గురువారం 02 జూలై 2020
Rajanna-siricilla - Mar 08, 2020 , 01:27:26

‘కరోనా’పై ఆందోళన వద్దు

‘కరోనా’పై ఆందోళన వద్దు

వేములవాడ రూరల్‌: కరోనా వైరస్‌పై ఆందోళన చెందవద్దని జిల్లా వైద్యధికారి చంద్రశేఖర్‌ భరోసా ఇచ్చారు. ‘కరోనా వైరస్‌'పై వేములవాడ అగ్రహారం పాలిటెక్నిక్‌ కళాశాలలో ప్రిన్సిపాల్‌ రాజగోపాల్‌ అధ్యక్షతన శనివారం నిర్వహించిన అవగాహన సదస్సులో డీఎంహెచ్‌వో చంద్రశేఖర్‌ పాల్గొని మాట్లాడారు. కరోనా వైరస్‌పై వస్తున్న పుకార్లను నమ్మవద్దని సూ చించారు. చేతులను తరుచుగా శుభ్రంగా కడుక్కోవాలని, రద్దీ ప్రదేశాలకు వీలైనంత వరకు వెళ్లవదని, దగ్గేప్పుడు, తుమ్మేటప్పుడు చేతి రుమాలును అడ్డుగా పె ట్టుకోవాలని వివరించారు. అనంతరం వ్యక్తిగత శు భ్రత ఆవశ్యకతను విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో జిల్లా ఇమ్యూనైజేషన్‌ అధికారి సుమన్‌మోహన్‌రావు, వైద్యులు కపిలసాయి, జాతీయ ఆరోగ్య మిషన్‌ జిల్లా కార్యకమాల అధికారి ఉమాదేవితో పా టు సయ్యద్‌ షాహబాజ్‌, నరేశ్‌, రాములు, శ్రీనివా స్‌, చక్రవర్తి, కనకయ్య పాల్గొన్నారు. 


అప్రమత్తంగా ఉండాలి: డీఈవో

సిరిసిల్ల ఎడ్యుకేషన్‌: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర పాఠశాల, వెం కంపేట పాఠశాలలో నిర్వహించిన అవగహన సదస్సులో డీఈవో రాధాకిషన్‌, డాక్టర్‌ తిరుపతి హాజరై మాట్లాడారు. కరోనా వైరస్‌పై అప్రమత్తంగా ఉండాలని వివరించారు. ఆయా కార్యక్రమాల్లో సెక్టోరియల్‌ ఆఫీసర్‌ రాంచందర్‌రావు, హెచ్‌ఎంలు లక్ష్మణ్‌, పరబ్రహ్మ మూర్తి, జిల్లా సైన్స్‌ అధికారి ఆంజనేయులు, ఉపాధ్యాయులు శంకర్‌గౌడ్‌, మహేందర్‌రెడ్డి, ప్రభాకర్‌, పురుషోత్తం, గోపాల్‌రెడ్డి, ఆసియా పాల్గొన్నారు.


విద్యార్థుల అవగాహన ర్యాలీ

ఎల్లారెడ్డిపేట: మండలం గొల్లపల్లి ప్రభుత్వ ఉన్నతపాఠశాల విద్యార్థులు హెచ్‌ఎం మురళీధర్‌ ఆధ్వర్యం లో కరోనా వైరస్‌పై అవగాహన ర్యాలీ తీశారు. ప్లకా ర్డులు ప్రదర్శిస్తూ, నినాదాలిస్తూ అవగాహన కల్పిం చారు. ర్యాలీలో నాయకులు ఆంజనేయులుగౌడ్‌, ఉ పాధ్యాయులు సంజీవ్‌, భాస్కర్‌ పాల్గొన్నారు. 


logo