మంగళవారం 07 జూలై 2020
Rajanna-siricilla - Feb 27, 2020 , 00:45:05

ప్రజల సహకారంతోనే అభివృద్ధి

ప్రజల సహకారంతోనే అభివృద్ధి

చొప్పదండి, నమస్తే తెలంగాణ : ప్రజల సహకారంతోనే పట్టణాభివృద్ధి సాధ్యమని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ అన్నారు. కరీంనగర్‌ అదనపు కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌లాల్‌తో కలిసి నగరంలోని 9, 11 వార్డుల్లో పట్టణ ప్రగతిలో చేపడుతున్న పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ తిరుగుతూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు తమ ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉం చుకోవాలనీ, ఇంకుడు గుంతలు నిర్మించుకోవాల ని సూచించారు. మూడు రోజులుగా చేపడుతున్న పట్టణ ప్రగతిలో ఎలాంటి ప్రణాళిక లేకుండా, స మాచారం లేకుండా ఇష్టం వచ్చినట్లు వ్యవహరి స్తూ ప్రభుత్వ లక్ష్యాన్ని కమిషనర్‌ రాజేందర్‌కుమార్‌పై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టణంలో స్థానికంగా ఉన్నా కలెక్టర్‌, అదనపు కలెక్టర్‌ వచ్చినా కనీసం సమాచారం ఇవ్వడం లేదంటూ అసహనం వ్యక్తం చేశారు. పట్టణంలో ఇండ్ల నిర్మాణాల అనుమతి ఇవ్వడంలో ఎందుకు జాప్యం చే స్తున్నారంటూ టౌన్‌ ప్లానింగ్‌ అధికారి రమేశ్‌ను ప్రశ్నించారు. జిల్లాలో ఇతర మున్సిపాలిటీల్లో జరుగుతున్న పట్టణ ప్రగతి పనులతో చూస్తే చొప్పదండిలో సక్రమంగా సాగడం లేదని అదనపు కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌లాల్‌ అధికారుల పనితీరుపై అ సంతృప్తి వ్యక్తం చేశారు. పట్టణాన్ని శుభ్రంగా ఉం చేందుకు, రోడ్ల వెంట ఉన్న పిచ్చిమొక్కలను తొలగించేందుకు ఎక్స్‌కవేటర్‌, ట్రాక్టర్లను ఏర్పాటు పనులు వేగవంతం చేయాలని చెప్పినా ఎందుకు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.


logo