మంగళవారం 14 జూలై 2020
Rajanna-siricilla - Feb 22, 2020 , 04:47:22

కోనసీమను తలపించే అందాలు

కోనసీమను తలపించే అందాలుమధుర జ్ఞాపకం విహంగ వీక్షణం.. 


వేములవాడ, నమస్తేతెలంగాణ: ఒకవైపు ఆరాధ్యదైవదర్శనం. మరోవైపు విహంగ వీక్షణ భాగ్యం. ఒకేసారి కలగడంతో వేములవాడ రాజన్న భక్తులు ఆనందంలో మునిగితేలుతున్నారు. వేములవాడ రాజన్న సన్నిధిలో నిర్వహిస్తున్న మహాశివరాత్రి జాతర భక్తులను పర్యాటకశాఖ ఆధ్వర్యంలో కల్పించిన హెలికాప్టర్‌ సేవలు రెండోరోజూ కొనసాగాయి. భక్తులను ఎంతగానో అలరిస్తున్నాయి. శ్రీ రాజరాజేశ్వరజలాశయం అందాలను, వేములవాడ పట్టణాన్ని హెలికాప్టర్‌ ద్వారా వీక్షించి ప్రజలు మురిసిపోతున్నారు. సేవలను వినియోగించుకునేందుకు భక్తులు పెద్దెత్తున తరలివస్తున్నారు. మొదటిసారిగా రాజన్న క్షేత్రంలో హెలికాప్టర్‌ సేవలు అందుబాటులోకి రాగా సుదీర ప్రాంతాల నుంచి కూడా అందులో ప్రయాణించేందుకు తరలివస్తున్నారు. జలాశయం అందాలను అస్వాదిస్తూ మధురానుభూతిని పొందుతున్నారు. ఈ సందర్భంగా పలువురు వారి ఆనందాన్ని ‘నమస్తే తెలంగాణ’తో పంచుకున్నారు. పర్యాటకశాఖ హెలికాప్టర్‌ సేవలను అందుబాటులోకి తీసుకరాగా వేములవాడ, సిరిసిల్ల నుంచే కాకుండా హైదరాబాద్‌ నుంచి కూడా ప్రజలు తరలివచ్చి సేవలను పొం దారు. అందులో వేములవాడ పట్టణంతో పాటు శ్రీ రాజరాజేశ్వర జలాశయంతో కలుపుకొని విహంగ వీక్షణానికి పర్యాటకశాఖ అవకాశాన్ని కల్పించింది. 15 నిముషాల పాటు ఎస్‌ఆర్‌ఎస్‌ జలాశయంతో పాటు నాంపల్లి గుట్టను కలుపుకొని చూపుతున్నది. ఈ సేవలను వినియోగించుకునేందుకు భక్తులు ఉత్సాహాన్ని చూపడంతో హెలికాప్టర్‌ సేవలకు శుక్రవారం అనూహ్య స్పందన లభించింది. ఒ క్కో రౌండ్‌కు ఐదుగురి చొప్పున దాదాపుగా 20రౌండ్లలో వంద మంది హెలికాప్టర్‌లో చుట్టివచ్చారు. విహంగ వీక్ష ణం ద్వారా జలాశయం అందాలను ఆస్వాదించారు. పచ్చ ని పొలాలు, చెట్లు, జలాశయంలోని నీటి నిల్వలతో ఈ ప్రాంతం కొనసీమను తలపిస్తున్నదని మురిసిపోయారు. logo