సోమవారం 06 జూలై 2020
Rajanna-siricilla - Mar 03, 2020 , 01:43:29

న్యాయవాదులు సంఘ సభ్యత్వాన్ని నమోదు చేసుకోవాలి

న్యాయవాదులు సంఘ సభ్యత్వాన్ని నమోదు చేసుకోవాలి

వేములవాడ, నమస్తేతెలంగాణ: వేములవాడ బార్‌ అసోసియేషన్‌ సభ్యులు సంఘ సభ్యత్వాన్ని పొడిగించుకోవడానికి నమోదు చేసుకోవాలని బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు పిట్టల మనోహర్‌ అన్నారు. సోమవారం కార్యవర్గ సమావేశం అనంతరం మాట్లాడుతూ ప్రతి సభ్యుడూ రూ.1200 చెల్లించి రెన్యువల్‌ చేసుకోవాలన్నారు. ఈనెల 20 సాయంత్రం 5 గంటలలోపు చెల్లించాలన్నారు. నగదును ప్రధాన కార్యదర్శి పెంట రాజు, కోశాధికారి అంజయ్యకు అందజేసి రశీదు పొందాలని పేర్కొన్నారు. ఏఐబీ పత్రం ఇవ్వని సభ్యులు సభ్యత్వ రుసుంతోపాటు పత్రాన్ని కూడా అందజేయాలని తెలిపారు. కార్యవర్గం కాలపరిమితి ముగుస్తున్నందున తిరిగి ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల అధికారిగా రేగుల దేవేందర్‌ను కూడా తీర్మానించి నియమించామని పేర్కొన్నారు. సమావేశంలో ప్రధాన కార్యదర్శి పెంట రాజు, న్యాయవాదులు నగుబోతు విష్ణు, నక్క దివాకర్‌, గడ్డం సత్యనారాయణరెడ్డి, దేవయ్య, పొత్తూరి అనిల్‌కుమార్‌, గుడిసె సదానందం, కా తుబండ నర్సింగరావు, పారువెళ్ల శ్రీనివాస్‌, శంకర్‌, తాహెర్‌పాషా, మహేశ్‌లు ఉన్నారు. 


logo