శనివారం 11 జూలై 2020
Rajanna-siricilla - Mar 03, 2020 , 01:47:14

గోదారి జలాల రాకతో తీరనున్న నీటి కష్టాలు

గోదారి జలాల రాకతో  తీరనున్న నీటి కష్టాలు

చందుర్తి: గోదారి జలాలు రాకతో మండల రైతులకు నీటి కష్టాలు తీరుతాయని ఎంపీపీ బైరగోని లావణ్య అన్నా రు. సోమవారం మెట్ట ప్రాంత యాసంగి సాగు కోసం ఫాజు ల్‌ నగర్‌ చెరువు నుంచి నీటిని విడుదల చేయగా రైతులు, టీఆర్‌ఎస్‌ నాయకులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ కరువు ప్రాంతమైన చందుర్తి మండలానికి మూడోసారి కాళేశ్వర జలాలు వచ్చాయని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు, స్థానిక శాసనసభ్యుడు రమేశ్‌బాబు ప్రత్యేక చొరవ తీసుకొని గోదారి జలాల విడుదలకు ప్రత్యేక కృషి చేస్తున్నారనీ, వారికి మండల ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామని పే ర్కొన్నారు. సింగిల్‌విండో చైర్మన్‌ తిప్పని శ్రీనివాస్‌ మాట్లాడుతూ రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నది ప్రభుత్వం టీఆర్‌ఎస్‌  మా త్రమేనన్నారు. గోదారి జలాలు మండలానికి చేరడంతో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ మందాల అబ్రహం, సింగిల్‌విండో చైర్మన్లు తిప్పని శ్రీనివాస్‌, జలగం కిషన్‌రావు, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు మరాఠి మల్లిక్‌,  సర్పంచ్‌లు లింగంపల్లి కరుణాకర్‌, లింగంపల్లి సత్తయ్య, గట్టు లక్ష్మీనారాయణ, కమలాకర్‌రావు, మ్యాకల పర్శరాములు, ఎంపీటీసీలు రమేశ్‌ రావు,  టీఆర్‌ఎస్‌ నాయకులు పొన్నాల శ్రీనివాసరావు, మ్యాకల ఎల్లయ్య, బైరగోని రమే శ్‌, ఈర్లపల్లి రాజు, బాల్‌రెడ్డి, మాదాసు ప్రసాద్‌, కొమ్ము రమేశ్‌, యండీ ఇస్మాయిల్‌, కొండ లక్ష్మణ్‌, లక్ష్మణ్‌రావు, గోపాల్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు, రైతులు పాల్గొన్నారు.   


ఫాజుల్‌నగర్‌ చెరువు వద్ద పూజలు

వేములవాడ రూరల్‌: ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి గోదారి జలాలు విడుదల చేయగా ఫాజుల్‌నగర్‌కు రావడంతో టీ ఆర్‌ఎస్‌ నాయకులు పూజలు చేశారు. సోమవారం మండ లంలోని ఫాజుల్‌నగర్‌ గ్రామ చెరువు వద్ద టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు గడ్డం హన్మండ్లు, వేములవాడ పట్టణాధ్యక్షుడు పుల్కంరాజు, సర్పంచ్‌లతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు.   సీఎం కేసీఆర్‌, ఎమ్మెల్యే రమేశ్‌బాబు కృషితో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వస్తున్న గోదారి జలాలతో పల్లెలు సస్యశ్యామలం అవుతున్నాయని గడ్డం హన్మండ్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌లు వేణుగోపాల్‌, రిజ్వానా పాషా, తదితరులు ఉన్నారు. logo