శనివారం 04 జూలై 2020
Rajanna-siricilla - Feb 26, 2020 , 04:07:41

రేండోరోజు ఉత్సవాంగ

రేండోరోజు ఉత్సవాంగ

రాజన్న సిరిసిల్ల ప్రతినిధి, నమస్తేతెలంగాణ: పట్టణాలు ప్రగతి బాట పట్టాయి. స్వచ్ఛతే లక్ష్యంగా వార్డులు అడుగులు వేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణ ప్ర గతి కార్యక్రమం రెండో రోజైన మంగళవారం ఉత్సాహం సా గింది. అధికారులు, ఆయా వార్డుల ప్రజలు, ప్రజాప్రతినిధు లు భాగస్వాములై పారిశుధ్య పనులను నిర్వహించారు. సిరిసిల్ల పట్టణంలోని 2, 3, 13, 14వార్డుల్లో ప్రగతి పనులు జరిగాయి. వార్డు కౌన్సిలర్లు, కమిటీ సభ్యులు, ప్రత్యేక అధికారులు వార్డుల్లో ప ర్యటించి మురుగు కాలువలు, వీధులు, వీధి లైట్లు పలు అంశాలకు సంబంధించిన సమస్యలను గు ర్తించారు. వాటి పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటున్న ట్లు తెలిపారు. పట్టణంలోని మొత్తం ట్రాక్టర్లన్నింటినీ పట్టణ ప్రగతికే వినియోగిస్తున్నారు. రోడ్లపైన చెత్తవేయకుండా, తడిచెత్త, పొడిచెత్త సేకరణపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. కమిషనర్‌ సమ్మయ్య, డీఈ వెంకటశేషయ్య, చైర్‌పర్సన్‌ జిం దం కళ, జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ ఆకునూరి శంకరయ్య, రైతు సమన్వయ సమితి జిల్లా చైర్మన్‌ గడ్డం నర్సయ్య, 39మంది ప్రత్యేక అధికారులు, కౌన్సిల ర్లు ప్రగతి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 


ఖాళీ స్థలాల్లో మొలిచిన పిచ్చిమొక్క లు, తుమ్మలను తొలగించుకోవాలని సంబంధిత భూ యజమానులకు అధికారులు నోటీసులు జారీ చేశారు. వెంటనే తొలగించి శుభ్రం చేయకుంటే జరిమానాలు విధిస్తామని హె చ్చరించారు. ఉదయం నుంచి సాయంత్రం వర కు చేపట్టిన ప్రగతి పనులను కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌, అదనపు కలెక్టర్‌ అం జయ్య పర్యవేక్షించారు. వేములవాడ పట్టణంలోని 7, 8, 24, 25వ వార్డుల్లో ప ట్టణ ప్రగతి కార్యక్రమాలను నిర్వహించారు. మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌రెడ్డి, అధ్యక్షురా లు రామతీర్థపు మాధవి ఆధ్వర్యంలో కౌన్సిలర్లు, ప్రజా ప్రతినిధులు, అధికారులు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 


నిర్వక్ష్యం చేస్తే ఉపేక్షించేది లేదు

పట్టణ ప్రగతి కార్యక్రమాలను నిర్లక్ష్యం చేస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ హెచ్చరించారు. కొత్త మున్సిపల్‌ చట్టంలోని ప్రభుత్వ నిర్ధేశిత లక్ష్యాలను సాధించకుంటే ప్రజాప్రతినిధులు, అధికారులపై నిబంధనల మేరకు కఠిన చర్యలు తీసుకుంటామని వివరించారు. కౌన్సిలర్లు, ప్రత్యేక అధికారులు క్షేత్రస్థాయిలో వార్డుల్లో పర్యటించి క్షేత్రస్థాయిలో నెలకొన్న తాత్కాళిక, దీర్ఘకాలిక సమస్యలకు వెంటనే పరిష్కారం చూపాలని ఆదేశించారు. పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. చిత్తశుద్ధి, అంకితభావంతో ప్రజలంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. logo