ఆదివారం 05 జూలై 2020
Rajanna-siricilla - Feb 20, 2020 , 01:17:21

అమరజవానుకు అంతిమ వీడ్కోలు

అమరజవానుకు అంతిమ వీడ్కోలు


ఇల్లంతకుంట: భారతావనికి భధ్రతగా ఉంటానని ఆర్మీ ఉద్యోగం సాధించి ప్రమాదవశాత్తు రైలు ప్రమాదంలో మృ తి చెందిన నంది అనిల్‌కు స్వగ్రామం మండలంలోని గాలిపెల్లిలో గ్రామస్తులు, నాయకులు, ఆర్మీ అధికారులు బుధవారం అంతిమ వీడ్కోలు పలికారు. చెల్లెలి పెళ్లిని ఘనంగా నిర్వహించాలనే తపనతో నెల రోజులు ముందుగానే సెలవు పెట్టి పట్టరాని సంతోషంతో ఇంటికి వస్తూ మృత్యు ఒడికి చేరుకున్న జవానుకు గ్రామమంతా అశ్రునయనాలతో అంతిమ వీడ్కోలు పలికింది. రామగుండం రైల్వే స్టేషన్‌ వద్ద మంగళవారం సాయంత్రం ప్రమాదవశాత్తు మృతి చెందిన జవాన్‌ అనిల్‌  భౌతిక కాయాన్ని స్వగ్రామానికి బుధవారం తరలించారు. అనిత్‌ మృతదేహంపై ఆర్మీ అధికారులు జాతీయ పతాకం కప్పి అంతిమ వీడ్కోలు పలికా రు. ‘చెల్లెలి పెండ్లి చూడకుండానే వెళ్లి పోతున్నావా బిడ్డా’ అని కుటుంబీకులు రోదించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. అనిల్‌ మృతదేహాన్ని రాష్ట్ర ఆహార భద్రత కమి టీ సభ్యుడు ఓరుగంటి ఆనంద్‌, జడ్పీ వైస్‌ చైర్మన్‌ సిద్దం వేణు, ఎస్‌ఐ ప్రవీణ్‌ కుమార్‌ సందర్శించి నివాళులు అ ర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనిల్‌ వి ద్యనభ్యసించిన పాఠశాల ఉపాధ్యాయులు సైతం తరలివ చ్చి నివాళులు అర్పించి ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఆర్మీ అధికారులు సుబేదార్‌ అజ్మద్‌ అలి, హవల్‌ దార్‌ సునిల్‌ కుమార్‌, సర్పంచ్‌ మల్లుగారి వాణి, ఎంపీటీసీ సింగిరెడ్డి శ్యామల దేవి, నాయకులు దేవెందర్‌రెడ్డి, సుధాకర్‌ రెడ్డి, చంద్రారెడ్డి, మాధవరెడ్డి, రాజేశం, శ్రీనివాస్‌, మ ల్లేశంతోపాటు గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


logo