ఆదివారం 05 జూలై 2020
Rajanna-siricilla - Mar 02, 2020 , 01:10:20

అ‘పూర్వ’ సమ్మేళనాలు

అ‘పూర్వ’ సమ్మేళనాలు

సిరిసిల్ల రూరల్‌: తంగళ్లపల్లిలోని జడ్పీహెచ్‌ఎస్‌ పాఠశాల పూర్వ విద్యార్థులు 40 ఏళ్లకు కలుసుకోవడంతోపాటు  సేవా కార్యక్రమాలను నిర్వహించడం ఆదర్శనీయమని సిరిసిల్ల సెస్‌ చైర్మన్‌ దొర్నాల లక్ష్మారెడ్డి అన్నారు. ఆదివారం తంగళ్లపల్లి మండలం కేంద్రంలోని జడ్పీహెచ్‌ఎస్‌ పాఠశాలలో 1978-79 ఎస్సెస్సీ బ్యాచ్‌ 40 వసంతాలు పూర్తి చే సుకోవడంతో బాల్యమిత్రులు మాటాముచ్చట పేరిట వేడుకలను జరుపుకున్నారు. రోడ్డు భవనశాఖ అడిషనల్‌ సెక్రె టరీ తుమ్మ రామస్వామి అధ్యక్షతన వేడుకలు జరిగాయి. ఈకార్యక్రమానికి అతిథిగా సెస్‌ చైర్మన్‌ దొర్నాల లక్ష్మారెడ్డి, ఎంపీపీ పడిగెల మానస, ఏఎంసీ చైర్‌పర్సన్‌ లింగం రా ణిలు హాజరయ్యారు. మొదట పాఠశాల ఎదుట ఉన్న అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేశారు. ర్యాలీగా పా ఠశాలకు చేరుకోగా, విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. అనంతరం 1978-79లో పాఠాలు బోధించిన గురువులకు ఆత్మీయ సన్మానం చేశారు. ఈసందర్భంగా సెస్‌ చైర్మన్‌ లక్ష్మారెడ్డి మాట్లాడుతూ బాల్య మిత్రులంతా ఇలా కలుసుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఇప్పటికే వారు పాఠశాలలో మినీట్యాంక్‌ ఏర్పాటుతోపాటు గ్రామంలోనూ పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారని పేర్కొన్నారు. అనంతరం 40మంది పూర్వ విదార్థులు జ్ఞాపకాలను మాటముచ్చటలో పంచుకున్నారు. వేడుకల్లో విద్యార్థులు నృత్యాలు అలరించాయి. ప్రజాప్రతినిధులకు ఆత్మీయం సన్మానం చే శారు. కార్యక్రమంలో ఎంపీడీవో చీకోటి మదన్‌మోహన్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు గజభీంకార్‌ రాజన్న, స ర్పంచ్‌ అంకారపు అనిత, ఎంపీటీసీ కోడి అంతయ్య, స ర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు వలకొండ వేణుగోపాలరావు, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు చెన్నమనేని వెంకట్రావు, ఉపసర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు పెద్దూరి తిరుపతి, సింగిల్‌ విండో చైర్మన్‌ బండి దేవదాస్‌, మాజీ సర్పంచ్‌ అంకారపు రవీందర్‌, వైస్‌ చైర్మన్‌ వెంకటరమణరెడ్డితోపాటు పూ ర్వ విద్యార్థులు మచ్చ అంజనేయులు, రాపెల్లి ఆనందం, శాంత, శోభ,అమృత, వైద్య శివప్రసాద్‌, బండి సత్తయ్య, భానుమూర్తి, కుటుంబసభ్యులు, స్థానిక నేతలు ఉన్నారు.

పాఠశాలకు డిజటల్‌ ప్రొజెక్టర్‌, బీరువాల అందజేత

తంగళ్లపల్లిలోని ప్రాథమక పాఠశాలకు పూర్వవిద్యార్థు లు డిజటల్‌ క్లాస్‌ల కోసం ప్రొజెక్టర్‌, రెండు బీరువాలు, లైబ్రరీ పుస్తకాలను అందజేశారు. ఈమేరకు ఆదివారం జరిగిన పూర్వ విద్యార్థులు సమ్మేళన వేడుకల్లో ఉపాధ్యాయులకు అందజేశారు. ఈసందర్భంగా వారికి పాఠశాల ఉపాధ్యాయులు కృతజ్ఞతలు తెలిపారు.


logo