మంగళవారం 01 డిసెంబర్ 2020
Rajanna-siricilla - Mar 07, 2020 , 01:13:53

తడి-పొడిచెత్త వేరుగా వేయండి

తడి-పొడిచెత్త వేరుగా వేయండి

జమ్మికుంట: తడి-పొడిచెత్తలను వేర్వేరుగా వేయాలనీ, పరిసరాల పరిశుభ్రతకు ప్రజలు సహకరించాలని మున్సిపల్‌ చైర్మన్‌ తక్కళ్లపెల్లి రాజేశ్వర్‌రావు పిలుపునిచ్చారు. శుక్రవారం సాయంత్రం విలీన గ్రామాలైన కొత్తపల్లి, ధర్మారం, రామన్నపల్లిలో  వైస్‌ చైర్‌పర్సన్‌ స్వప్న, కమిషనర్‌ అనిసూర్‌ రషీద్‌లతో కలిసి తడి-పొడిచెత్తలకు సంబంధించిన బుట్టలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మున్సిపల్‌లో కలిసిన గ్రామాలన్నీ స్వచ్ఛతకు మారుపేరుగా నిలువాలనీ, చెత్తను బుట్టల్లోనే వేయాలని సూచించారు. ఇంటిముందుకు వచ్చిన సిబ్బంది వాహనంలోనే చెత్త పారబోయాలని తెలిపారు. ప్రజల ఆరోగ్యాలను కాపాడే బాధ్యత అందరిపై ఉందన్నారు. రోగాల్లేని సమాజాన్ని నిర్మించడంలో ప్రముఖ పాత్ర పోషించాలని కోరారు. సమస్యలుంటే వెంటనే కార్యాలయంలో తెలియజేయాలనీ, సత్వరమే పరిష్కరించేందుకు ముందుకు సాగుతామని చెప్పారు. కార్యక్రమంలో ఆయా వార్డులకు చెందిన కౌన్సిలర్లు వీరన్న, బుచ్చన్న, రవీందర్‌, అరుణ, స్వరూప, సదానందం, రాధ, నాయకులు శ్రీహరి, రవీందర్‌, సదానందం, కోటి, తదితరులు పాల్గొన్నారు.

సకాలంలో పన్నులు వసూలు చేయాలి

మున్సిపల్‌ పరిధిలో సకాలంలో పన్నులు వసూలు చేయాలనీ, రెవెన్యూను అందించాలని మున్సిపల్‌ కమిషనర్‌ అనిసూర్‌ రషీద్‌ సిబ్బందిని ఆదేశించారు. శుక్రవారం పట్టణంలోని మున్సిపల్‌ కార్యాలయంలో రెవెన్యూ ఆర్‌ఐ, బిల్‌ కలెక్టర్లు, సిబ్బందితో ఆస్తి పన్నుపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. మార్చి 31వరకు పన్నులన్నీ వసూలు చేయాలనీ, జిల్లాలోనే టాప్‌గా నిలువాలని పేర్కొన్నారు. ఇప్పటి వరకు వసూలు చేసిన పన్నుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. పన్ను వసూలుకు తాను కూడా వస్తాననీ, వంద శాతం లక్ష్యాన్ని చేరుకోవాలని పేర్కొన్నారు. సమావేశంలో మేనేజర్‌ రాంభూపాల్‌రెడ్డి, ఆర్‌ఐ భాస్కర్‌, బిల్‌ కలెక్టర్లు తిలక్‌, సంపత్‌, తిరుపతి, వంశీ, శివ, ఎస్‌ తిరుపతి, కే తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.