ఆదివారం 05 జూలై 2020
Rajanna-siricilla - Mar 05, 2020 , 02:07:50

ఇంటర్‌ పరీక్షలు షురూ..

ఇంటర్‌ పరీక్షలు షురూ..

సిరిసిల్ల ఎడ్యుకేషన్‌: జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియెట్‌ ప్రథమ సంవత్సర పరీక్షలు బుధవారం ప్రారంభమ య్యాయి. మొత్తం 16 పరీక్ష కేంద్రాల్లో  మొదటి రోజు న నిర్వహించి ఇంటర్‌ ప్రథమ సంవత్సరం పరీక్షకు 4466 మంది విద్యార్థులు హాజరయ్యారు. నిమిషం ని బంధన అమలులో ఉండడంతో జిల్లాలోని పలు పరీక్ష కేంద్రాల వద్ద ఆలస్యంగా హాజరైన విద్యార్థులను అధికా రులు తిప్పిపంపారు. పలువురు విద్యార్థులు దేవాలయాలకు వెళ్లి పూజలు చేసి పరీక్షా కేంద్రాలకు వచ్చారు. ప్రైవేట్‌ కళాశాలలకు చెందిన విద్యార్థులను వారి యాజమాన్యాలు బస్సుల్లో కేంద్రాలకు తరలించాయి.


పకడ్భందీ  బందోబస్తు..

జిల్లావ్యాప్తంగా పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు  ఒక జూనియర్‌ లెక్చరర్‌, డిప్యూటీ తాసిలార్‌, ఏఎస్‌ఐతో కూడిన ఫ్లయింగ్‌ స్కాడ్‌ బృందాలను ఏర్పా టు  చేశారు. ఆయా బృందాలు కేవలం ముడుగంటల వ్యవధిలోనే వేములవాడ పట్టణంలోని పలు పరీక్షా కేం ద్రాలను ఆకస్మీకంగా తనిఖీ చేశాయి. జిల్లా కేంద్రంలో ని ప్రభుత్వ బాలుర జూనియర్‌ కళాశాల పరీక్షా కేంద్రా న్ని కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సెంటర్‌లో కల్పించిన వసతులను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఎక్కడా ఎలాంటి అసౌకర్యాలు కలు గకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. పరీక్ష కేంద్రాల వద్ద అవాంఛనీయ సంఘటనలు, మాస్‌ కా పీయింగ్‌కు తావులేకుండా పోలీస్‌శాఖ పూర్తి బందోబస్తును ఏర్పాటు చేసింది. విద్యార్థుల సౌకర్యార్థం తాగునీరు, ఏఎన్‌ఎం సెంటర్లను ఏర్పాటు చేశారు. 


266 మంది విద్యార్థులు గైర్హాజరు..

జిల్లాలో మొత్తం ప్రథమ సంవత్సరం జనరల్‌ విభాగం పరీక్షను 4137  మంది విద్యార్థులు రాయాల్సి ఉండగా. అందులో 3960 మంది విద్యార్థులు హాజర య్యారు. 177 మంది విద్యార్థులు గైర్హజరయ్యారు. ఓకేషనల్‌ విభాగంలో 595 మంది విద్యార్థులకుగాను 506 మంది హాజరుకాగా, 89 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. సిరిసిల్లలో  ఏర్పాటు చేసిన ఐదు పరీక్ష కేంద్రాలను డీఐఈవో సత్యవర్ధన్‌రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. వేములవాడ, ఎల్లారెడ్డిపేట ప్రభుత్వ జూనియర్‌ కళాశాల కే్ంరద్రాల్లో ఐదు నిమిషా లు ఆలస్యమైన కారణంగా ఇద్దరు విద్యార్ధినులను అధికారులు అనుమతించలేదని డీఐఈవో వెల్లడించారు.


నేడు నుంచి ద్వితీయ సంవత్సరం పరీక్షలు 

ఇంటర్మీడియెట్‌ ద్వితీయ సంవత్సర విద్యార్థులకు గురువారం నుంచి పరీక్షలు ప్రారంభంకానున్నాయి. జిల్లావ్యాప్తంగా 16 కేంద్రాల్లో పరీక్షలు కొనసాగను న్నట్లు డీఐఈవో సత్యవర్ధన్‌రావు తెలిపారు. ని మిషం నిబంధన ఉన్నందున కేంద్రాలకు గం ట ముందుగా చేరుకోవాలని, ప్రశాంతంగా పరీక్షలు రాయాలని విద్యార్థులకు  సూచించారు.


logo