సోమవారం 06 జూలై 2020
Rajanna-siricilla - Mar 07, 2020 , 01:19:44

పనులు ఎప్పటిలోగా పూర్తిచేస్తారు?

పనులు ఎప్పటిలోగా పూర్తిచేస్తారు?

కరీంనగర్‌ రూరల్‌: ‘పల్లె ప్రగతి’లో భాగంగా చేపట్టిన పనులను ఎన్ని రోజుల్గో పూర్తి చేస్తారని ‘పల్లె ప్రగతి’ రాష్ట్ర ప్రత్యేక పరీశీలకుడు, ఐజీ  స్టీఫెన్‌ రవీంద్ర  ప్రశ్నించారు. కొత్తపల్లి మండలంలోని చింతకుంట, మల్కాపూర్‌ గ్రామాల్లో  శుక్రవారం ఆయన పర్యటించారు. చింతకుంటలోని డంప్‌ యార్డును పరిశీలించారు. గ్రామ సర్పంచ్‌ భర్త సమ్మయ్య, ఎంపీటీసీలు భూక్య తిరుపతినాయక్‌, పత్తెం శారద, లక్ష్మీనారాయణతోపాటు మహిళా మండలి సభ్యులు, ఎంపీడీవో ఏ శ్రీనివాస్‌రెడ్డి, ఏపీవో లక్ష్మి, కార్యదర్శి, తాసిల్దార్‌ సురేశ్‌కుమార్‌తో మాట్లాడారు. గ్రామంలోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ‘మిషన్‌ భగీరథ’ నీరు సక్రమంగా రావడం లేదని, మూడు వాటర్‌ ట్యాంకులు అవసరమున్నాయని వారు దృష్టికి తెచ్చారు. వైకుంఠధామాలు, పట్టణ ప్రగతిలో  చర్చకు వచ్చిన పనులను వివరించారు మహిళా సంఘం భవనాన్ని మంత్రి గంగుల కమలాకర్‌ అందించిన నిధులతో నిర్మించారని, ప్రహరీ, మరుగుదొడ్లు, బోరు నిర్మాణం కోసం నిధులు అవసరమున్నట్లు మహిళలు తెలిపారు. కాగా, ఎంతమంది ఇంకుడు గుంతలు నిర్మించుకున్నారని స్టీఫెన్‌ రవీంద్ర అడగ్గా, వంద మంజూరయ్యాయని, ఇప్పటికి 50 మాత్రమే పూర్తయ్యాయని వారు వివరించారు. వారంలోగా అన్ని పూర్తిచేస్తామని రవీంద్రకు ప్రజాప్రతినిధులు తెలిపారు. 15 రోజుల్లో డంప్‌ యార్డు పనులు పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. హరితహారం పనులపైన అసంతృప్తి  వ్యక్తం చేశారు. అనంతరం మల్కాపూర్‌ వెళ్లి డంప్‌యార్డును పరిశీలించారు. గ్రామంలోని కమ్యూనిటీ, ఇండ్లలోని ఇంకుడు గుంతలను పరిశీలించారు. గ్రామ కార్యదర్శి , సర్పంచ్‌ గొట్టె జ్యోతి, ఉప సర్పంచ్‌ కాసారపు గణేష్‌గౌడ్‌. వార్డు సభ్యులు వొల్లాల శ్రీనివాస్‌తో గ్రామ పంచాయతీలో మాట్లాడి, వివరాలు సేకరించారు. గ్రామంలో నాటిన మొక్కల సంఖ్యను అడిగి తెలుసుకున్నారు.  డంప్‌యార్డు, వైకుంఠధామం నిర్మాణాలు ఎంతవరకు వచ్చాయని ప్రశ్నించారు. గ్రామ పంచాయతీలోని రూ. 38 లక్షల నిధులను వేటికి వినియోగిస్తారని అడిగారు. ‘పల్లె ప్రగతి’ కింద చేపట్టిన పనులను వెంటనే పూర్తిచేయాలని, రోడ్డుకిరువైపులా మొక్కలు నాటించాలని గ్రామ ప్రజాప్రతినిధులు, అధికారులకు సూచించారు. ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, వార్డు సభ్యులు,  మహిళలు రూరల్‌ సీఐ శ్రీనివాస్‌రావు, అధికారులు పాల్గొన్నారు. 


logo