఉదహ రించారు. అనంతరం రెండోసారి టెస్కాబ్‌ చైర్మన్‌ గా ఎన్నికైన రవీందర్‌రావును మండల ప్రజాప్రతినిధులు, అధికారులు అభినందించారు. కార్యక్రమంలో ఎంపీపీ వంగ కరుణ, జడ్పీటీసీ కొమిరిశెట్టి విజయ, తాసీల్దార్‌ సుమ, సెస్‌ డైరెక్టర్‌ దేవేందర్‌యాదవ్‌, ఏఎంసీ చైర్మన్‌ దయాకర్‌రావు, ఎంపీడీవో శ్రీనివాస్‌, కొత్తపల్లి సింగిల్‌ విండో చైర్మన్‌ సురేందర్‌, వైస్‌ఎంపీపీ లత, సర్పంచ్‌ల ఫోరం మండలాధ్యక్షుడు రాజిరెడ్డి, జడ్పీకోఆప్షన్‌ స భ్యుడు అహ్మద్‌, ఆర్‌ఎస్‌ఎస్‌ మండల కన్వీనర్‌ రాజేందర్‌, సర్పంచ్‌ శ్రీధర్‌, టీఆర్‌ఎస్‌ మండలా ధ్యక్షుడు వెంకటస్వామిగౌడ్‌, నేతలు లక్ష్మణ్‌, సు రేందర్‌రెడ్డి, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు. తొలుత ముస్తాఫాగర్‌ మీరా షేక్‌ ఖాద్రి దర్గా ఉర్సు ఉత్సవాల్లో రవీందర్‌రావు పాల్గొన్నారు.


logo