శుక్రవారం 05 జూన్ 2020
Rajanna-siricilla - Mar 05, 2020 , 02:04:50

సర్కారు దవాఖానల్లో వైద్య సేవలు భేష్‌

సర్కారు దవాఖానల్లో వైద్య సేవలు భేష్‌

సిరిసిల్ల టౌన్‌/వేములవాడ, నమస్తేతెలంగాణ: తెలంగాణ ప్రభుత్వం సర్కారు అందిసున్న వైద్యసేవలు భేష్‌ అని జాతీ య ఆరోగ్య మిషన్‌ విభాగం అధికారులు డాక్టర్‌ లేఖసుమయ, కవిత కితాబిచ్చారు. వైద్యశాలల్లో అమలు చేస్తున్న కేసీఆర్‌ కిట్‌ పథకం ‘విజయ‘వంతం గా కొనసాగుతున్నదని కొనియాడారు. జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాలను వారు బుధవారం సందర్శించారు. వార్డులను సందర్శించి రోగులతో మాట్లాడారు. ఈ సందర్భంగా పలువురు గర్భిణు ల వద్దనున్న కేసీఆర్‌ కిట్లను ఆసక్తిగా తిలకించారు. కిట్‌ వివరాలను వారినే అడిగి తెలుసుకున్నారు. అనంతరం కేంద్ర బృందం సభ్యులు మాట్లాడుతూ జిల్లా దవాఖానలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారన్నారు. కార్పోరేట్‌ వైద్యశాలలకు దీటుగా మెరుగైన మౌలిక వసతులు అం దుబాటులో ఉన్నాయని వివరించారు. డయాలసిస్‌ సెంట ర్‌, ఐసీయూ, నవ జాతశిశు కేంద్రం, బ్లడ్‌ బ్యాంక్‌ తదితర అత్యాధునిక వైద్యసేవలు జిల్లా ప్రజలకు అందుబాటులో ఉన్నాయని వివరించారు. వైద్యశాల పరిసరాలు పరిశుభ్రం గా ఉండడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. కేసీఆర్‌ కిట్‌ వల్ల పే ద మహిళలు అధికంగా ప్రభుత్వ వైద్య సేవలను వినియోగించుకుంటున్నట్లు తెలిసిందన్నారు. సిబ్బంది కొరత సమ స్య కొంత ఉన్నదని, అందుబాటులో ఉన్న వైద్యులు నిరంతరం రోగులకు సేవలు అందిస్తున్నారని తెలిపారు. వారి వెంట జిల్లా వైద్యశాల సూపరింటెండెంట్‌ డాక్టర్‌ మురళీధర్‌రావు, వైద్యాధికారులు తదితరులున్నారు. 


వేములవాడ పీహెచ్‌సీ సేవలపై ప్రశంసల జల్లు

అదేవిధంగా వేములవాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మిషన్‌ బృందం సభ్యులు లేఖ, కవిత సందర్శించారు. నిరుపేదలకు అందుతున్న వైద్య సేవ లు, అమలు చేస్తున్న విధానాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. రోగులతో మాట్లాడి సేవలపై ఆరా తీశారు. అ నంతరం వారు మాట్లాడుతూ రాష్ట్రంలో వైద్యసేవలు నిరుపేదలకు చాలా బాగా అందుతున్నాయని కొనియాడారు. అప్పుడే పుట్టిన నిరుపేద చిన్నారులకు అందిస్తున్న కేసీఆర్‌ కిట్‌ చాలా అద్భుతమని వివరించారు. చాలారకాల నాణ్య మైన వస్తువులను అందజేస్తూ చిన్నారుల సంరక్షణపై ప్ర భుత్వం శ్రద్ధ చూపుతున్నదన్నారు. పీహెచ్‌సీలో అందిస్తున్న వైద్యసేవలను కొనియాడుతూ వైద్యులు ప్రశంసించారు. వారి వెంట డీపీఎంవో ఉమాదేవి, వైద్యాధికారులు రేగులపాటి మహేశ్వరరావు, మానస, పర్యవేక్షకులు సురేందర్‌, జయప్రకాశ్‌నారాయణ తదితరులున్నారు. 


logo