గురువారం 02 జూలై 2020
Rajanna-siricilla - Mar 02, 2020 , 01:46:07

ముమ్మరంగా‘పట్టణ ప్రగతి’

ముమ్మరంగా‘పట్టణ ప్రగతి’

వేములవాడ, నమస్తే తెలంగాణ: వేములవాడ పురపాలక సంఘంలో అన్నివార్డుల్లో పట్టణ ప్రగతి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఆదివారం ఖాళీస్థలాల్లో చెత్త తొలగింపు, మురికి కాలువలను మున్సిపల్‌ సిబ్బంది శుభ్రపరిచారు. కమిషనర్‌ శ్రీనివాస్‌రెడ్డి క్షేత్రస్థాయిలో పనులను పరిశీలించారు. వార్డు కౌన్సిలర్లు వీధు ల్లో తిరుగుతూ పనులను పరిశీలించారు. పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలన్నారు. పట్టణ ప్రగతిలో సమస్యలను పరిష్కరించి, ప్రజలకు జవాబుదారీతనంగా పని చేస్తామని తెలిపారు. అధికారులు ప్రజాప్రతినిధులు, ప్రజలతో కలిసి అభివృద్ధిలో నగరాన్ని ముందుకు తీసుకుపోతామన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే నగరం సుందరంగా మారుతుందన్నారు. వార్డు అధికారులు, మున్సిపల్‌ అధికారులు క్షేత్రస్థాయిలో పట్టణ ప్రగతిని వేగవంతం చేస్తున్నారు. logo