గురువారం 03 డిసెంబర్ 2020
Rajanna-siricilla - Feb 27, 2020 , 00:47:52

హోరాహోరీగా వాలీబాల్‌ ఫైనల్‌ మ్యాచ్‌లు

 హోరాహోరీగా వాలీబాల్‌ ఫైనల్‌ మ్యాచ్‌లు

వీర్నపల్లి: మండల కేంద్రంలో నాలుగురోజులుగా కొనసాగుతున్న అండర్‌-16 రాష్ట్రస్థాయి బాలబాలికల వాలీబాల్‌ పోటీలు ఆద్యంతం రసవత్తరంగా సాగాయి. బుధవారం నిర్వహించిన ఫైనల్‌ మ్యాచ్‌లో జట్లు హోరాహోరిగా తలపడ్డా యి. సెమీఫైనల్స్‌ బాలురవిభాగంలో రంగారెడ్డి జట్టుపై మహబూబ్‌నగర్‌ జట్టు (3-2) స్కోర్‌ తే డాతో, హైదరాబాద్‌ జట్టుపై వరంగల్‌ జట్టు (3-1)స్కోర్‌ తేడాతో, బాలికల విభాగంలో నల్గొండ జట్టుపై రంగారెడ్డి జట్టు(3-0), నిజామాబాద్‌ జ ట్టుపై  మహబూబ్‌నగర్‌ జట్టు (3-2) స్కోర్‌ తే డాతో గెలుపొందాయి. మధ్యాహ్నం నిర్వహించి న ఫైనల్‌ మ్యాచ్‌ బాలుర విభాగంలో మహబూబ్‌నగర్‌ జట్టుపై వరంగల్‌ జట్టు(3-0) స్కోర్‌ తేడాతో, బాలికల విభాగంలో మహబూబ్‌నగర్‌ జట్టుపై రంగారెడ్డి జట్టు(3-0)స్కోర్‌ తేడాతో విజయం సాధించి ఓవరాల్‌ చాంపియన్‌ షిప్‌ను దక్కించుకున్నాయి. 

క్రీడల్లో సత్తా చాటాలి: ఎస్పీ

అనంతరం నిర్వహించిన ముగింపు కార్యక్ర మానికి ఎస్పీ రాహుల్‌ హెగ్డే, వాలీబాల్‌ క్లబ్‌ రాష్ట్ర అధ్యక్షుడు రమేశ్‌బాబు, జిల్లా అధ్యక్షుడు కనమేని చక్రధర్‌రెడ్డి ముఖ్యఅతిథులుగా హాజర య్యారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. మారుమూల ప్రాంత క్రీడాకారులు పోటీలను స ద్వినియోగం చేసుకుంటూ జాతీయ స్థాయికి ఎదగాలని సూచించారు. గ్రామీణ ప్రాంత క్రీడాకారులను వెలికితీయడానికి జీవితంలో ఒడిదుడుకులు సహజమేనని, ఓటమి ఎదురైనా ప్రయత్నాన్ని విరమించకూడదని వివరించారు. నిరుద్యోగ యువతకు పోలీస్‌ రిక్రూట్‌మెంట్లలో జిల్లా పోలీస్‌ తరపున పూర్తి సహకారాలు అందిస్తామని, ప్రభుత్వ ప్రోత్సాహాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. కొత్త మండల వీర్నపల్లిలో రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించడం అభినందనీయని కొనియాడారు. అనంతరం బాలుర విభాగంలో మొదటి స్థానంలో నిలిచిన వరంగల్‌, ద్వితీయ స్థానంలో నిలిచిన మహబూబ్‌నగర్‌తో పాటు బాలికల విభాగంలో మొదటి స్థానంలో ని లిచిన రంగారెడ్డి, ద్వితీయ స్థానంలో నిలిచిన మ హబూబ్‌నగర్‌ జట్లకు బహుమతులు, ప్రశంసా పత్రాలను అందజేసి అభినందించారు. కార్యక్ర మంలో జడ్పీటీసీ కళావతి, ఎంపీపీ భూల, వాలీబాల్‌ అసోసియేషన్‌ ప్రధానకార్యదర్శి హన్మంతరెడ్డి, కోశాధికారి సుధీర్‌రావు,  జడ్పీ కో ఆప్షన్‌ సభ్యుడు చాంద్‌పాషా, ఆర్‌ఎస్‌ఎస్‌ మండలాధ్యక్షుడు శంకర్‌, వైస్‌ ఎంపీపీ హేమ, వాలీబాల్‌ క్లబ్‌ జిల్లా కార్యదర్శి రాందాస్‌, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు రాజిరెడ్డి, బంజార సంఘం జిల్లా అధ్యక్షుడు సురేశ్‌నాయక్‌, ఎస్‌ఐ రామచంద్రంగౌడ్‌, మండల కో ఆప్షన్‌ సభ్యులు ఉస్మాన్‌, సర్పంచ్‌లు దినకర్‌, మల్లేశం, ఎంపీటీసీ అరుణ్‌, ఉపసర్పంచ్‌ రవి, నేతలు మల్లేశం, జగన్‌, శ్రీరాంనాయక్‌, సంతోష్‌, తిమ్మాపూర్‌ పీఏసీఎస్‌ చైర్మన్‌ సుధీర్‌రా వు, పీఈటీలు పాల్గొన్నారు. అంతకు ముందు క్రీడాపోటీలకు రూ.లక్ష ఆర్థిక సాయం అందించిన వేములవాడ టీఆర్‌కే చారిటబుల్‌ ట్రస్ట్‌ సభ్యులను, దాతలను ఘనంగా సన్మానించారు.