మంగళవారం 14 జూలై 2020
Rajanna-siricilla - Mar 05, 2020 , 02:08:35

సమీక్షాలు సూచనలు

సమీక్షాలు సూచనలు

రాజన్న సిరిసిల్ల ప్రతినిధి, నమస్తేతెలంగాణ/  వేములవాడ నమస్తే తెలంగాణ/ సిరిసిల్ల టౌన్‌: రాష్ట్ర ప్రభుత్వం పదిరోజుల పాటు ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన పట్టణ ప్రగతి విజయవంతమైంది. సిరిసిల్ల, వేములవాడ మున్సిపాల్టీల్లో ని అన్నివార్డుల ప్రజలు, ప్రజాప్రతినిధులు ఉత్సాహంగా పాల్గొన్నారు. మురుగు కాలువలు, రోడ్లను శుభ్రం చేశారు. విద్యుత్‌ సమస్యలను పరిష్కరించారు. సిరిసిల్ల పట్టణంలో ని 22వార్డులో మున్సిపల్‌ అధ్యక్షురాలు జిందం కళ, కమిషనర్‌ సమ్మయ్య, వార్డు కౌన్సిలర్లుతో కలిసి కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ పర్యటించారు. చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించారు. వేములవాడలో 22, 23 వార్డుల్లో మున్సిపల్‌ అధ్యక్షురాలు మాధవి, వైస్‌చైర్మన్‌ మధురాజేందర్‌, కౌన్సిలర్లతో కలిసి ఎమ్మెల్యే రమేశ్‌బాబు పర్యటించారు. 


పట్టణ ప్రగతిని నిరంతరం కొనసాగించాలి

అనంతరం మున్సిపల్‌ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశానికి ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. పది రోజుల్లోనే వేములవాడలోని అన్ని వార్డులను అందంగా తీర్చిదిద్దారని కొనియాడారు. పుణ్యక్ష్రేతమైన వేములవాడ ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని, ఇప్పటికే రూ. వందల కోట్లతో అభివృద్ధి పనులు సాగుతున్నాయని గుర్తుచేశారు. రాజన్న క్షేత్రం, పట్టణాన్ని సమస్థాయిలో అ భివృద్ధి చేయడమే తమ లక్ష్యమన్నారు. ప్రధాన రహదారిని 80 అడుగుల మేరకు వెడల్పు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశామని, బద్ది పోశమ్మ ఆలయాన్ని కూడా భ క్తుల రద్దీకి అనుగుణంగా రూ.9 కోట్లతో ఆధునీకరిస్తామని తెలిపారు. రూ.30 కోట్లతో మురుగు కాలువల నిర్మాణానికి కూడా ప్రణాళకలు రూపొందించామని, ఇక పురపాలక సంఘంలో విలీనమైన గ్రామాల్లో రూ.2.20 కోట్ల తో పలు పనులకు ఇప్పటికే ఆమోదం తెలుపామని వివ రించారు. మంత్రి కేటీఆర్‌ సహకారంతో నగరాన్ని  సుందరీకరిస్తామన్నారు. 


మహిళలకు మెప్మా ద్వారా ఉపా ధి కల్పిస్తామని హామీ ఇచ్చారు. మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ 860 మంది  కార్మికులను అదనం గా తీసుకొని పట్టణ ప్రగతి కార్యకక్రమాన్ని పదిరోజులు నిర్వహించామని, చెత్తను తొలగించామని, 1604 మంది నిరక్ష్యరాస్యులున్నట్లు గుర్తించామని, విద్యుత్‌ స్తంభాల సమస్యలను, 472 ఖాళీ స్థలాలను గుర్తించామని వివరిం చారు. 15 పాత భవనాలను తొలగించామని, పట్టణ నర్సరీ కోసం 15వవార్డులో 2 ఎకరాల స్థలాన్ని, మరుగుదొడ్ల నిర్మాణాలకు జగిత్యాల కమాన్‌,  జాతర గ్రౌండ్‌ గోశా ల, టీటీడీ ధర్మశాల వెనుక, పార్క్‌లను ఏర్పాటుకు గంగ మ్మ గుడి వద్ద 7 గుంటలు, మున్నూరుకాపు సత్రం వెనకాల 40 గుంటలు, కూరగాయల మార్కెట్‌ కోసం చామకుంట, శాత్రాజుపల్లిలో రైతుబజార్‌, కరీంనగర్‌ సిరిసిల్లా రహదారిలో రైతుబజార్‌, నాంపల్లి వద్ద ఫిష్‌ మార్కెట్‌ను ఏర్పాటుకు స్థలాలను గుర్తించామని వెల్లడించారు. సమా వేశంలో మున్సిపల్‌ అధ్యక్షురాలు మాధవి, వైస్‌చైర్మన్‌ మ ధురాజేందర్‌, ఏఈలు శ్రావణ్‌కు మార్‌, నర్సింహాస్వామి, పట్టణ ప్రణాళిక విభాగం పర్యవేక్ష కులు అంజయ్య, అధికారులు తేజస్విని, గంగాధర్‌, కౌన్సిలర్లు పాల్గొన్నారు. 


అభివృద్ధి నివేదికలు సిద్ధం చేయాలి: కలెక్టర్‌

జిల్లా కేంద్రంలోని 20వ వార్డులో నిర్వహించిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ పాల్గొన్నారు. పట్టణ ప్రగతి అమలుతీరును పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. స్థానిక ప్రజాప్రతినిధులు, వార్డు కమిటీ సభ్యులను అభినందించారు. అనంతరం జిల్లా కేంద్రంలోని సినారె కళామందిరంలో సాయంత్రం నిర్వహించిన పట్టణ ప్రగతి ముగింపు కార్యక్రమంలో పాల్గొని కలెక్టర్‌ మా ట్లాడారు. మంత్రి కేటీఆర్‌ మార్గదర్శకత్వంలో పట్టణ ప్రగ తి ద్వారా చర్యలు తీసుకుంటున్నామన్నారు. వార్డుల్లోని సమస్యల పరిష్కారంతో పాటుగా మౌలిక వసతుల కల్పన కు ప్రతిపాదనలు సిద్ధం చేశామని వెల్లడించారు. త్వరలోనే పనులు ప్రారంభిస్తామని వివరించారు. ప్రజాప్రతినిధులు, వార్డు కమిటీల సభ్యులు సమన్వయంతో పని చేసి పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేశారని అభినందిం చారు. అదే స్ఫూర్తితో దేశానికే తలమానికంగా సిరిసిల్లను తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. అనంతరం పట్టణ ప్రగతి విజయవంతంలో భాగస్వాములైన ప్రజాప్రతినిధులు, అ ధికారులను కలెక్టర్‌ సన్మానించారు. ఆయా కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్‌ అంజయ్య, మున్సిపల్‌ అధ్యక్షురాలు కళ, కమిషనర్‌ సమ్మయ్య, ఉపాధ్యక్షుడు మంచె శ్రీనివాస్‌, కౌన్సిలర్‌ సౌజన్య, టీపీఎస్‌ అన్సార్‌, పాల్గొన్నారు.


logo