శనివారం 04 జూలై 2020
Rajanna-siricilla - Mar 01, 2020 , 02:10:01

చట్టాలపై అవగాహన ఉండాలి

చట్టాలపై అవగాహన ఉండాలి

సిరిసిల్ల రూరల్‌: మహిళలు, విద్యార్థినులు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని సిరిసిల్ల కోర్టు జూనియర్‌ సివిల్‌ జడ్జి శంకర్‌శ్రీదేవి అన్నారు. శనివారం సిరిసిల్ల మున్సిపల్‌ పరిధిలోని పెద్దూరులోని ప్రభుత్వ పాఠశాలలో  న్యాయ విజ్ఞానసదస్సు నిర్వహించారు. జడ్జి శ్రీదేవి సదస్సుకు హాజరై మాట్లాడారు. విద్యార్థులు ఉన్నతలక్ష్యాన్ని ఎంచుకొని సాధనకు కృషి చేయాలని పేర్కొన్నారు. విద్యార్థి దశలో ఆకర్షణ, ప్రలోభాలకు లోనుకావద్దని సూచించారు. బాల్యవివాహాలను నిషేధించాలని తెలిపారు. మహిళల సంరక్షణ కోసం రూపొందించిన చట్టాలను వినియోగించుకోవాలన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న వసతులు, సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని ఉద్ఘాటించారు. విద్యార్థినులు చట్టాలను తెలుసుకోవాలని, అప్పుడే అన్నివిధాల ఉన్నతికి దోహదపడుతుందన్నారు. సదస్సులో కౌన్సిలర్‌ చెన్నమనేని కీర్తి, హెచ్‌ఎం రవీందర్‌, ఉపాధ్యాయులు సతీశ్‌, పద్మ, వనలత, వీణ, గణేశ్‌, ప్రమీల, రమతోపాటు విద్యార్థులు ఉన్నారు.logo