గురువారం 02 జూలై 2020
Rajanna-siricilla - Mar 06, 2020 , 01:40:59

రెండోసారి.. కొండూరి

రెండోసారి.. కొండూరి

సిరిసిల్ల, నమస్తే తెలంగాణ: తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్‌ బ్యాంక్‌ (టెస్కాబ్‌) అధ్యక్షుడిగా ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా కేడీసీసీబీ అధ్యక్షుడు కొండూరి రవీందర్‌రావు గురువారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సీఎం కేసీఆర్‌ నిర్ణయంతో రవీందర్‌రావును ఈ పదవి వరించింది. హైదరాబాద్‌ఆబిడ్స్‌లోని టెస్కాబ్‌ కార్యాలయంలో గురువా రం జరిగిన అధ్యక్ష ఎన్నికల ప్రక్రియలో టెస్కాబ్‌ అధ్యక్షుడిగా రవీందర్‌రావు నామినేషన్‌ ఒక్కటే దాఖలయ్యింది. దీంతో ఆయననే అధ్యక్షుడిగా ఎ న్నికల అధికారులు ప్రకటించారు. ఉమ్మడి జిల్లా కరీంనగర్‌, కొండూరి సొంత మండలమైన గంభీరావుపేట, సిరిసిల్ల నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్‌ పార్టీ నేతలు హైదరాబాద్‌ తరలివెళ్లి అభినందనలు తెలిపారు. వారిలో జిల్లా పరిషత్‌ అధ్యక్షు రాలు న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి దంపతు లు, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు, జోగినపల్లి ర వీందర్‌రావు, డీసీఎంఎస్‌ మాజీ అధ్యక్షుడు సు రేందర్‌రెడ్డి, జిల్లా జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఇతర ముఖ్యనేతలు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, గులాబీశ్రేణులు పుష్పగుచ్ఛాలను అందించి శుభాకాంక్షలు తెలిపారు. శాలువాలు కప్పి సన్మానించారు.

 

మూడోసారి డీసీసీబీ.. 

కొండూరి రవీందర్‌రావు టెస్కాబ్‌ అధ్యక్షుడిగా రెండోసారి, ఫిబ్రవరి 29న ముచ్చటగా మూడోసారి జిల్లా కేంద్ర సహకార బ్యాంక్‌ చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గంభీరావుపేట మండ లం గజసింగవరానికి చెందిన కొండూరి రవీందర్‌రావు వరుసగా మూడోసారి గంభీరావుపేట సహకార సంఘం అధ్యక్షుడిగా, రెండోసారి టెస్కా బ్‌ చైర్మన్‌గా ఎన్నికై మండల సింగిల్‌విండోకు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చారు. గంభీరావుపేట సహకార సంఘం నుంచి 2005లో ఏకగ్రీవంగా, 2013లో పోటీ చేసి గెలుపొందారు. గత ఫిబ్రవరిలో నిర్వహించిన సహకార ఎన్నికల్లో గంభీరావుపేట సింగిల్‌విండో నుంచి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2005లో గంభీరావుపేట సహకార సంఘం అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన రవీందర్‌రావును జిల్లా కేంద్ర సహకార బ్యాంక్‌ చైర్మన్‌గా ఎన్నుకొన్నారు. అనంతరం 2013లో గంభీరావుపేట సింగిల్‌విండోలో పోటీ చేసి గెలుపొంది జిల్లా సహకార బ్యాంక్‌ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. 


ఈ సారి జరిగిన సహకార ఎన్నికల్లో గంభీరావుపేట సహకారం సంఘం ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన రవీందర్‌రావు జిల్లా అధ్యక్షుడిగా హ్యాట్రి క్‌ సాధించి టెస్కాబ్‌ అధ్యక్ష పీఠం దక్కించుకున్నా రు. ప్రస్తుతం రాష్ట్ర స్థాయిలో టెస్కాబ్‌ అధ్యక్షుడిగా పనిచేస్తున్న రవీందర్‌రావును మరోసారి ఆ పదవి వరించింది. 2005 నుంచి దాదాపు 15 సంవత్సరాలుగా సహకార నేతగా సేవలు అందిస్తున్న రవీందర్‌రావుకు రాష్ట్రస్థాయిలో ప్రత్యేక గుర్తింపు ఉంది. అదీగాక ఆయన ప్రస్తుతం నేషనల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ స్టేట్‌ కో ఆపరేటివ్‌ బ్యాంక్‌ డైరెక్టర్‌గా, అంతర్జాతీయ సంస్థ అయిన యూఎన్‌వోకు సంబంధించిన ఎఫ్‌ఏవోకు అనుబంధ సంస్థ నెట్‌వర్క్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ కో ఆపరేటివ్‌కు సభ్యుడిగా, జాతీయ సహకార వ్యవసాయ, గ్రామాణాభివృబ్ధి బ్యాంక్‌ల సమాఖ్య వైస్‌ చైర్మన్‌గా, జాతీయ చలన చిత్ర, లలిత కళల సహకార సంస్థ న్యూ ఢిల్లీకి సభ్యులుగా, నాబార్డు ఆధ్వర్యంలో మానవ వనరుల పాలసీ కమిటీలో ఏకైక అనధికార సభ్యుడిగా కొనసాగుతున్నారు. అదేవిధంగా ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘానికి సంబంధించిన మానవ వనరుల పాలసీ కమిటీ (హెచ్‌ఆర్‌ పాలసీ ఆఫ్‌ పీఏసీఎస్‌) అధ్యక్షుడిగా, అంతర్జాతీయ సహకార బ్యాంక్‌ల సమాఖ్య డైరెక్టర్‌గా కొనసాగడం గర్వకారణం.


logo