గురువారం 02 జూలై 2020
Rajanna-siricilla - Feb 29, 2020 , 01:11:49

ఇంటింటికీ తాగునీరందించాలి

ఇంటింటికీ తాగునీరందించాలి

సిరిసిల్ల, నమస్తే తెలంగాణ: రానున్న వేసవిలో నీటి ఎద్దడి లేకుండా చూడాలని, ఇంటింటికీ మిషన్‌ భగీరథ నీటిని అందించాలని సంబంధిత అధికారులను జిల్లా పరిషత్‌ అధ్యక్షురాలు న్యాలకొండ అరుణ ఆదేశించారు. జడ్పీ కార్యాలయంలో మిషన్‌ భగీరథ అధికారులతో శుక్రవారం ప్రత్యేక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. వేసవిలో నీటి ఎద్దడి రాకుండా ముందస్తుగా తీసుకోవాల్సిన అంశాలపై దిశినిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జడ్పీ అధ్యక్షురాలు అరుణ మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తం గా మిషన్‌ భగీరథ నీటిని అన్నిగ్రామాలకు అందించాలని, ఏవైనా సమస్యలుంటే సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. సీఎం కేసీఆర్‌ స్వప్నాన్ని సాకారం చేయాలని వివరించారు. నీటి సమస్య పరిష్కారానికి మంత్రి కేటీఆర్‌ సహకారంతో అవసరమున్న చోట ప్రత్యేక నిధులు కేటాయించడానికి ప్రతిపాదనలు చేయాలని సూ చించారు. గ్రామాల్లో కొత్త కనెక్షన్లు ఇవ్వాలని, పాత పైప్‌లైన్ల లీకేజీలను అరికట్టాల ని ఆదేశించారు. పనుల్లో ఏవైనా ఇబ్బందులు తలెత్తితే స్థానిక నేతలకు సమాచారమిచ్చి పరిష్కారం దిశలో కృషిచేయాలని సూచించారు. సమావేశంలో జడ్పీ వైస్‌ చైర్మన్‌ సిద్ధం వేణు, జడ్పీ సీఈవో గౌతంరెడ్డి, డిప్యూటీ సీఈవో నాగలక్ష్మి, జడ్పీటీసీలు లక్ష్మణ్‌రావు, కళావతి, విజయ, కుమార్‌, జడ్పీ కో ఆప్షన్‌ సభ్యులు అ హ్మద్‌, చాంద్‌పాషా, గడ్డం నర్సయ్య, ఎంపీపీలు చంద్రయ్య గౌడ్‌, స్వరూప, లావణ్య, వెంకటరమణారెడ్డి, కరుణ, మానస , రేణుక, మిషన్‌ భ గీరథ ఎస్‌ఈ చంద్రమౌళి, ఈఈ జానకి, డీఈలు శ్రీనివాస్‌, అనిల్‌, సుమలత, ఏఈలు పాల్గొన్నారు.


logo