శనివారం 11 జూలై 2020
Rajanna-siricilla - Feb 24, 2020 , 02:15:18

రాజన్న ఆదాయం 1.13 కోట్లు

రాజన్న ఆదాయం 1.13 కోట్లు
  • శివరాత్రి జాతరను పురస్కరించుకుని ఆలయానికి పోటెత్తిన భక్తులు
  • కోడె మొక్కుల ద్వారానే రూ. 49లక్షలు..
  • గతేడాది కంటే రూ.15లక్షలు అధికం..
  • రేపటి నుంచి రెండ్రోజుల పాటు హుండీల లెక్కింపు
  • వేములవాడ ఆలయ ఈవో కృష్ణవేణి

వేములవాడ, నమస్తేతెలంగాణ: మహాశివరాత్రి జాతరను పురస్కరించుకుని వేములవాడ రాజన్న ఆలయానికి రూ.1.13కోట్ల ఆదాయం సమకూరింది. ఈ మేరకు ఆలయ ఈవో కృష్ణవేణి ఆదివారం ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఈ నెల 20 నుంచి 22వ తేదీ వరకు మూడ్రోజుల పాటు స్వామివారి సన్నిధిలో అత్యంత వైభవంగా మహాశివరాత్రి వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా రాజన్న దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఈ క్రమంలో వివిధ ఆర్జిత సేవలను నిర్వహించుకున్నారు. తద్వారా ఆలయానికి రూ.1కోటి13 లక్షల92181ల ఆదాయం సమకూరినట్లు ఈవో వివరించారు. అందులో ప్రత్యేక కోడెమొక్కుల ద్వారా రూ.49లక్షల73వేల600, ప్రసాదాల విక్రయాల ద్వారా రూ. 48లక్షల34వేల120లు, శీఘ్ర దర్శనాల ద్వారా రూ. 8లక్షల62వేల200లు, ఆర్జిత సేవల ద్వారా రూ.2లక్షల15వేల462, ధర్మశాలల అద్దె ద్వారా రూ.1లక్ష35వేల200లు, కేశఖండనాల ద్వారా రూ.1లక్ష1వెయ్యి 380లు, బద్దిపోశమ్మ ఆలయంలో భక్తులు సమర్పించిన మొక్కుల ద్వారా రూ.1లక్ష57వేల715, భీమేశ్వరాలయంలో రూ. 46వేల310లు, నగరేశ్వరస్వామి ఆలయంలో రూ. 21వేయి530లు, ఇతరత్రా వాటి ద్వారా రూ. 44వేల664ల ఆదాయం స్వామివారికి సమకూరిందని వివరించారు. 


గతేడాది కంటే రూ. 15 లక్షలు అధికం..

గడిచిన 2019 మహాశివరాత్రి జాతర కంటే ఈ ఏడాది రూ. 15లక్షల24వేల800ల రూపాయల వరకు అధికంగా ఆదాయం సమకూరినట్లు ఈవో వెల్లడించారు. అదేవిధంగా జాతరను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన హుండీలను మంగళ, బుధవారాల్లో లెక్కించనున్నట్లు ఈవో ఈ సందర్భంగా వివరించారు. దీంతో మరో రూ. కోటికి పైగా ఆదాయం ఆలయానికి సమకూరే అవకాశముందని ఆలయ వర్గాలు వెల్లడించాయి. కాగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో లెక్కిస్తామని చెప్పారు. ఇందుకు సంబంధించిన వివరాలను లెక్కింపు పూర్తికాగానే వెల్లడిస్తామన్నారు.logo