గురువారం 09 జూలై 2020
Rajanna-siricilla - Feb 27, 2020 , 00:42:01

‘పట్టణ ప్రగతి’లో భాగస్వాములవ్వాలి

‘పట్టణ ప్రగతి’లో భాగస్వాములవ్వాలి

వేములవాడ, నమస్తే తెలంగాణ: పట్టణ ప్రగతిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములుకావాలని జిల్లా అదనపు కలెక్టర్‌ అంజయ్య పేర్కొన్నారు. వేములవాడ పురపాలక సంఘం పరిధిలో మూడోరోజు జరిగిన పట్టణ ప్రగతి పనులను బుధవారం ఆకస్మిక పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పారిశుధ్యం, కనీస మౌలిక వసతుల కల్పనకు అధికారులు, నాయకులు పనిచేస్తున్నప్పటికీ ప్ర జలు సహకరించినపుడే కార్యక్రమం విజయవంతమవుతుందన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు మున్సిపల్‌ చట్టం, పట్టణంలో చేస్తున్న పనుల గురించి ప్రజలకు వివరించాల న్నారు. అనంతరం పట్టణంలోని 3, 11, 14 వార్డుల్లో పనులను పరిశీలించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉం చుకోవాలన్నారు. ఆయన వెంట మున్సిపల్‌ అధ్యక్షురాలు రామతీర్థపు మాధవి, కమిషనర్‌ శ్రీనివాస్‌రెడ్డి, పట్టణ ప్రణాళిక విభాగం పర్యవేక్షకుడు అంజయ్య, శానిటరీ ఇన్‌చార్జి ఇన్‌స్పెక్టర్‌ గంగాధర్‌, పట్టణ సెస్‌ డైరెక్టర్‌ రామతీర్థపు రాజు, కౌన్సిలర్లు నిమ్మశెట్టి విజయ్‌, యాచమనేని శ్రీనివాసరావు, బింగి మహేశ్‌ ఉన్నారు. 

వేములవాడ రూరల్‌ : వార్డులను పరిశుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్‌ అంజయ్య పేర్కొన్నారు. వే ములవాడ మున్సిపల్‌లో విలీనమైన తిప్పాపూర్‌, నాంపెల్లి, శాత్రాజుపల్లిలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన పట్టణ ప్రగతి విజయవంతంగా కొనసాగేందుకు  ప్రతి ఒక్కరూ కృషిచేయాలన్నారు. పట్టణ ప్రగతితో పట్టణాలు, నగరాలు కొత్తరూపు సంతరించుకుంటాయని తెలిపారు. ప్రతివార్డులో పెద్దఎత్తున మొ క్కలు నాటే కార్యక్రమం చేపట్టాలని సూచించారు.  వార్డు కౌన్సిలర్‌తో పాటు వార్డు కమిటీ, మున్సిపల్‌ సిబ్బంది, మహిళా సంఘాల సభ్యులు అందరూ ఐక్యంగా ఉండి పనులు చేపట్టాలని సూచించారు. ఆయనవెంట ము న్సిపల్‌ అధ్యక్షురాలు రామతీర్థపు మాధవి, కమిషనర్‌ శ్రీనివాస్‌ రెడ్డి, సెస్‌ డైరెక్టర్‌ రామతీర్థపు రాజు, కౌన్సిలర్‌ నీలం క ల్యాణి, నిమ్మశెట్టి విజయ్‌, టీపీవో అంజయ్య, నాయకు లు నీలం శేఖర్‌, రాజు, తదితరులున్నారు. 


logo