శుక్రవారం 10 జూలై 2020
Rajanna-siricilla - Mar 04, 2020 , 04:49:17

విజయీభవ

విజయీభవ
  • నేటి నుంచి ఇంటర్‌ పరీక్షలు
  • జిల్లాలో 16 పరీక్ష కేంద్రాలు
  • హాజరుకానున్న 4,378 మంది విద్యార్థులు
  • సెంటర్ల వద్ద 144 సెక్షన్‌
  • నిమిషం ఆలస్యమైనా ఇంటికే..
  • అరగంట ముందే సెంటర్లకు చేరుకోవాలని అధికారుల సూచన
  • ఏర్పాట్లు పూర్తి : డీఈఐవో సత్యవర్ధన్‌ రావు




సిరిసిల్ల ఎడ్యుకేషన్‌:నేటి నుంచి ఇంటర్మీడియెట్‌ ప్రథమ పరీక్షలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు. జనరల్‌, ఒకేషనల్‌ రెండు  కోర్సులు కలిసి 4,378 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. రేపటి నుంచి ద్వితీయ సంవత్సర పరీక్షలు జరుగనున్నాయి. పరీక్షలకు హాజరుకానున్న విద్యార్థులకు తాగునీరు, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు, విద్యుత్‌, మొదలగు అన్ని సౌకర్యాలూ కల్పించేందుకు తగు చర్య లు తీసుకోనున్నట్లు జిల్లా ఇంటర్మీడియెట్‌ అధికారి కంటె రాంచందర్‌ తెలిపారు.


పకడ్బందీ ఏర్పాట్లు

ఇంటర్‌ పరీక్షలు సవ్యంగా జరుగడానికి జి ల్లా వ్యాప్తంగా 16 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో 10 ప్రభుత్వ కళాశాలలు, 6 ప్రైవేట్‌ కళాశాలలు ఉన్నాయి. ప్రతి సెంటర్‌కు ఒక చీఫ్‌ సూపరింటెండెంట్‌ (సీఎస్‌), డిపార్టుమెంటల్‌ ఆఫీసర్‌ (డీఓ)లను నియామ కం చేశారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలు లో ఉంటుంది,  ఎలాంటి అవాంఛనీయ సం ఘటనలూ జరగకుండా పోలీస్‌శాఖ ఆధ్వర్యం లో పూర్తి బందోబస్తు కల్పించనున్నారు. పరీక్ష కేంద్రాలవద్ద జిరాక్స్‌ సెంటర్లు మూసివేస్తారు. సెల్‌ఫోన్‌, గడియారం లాంటి ఎలక్ట్రానిక్‌  గూ డ్స్‌ పరీక్షహాల్‌లోకి అనుమతించరు. విద్యార్థు ల సౌకర్యార్థం హెల్త్‌ సెంటర్లు, తాగు నీటి సౌకర్యం ఏర్పాటు చేశారు.


నిమిషం నిబంధన..

విద్యార్థులు పరీక్ష కేంద్రాల్లోకి ఒక్క నిమిషం అలస్యమైనా ఎట్టిపరిస్థితిలో అనుమతి ఉండదని అధికారులు తెలిపారు. ఉదయ 9 గంటలకు నుంచి 12 గంటల వరకు  నిర్వహించనుండగా, పరీక్షలకు విద్యార్థులను 8:30 గం టల నుంచే అనుమతిస్తారు. దాదాపు అరగం ట ముందే పరీక్ష హాల్‌లో ఉండాలి.


4,378 మంది విద్యార్థులు.. 

జిల్లా వ్యాప్తంగా 16 పరీక్ష కేంద్రాలను ఏ ర్పాటు చేయాగా నేడు జరిగే ఇంటర్మీడియెట్‌ ప్రథమ సంవత్సరంలో 4,378 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నరు. రేపటి నుంచి జరిగే ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 4004 మంది విద్యార్థులు హాజరుకానున్నారు.


