మంగళవారం 07 జూలై 2020
Rajanna-siricilla - Mar 08, 2020 , 01:33:44

ఆడబిడ్డే కావాలని కోరుకుంటా..

ఆడబిడ్డే కావాలని కోరుకుంటా..

సిరిసిల్ల , నమస్తే తెలంగాణ: తనకు రెండో బిడ్డ కూడా ఆడబిడ్డనే కావాలని కోరుకుంటానని కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ తెలిపారు. జిల్లా పరిషత్‌ కార్యాలయం ఆవరణలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జడ్పీ అధ్యక్షురాలు న్యాలకొండ అరుణ అధ్వర్యంలో శనివారం నిర్వహించారు. ఈ కార్యకమానికి ముఖ్యఅతిధిగా కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ హాజరై మాట్లాడారు. భవిష్యత్‌ అంతా మహిళా మణులదేనని, అమ్మాయిలను అదృష్టంగా భావించాలని సూచించారు. పురుషులతో దీటుగా మహిళలు అన్నిరంగాల్లో రాణిస్తున్నారని, ప్రభుత్వం  మహిళలకు బాసటగా నిలుస్తున్నదని కొనియాడా రు. నేటికీ లింగ వివక్షత కొనసాగడం సమాజం సిగ్గుపడాల్సిన విషయమన్నారు. సమాన అవకాశాలు కల్పిస్తే మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తారని కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ స్పష్టం చేశారు. ప్రస్తుతం బాలుర,  బాలికల నిష్పత్తిలో ఉన్న వ్యత్యాసం ఆందోళన కలిగిస్తున్న దని, కానీ జిల్లాలో  1000 మంది పురుషులకు 1015 మంది స్త్రీలు ఉన్నార ని వెల్లడించారు. 0-6 సంవత్సరాల వరకు ఆ నిష్పత్తిని పరిశీలిస్తే 1000 మంది బాలురకు 942 మంది బాలికలు ఉన్నారని, జాతీయ స్థాయి కంటే జిల్లా కొంత మెరుగ్గా ఉందని వివరించారు. 


జిల్లా ఆవిర్భావం నాటికి 1000 మంది బాలురకు 920 మంది బా లికలు మాత్రమే ఉన్నారని గుర్తు చేశారు. ప్రత్యేక అవగాహన, చైతన్య కార్యక్రమాలను నిర్వహించడం, భ్రూణహత్యలపై ఉక్కుపా దం మోపడం వల్ల  స్త్రీ పురుష నిష్పత్తి మెరుగుపడిందని కలెక్టర్‌ సంతోషం వ్యక్తం చేశారు. భ్రూణహత్యలను సహకరించవద్దని, వచ్చే అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రత్యేక థీమ్‌ తో నిర్వహించాలని కలెక్టర్‌ సూచించారు. తనకు ప్రస్తుతం ఒక ఆడబిడ్డ ఉందని రెండోబిడ్డ కూడా ఆడపిల్ల కా వాలనే కోరుకుంటున్నానని తెలపగానే సభలో కరతాళ ధ్వనులు వినిపించా యి. జడ్పీ అధ్యక్షురాలు అరుణ మా ట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ మ హిళల అభ్యున్నతికి అనేక పథకాలును అమలు చేస్తూ భరోసా కల్పిస్తున్నాని కొనియాడారు. స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం సీట్లను కేటాయించి న ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. బాలికలకు ఉచిత విద్య అంది స్తూ, వారి అ భ్యున్నతికి సర్కారు బాటలు వేస్తు న్నదని తెలిపారు. స్వరాష్ట్ర సాధన తర్వాతే సీఎం కేసీఆర్‌ పాలనలోనే మహిళలకు అన్ని రకాల స హాయం అందుతున్నదని వివరించారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో గౌతంరెడ్డి, మహిళా ఎంపీపీలు, మహిళా అధికారులు పాల్గొన్నారు.


logo