ఆదివారం 12 జూలై 2020
Rajanna-siricilla - Feb 21, 2020 , 06:12:33

విద్యార్థులకు సర్కారు భరోసా

విద్యార్థులకు సర్కారు భరోసా

తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు అండగా ఉంటున్నదని రాష్ట్ర ఐటీ, పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు స్పష్టం చేశారు. గురువారం ఆయన సిరిసిల్లలోని ప్రభుత్వ బాలికల వసతి గృహాన్ని ప్రత్యేకంగా సందర్శించారు.

  • నిందితుడు దేవయ్యకు విధించే శిక్షే సందేశం
  • సిరిసిల్ల ఘటనను రాజకీయం చేయడం సరికాదు
  • వేధింపులను సహించం
  • ప్రభుత్వ బాలికల వసతి గృహాన్ని సందర్శించిన మంత్రి కేటీఆర్‌

సిరిసిల్ల టౌన్‌/సిరిసిల్ల క్రైం: తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు అండగా ఉంటున్నదని రాష్ట్ర ఐటీ, పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు స్పష్టం చేశారు. గురువారం ఆయన సిరిసిల్లలోని ప్రభుత్వ బాలికల వసతి గృహాన్ని ప్రత్యేకంగా సందర్శించారు. వసతి గృహంలోని విద్యార్థినులతో మాట్లాడారు. వారి సమస్యలతోపాటు జరిగిన ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. సిరిసిల్లలోని బాలికల వసతిగృహంలో జరిగిన ఘటన దురదృష్టకరనీ, ఈ ఘటనపై ప్రభుత్వం తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకున్నదని అన్నారు. వసతి గృహంలో జరిగిన ఘటన సభ్యసమాజం ఆమోదించదన్నారు. ఘటన జరిగిన వెంటనే ప్రభుత్వం తక్షణమే స్పందించిందనీ, నిందితుడు ఎవరైనా ఉపేక్షించమని స్పష్టం చేశారు. తమ పార్టీకి చెందిన దేవయ్యను బహిష్కరించగా, పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. వసతి గృహంలో విద్యార్థినులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పినట్లు పేర్కొన్నారు. నిందితుడైన దేవయ్యను కఠినంగా శిక్షించేలా ప్రభుత్వం చొరవ తీసుకుంటుందనీ, దేవయ్యకు పడే శిక్షే ఇతరులకు సందేశంగా మారుతుందన్నారు. విద్యార్థులు కోరిక మేరకు పక్కా భవనం కట్టిస్తామని తెలిపారు. దీంతో పాటుగా జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ బాలికల వసతి గృహాల్లో ఆత్మరక్షణ కోసం శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ విషయమై కలెక్టర్‌, ఎస్పీలకు ఆదేశించినట్లు చెప్పా రు. బాలికల వసతిగృహాల్లో ఆత్మైస్థెర్యం పెంపొందించేవిధంగా మహిళా అధికారులతోపాటు కామారెడ్డి ఎస్పీ సౌమ్య, ఇతర మహిళా అధికారులతో శిక్షణ కార్యక్రమాలు నిరంతరం ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. హాస్టల్‌ నుంచి వెళ్లిపోయిన బాలికలు తిరిగి వచ్చారని, త్వరలోనే పరీక్షలు ఉండడంతో వీరికి ప్రభుత్వపరంగా సహా య సహకారాలు అందిస్తామని తెలిపారు. ఇలాం టి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ అంశాన్ని రాజకీయం చేయడం సరికాదనీ, దుర్మార్గపు చర్యలను ఖండించాల్సిందేనని పేర్కొన్నారు. ఆయన వెంట జడ్పీ అధ్యక్షురాలు న్యాలకొండ అరుణ, టెస్కాబ్‌ చైర్మ న్‌ కొండూరి రవీందర్‌రావు, కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌, ఎస్పీ రాహుల్‌హెగ్డే, మున్సిపల్‌ అధ్యక్షురాలు జిందం కళ, వైస్‌ చైర్మన్‌ మంచె శ్రీనివాస్‌, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర సహాయ కార్యదర్శి గూడూరి ప్రవీణ్‌, టీఆర్‌ఎస్‌ జిల్లా అధికార ప్రతినిధి తోట ఆగయ్య, టీఆర్‌ఎస్‌ పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి, కౌన్సిలర్‌ గుండ్లపల్లి నీరజ ఉన్నారు.   


logo