మనోధైర్యంతో ఉండాలి : డీఈఈవో

విద్యార్థులకు పరీక్షలపై ఉన్న భయాన్ని పో గొట్టి  మనోధైర్యంతో నింపేందుకోసం ప్రతి క ళాశాలలో గతంలో కౌన్సిలర్లును నియమిం చాం. అదే స్ఫూర్తితో పరీక్షలు రాయాలి. జిల్లా వ్యాప్తంగా మొత్తం ప్రభుత్వ, ప్రైవేట్‌ కళాశాలను కల్పి 16 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశాం. పరీక్షలు సజావుగా జరిగేందుకోసం 16 మంది ఛీప్‌ సూపరింటెండెంట్లు, 16 మం ది డిపార్టుమెంటల్‌ అధికారులు, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాలు, సిట్టింగ్‌ స్క్వాడ్‌ బృందాలను నియమించారు. వీరితో పాటుగా పరీక్ష సమయంలో వి ద్యార్థులకు అసౌకర్యం కలుగకుండా కలెక్టర్‌ విద్యుత్‌, ఆర్టీసీ, పోలీస్‌ సబ్బంది కి ప్రత్యేకంగా ఆ దేశాలు జారీ చే శారు. విద్యార్థులు పరీక్ష కేంద్రాల్లో ఆందోళన లేకుండా మొదటగా ఇన్విజిలేటర్లు ఇచ్చిన 24 పేజీల బుక్‌లెట్‌, ఓఎంఆర్‌ షీట్‌ పూర్తి స్థా యిలో పరిశీలించుకోవాలి, బోర్డు ఆదేశాల మే రకు ఎలాంటి అడిషనల్‌ ఇవ్వరని విద్యార్థులు గమనించాలి. పరీక్ష హాల్‌లోకి డిజిటల్‌ వాచ్‌ లు, సెల్‌ఫోన్లు అనుమతించరు. ఏదైనా కళాశాల యాజమన్యం హాల్‌టికెట్లు ఇవ్వకపోతే  ఇంటర్మీడియెట్‌ వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చే సుకోని పరీక్షలకు హాజరు కావాలి. అన్ని శాఖ ల సమన్వయంతో పరీక్షలను పకడ్బందీగా ని ర్వహిస్తాం. విద్యార్థులకు ఎలాంటి సందేహాలు ఉన్నా జిల్లా ఇంటర్మీడియట్‌ విద్యాధికారి నం బర్‌ 9440816018ను సంప్రదించాలి. 


  పకడ్బందీగా నిర్వహిస్తాం...

వేములవాడ, నమస్తేతెలంగాణ: ఇంటర్‌ ప రీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తామని జిల్లా ఇంటర్మీడియెట్‌ విద్యాధికారి సత్యవర్ధన్‌రావు పేర్కొన్నారు. మంగళవారం వేములవాడ పట్ట ణంలోని ఇంటర్‌ పరీక్ష కేంద్రాలను ఆయన ప రిశీలించి మాట్లాడారు. విద్యార్థులు మొదటి రోజు కావడంతో తప్పనిసరిగా గంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సమయం దాటాక అను మతించబోమన్నారు. పరీక్ష కేంద్రాల్లో పక డ్బందీ నిఘాను అమలు చేస్తున్నామన్నారు. వేములవాడలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, వివేకానంద, విద్యాకళ జూనియర్‌ కళాశాలల ను పరీక్ష కేంద్రాలుగా విద్యార్థుల కోసం ఏర్పా టుచేశామన్నారు. ఇక వేములవాడలో 1006 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఇందు లో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో సీఎస్‌గా శేఖర్‌, డీవోగా వాణి, వివేకానందలో సీఎస్‌గా సతీశ్‌, డీవోగా మేఘశ్యామ్‌, విద్యాకళ జూని యర్‌ కళాశాలలో సీఎస్‌గా అరుంధతి, డీవోగా ప్రమోద్‌ వ్యవహరించనున్నారు. ఈమేరకు ఏర్పాట్లు పూర్తయినట్లు తెలిపారు.


logo