మంగళవారం 14 జూలై 2020
Rajanna-siricilla - Feb 20, 2020 , 01:25:38

నేడే ‘పంచాయతీరాజ్‌ సమ్మేళనం’

నేడే ‘పంచాయతీరాజ్‌ సమ్మేళనం’


సిరిసిల్ల, నమస్తే తెలంగాణ: పల్లెలే దేశానికి పట్టుకొమ్మలు అనే నా నుడిని ముఖ్యమంత్రి  కేసీఆర్‌ నిజం చేస్తున్నారు. పల్లెల ప్రగతి కో సం ప్రత్యేక కార్యాచరణను రూపొందిస్తున్నారు. పల్లెలు అభివృద్ధి చెందితే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని భావించి ఆ దిశలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.  ఈనెల 11న హైదరాబాద్‌ ప్రగతి భవన్‌లో నిర్వహించిన కలెక్టర్ల సమావేశంలో సీఎం కేసీఆర్‌ పలు అంశా లపై దిశానిర్దేశం చేశారు. పల్లెల్లో ప్రగతిని నిరంతరం కొనసాగాలని  ఆదేశించారు. ఈ నేపథ్యంలో జిల్లా కేంద్రంలో పద్మనాయక ఫంక్షన్‌హాల్‌లో పంచాయితీరాజ్‌ సమ్మేళనాన్ని నేడు (గురువారం) నిర్వహించడానికి అధికారులు  సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ స మ్మేళనానికి హజరుకావాలని సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీ లు, తదితర ప్రజాప్రతినిధులకు అధికారులకు ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ము ఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. రెండు విడతలుగా నిర్వహించిన ప ల్లెప్రగతిలో గుర్తించిన సమస్యలను పరిష్కరించనున్నారు. ఆ తర్వా త జిల్లా వ్యాప్తంగా పల్లె ప్రగతి కార్యక్రమాలను నిర్వహించి తనఖీలను చేపట్టనున్నారు. గ్రామాల్లో పరిశుభ్రత పాటించి ఆదర్శవంతం గా తయారు చేసిన పంచాయతీలకు అవార్డులతోపాటుగా, ప్రోత్సాహకాలను అందించనున్నారు


 ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రత్యేక చోరవతో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం గ్రామాలభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నది. దీనిలో భాగంగానే పల్లె ప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి గ్రామాల్లో అమలు చేసి విజయవంతమైంది. రెండు విడుతలుగా సుమారు 50రోజుల పాటు పచ్చదనం, పరిశుభ్రత కార్యక్రమాలను ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో నిర్వహించింది. గ్రామాల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించి మురుగు కాలువలను శుభ్రం చేసి ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించింది. అదీగాక శిథిలావస్థలో ఉన్న ఇళ్లను, పాడుబడిన బావులను కూల్చి వేశారు. గ్రామాల్లో సేకరించిన చెత్తకు తడి, పోడి చెత్త బుట్టలను అందించి  ఆచెత్తను డంప్‌ యార్డ్‌లకు తరలించేందుకు ట్రాక్టర్లను అందించి పారిశుధ్య పరిరక్షణలో వేగాన్ని పెం చింది. గ్రామాలు మరింత అభివృద్ధి సాధించేందుకు  సీఎం కేసీఆర్‌ నిర్ణయం మేరకు జిల్లా కేంద్రలోని పద్మనాయక ఫంక్షన్‌హాల్‌లో పంచాయతీరాజ్‌ సమ్మేళనాన్ని నిర్వహించనున్నారు. 


పీఆర్‌ చట్టాలపై మరింత అవగాహన

ఈనెల 11న నిర్వహించిన కలెక్టర్లు, అడిషనల్‌ కలెక్టర్ల సమావేశంలో పల్లెప్రగతి కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగించాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు.  అందులో భాగంగా పటిష్టంగా నిర్వహించేందు పీఆర్‌ సమ్మేళనాలను ఏర్పాటు  చేయాలని  సూచించారు. జిల్లాలోని 255 గ్రామ పంచాయతీల్లో గతేడాది సెప్టెంబర్‌ మొదటివారంలో ప్రారంభమైన మొదటి విడత పల్లెప్రగతిని 30 రోజుల పాటు నిర్వహించారు. జనవరి2 నుంచి 12వరకు రెండో విడత పల్లె ప్రగతిని నిర్వహించారు. తెలంగాణ పంచాయతీరాజ్‌ చట్టం-2018పై ప్రజాప్రతినిధులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పిస్తారు.  ఈ సమ్మేళనంలో ప్రజాప్రతినిధుల విధులు బాధ్యతలను వివరిస్తారు. గ్రామాభివృద్ధికి చేపట్టాల్సిన ప్రణాళికలను వివరిస్తారు. ముఖ్యంగా పచ్చదనం పెంపు, వీధి దీపాల నిర్వహణ, ఉపాధి హామీ పనులపై అవగాహన కల్పించనున్నారు. వైకుంఠధామాలు, డంప్‌ యార్డ్‌లు, ఇంకుడు గుంతలు, నర్సరీల నిర్వహ ణకు చేపట్టాల్సిన పనులను వివరిస్తారు. ప్రజాప్రతినిధులు, అధికారులు కార్యక్రమ ఉద్ధేశ్యాన్ని ఈ సందర్భంగా తెలపనున్నారు.


సమ్మేళనం.. ప్రయోజనం 

 రెండు విడతలుగా నిర్వహించిన పల్లె  ప్రగతి కార్యక్రమంలో భాగంగా గుర్తించిన సమస్యల పరిష్కారానికి పంచాయతీరాజ్‌  సమ్మేళనం ఎంతో దోహదం చేయనుంది. ఈ సమ్మేళనంలో గ్రామాలను ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలో.. ఎవరి భాధ్యతలు ఏమిటో వివరించనున్నారు. ఈ సమ్మేళనం తర్వాత జిల్లా వ్యాప్తంగా పల్లె ప్రగతి కార్యక్రమాలను నిర్వహించి ఆకస్మికంగా తనఖీలు నిర్వహించేందుకు ఫ్లయింగ్‌ స్వాడ్‌లను సైతం అధికారులు ఎర్పాటు చేస్తున్నారు. ఈ స్వాడ్‌ బృందం ఏఏ గ్రామాలు అభివృద్ధి చెందుతున్నా యి? ఆ గ్రామ పరిస్థితుల్లో ఎలాంటి మార్పులు వచ్చాయని తనిఖీ చేసి ప్రభుత్వానికి నివేదికలను అందించనుంది.


logo