ఆదివారం 12 జూలై 2020
Rajanna-siricilla - Feb 19, 2020 , 02:31:12

నీటిని పొదుపుగా వాడుకోవాలి

నీటిని పొదుపుగా వాడుకోవాలి

ముస్తాబాద్‌: రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకుని నీటిని పొదుపుగా వాడుకోవాలని మిషన్‌ భగీరథ ఈఈ జానకి సూచించారు. మండల పరిషత్‌ కార్యాలయంలో ప్రజాప్రతినిధులు, పంచాయతీ సిబ్బంది, పంపు ఆపరేటర్లతో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. అన్ని గ్రామాల్లో మిషన్‌ భగీరథ పైపులైన్‌ పనులు దాదాపు పూర్తయి నట్లు చెప్పారు. అందరికీ మిషన్‌ భగీరథ నీరు అందేలా చూడాలని తెలిపారు. ఒకేవిధంగా నీరు వచ్చేవిధంగా నల్లాలు, పైపులైన్‌ బిగించాలని సిబ్బందికి అవగాహన కల్పించారు. నల్లాలు బిగించకపోతే నీరు వృథాగా పోతుందన్నారు. ఎవరైనా బిగించిన నల్లాలు తొలగించినా, పైపులైన్‌ ధ్వంసం చేసినా 5వేల వరకు జరిమానా విధిస్తామని తెలిపారు. మిషన్‌ భగీరథ పైపులైన్‌తోపాటు గతంలో ఉన్నపాత లైన్‌కు కూడా నల్లాలు బిగించాలని కోరారు.  ఈ కార్యక్రమంలో ఆర్‌ఎస్‌ఎస్‌ మండల కన్వీనర్‌ కల్వకుంట్ల గోపాల్‌రావు, ఇన్‌చార్జి ఎంపీడీవో మధుసుదన్‌, మండల డీఈ సుమలత, ఏఈ సుకన్య, సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ప్రణాళికలు రూపొందించాలి

మండలంలో నీటి ఆధారిత ప్రాంతాలను గుర్తించి నీటి నిల్వలను పెంచేవిధంగా ప్రణాళికలు రూపొందించాలని ఇన్‌చార్జి ఎంపీడీవో మధుసూదన్‌ సూచించారు. మండల పరిషత్‌లో ప్రజాప్రతినిధులు, ఉపాధిహామీ సిబ్బందితో నిర్వహించిన  అవగాహన సదస్సుకు హాజరై, మాట్లాడారు. మండలంలో మానేరు వాగు, నక్కవాగు పరివాహర ప్రాంతాల్లో ఉన్న గ్రామాల్లో నీరు నిల్వలకు గాను ఉపాధి హామీ పథకంలో చేపట్టాల్సిన పనుపై అవగాహన కల్పించారు. వాగులపై చెక్‌డ్యాంలు, నీటిగుంతల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించాలన్నారు. హరతహారం లో వాగులు, ఒర్రెలు ఉన్న ప్రాంతంలో మొక్కలు అధికంగా పెంచడానికి ప్రణాళికలు తయారు చేయాలని కోరారు.  కార్యక్ర మంలో ఆర్‌ఎస్‌ఎస్‌ మండల కన్వీనర్‌ కల్వకుంట్ల గోపాల్‌రావు, ఈజీఎస్‌ ఏపీఎం మల్లయ్య, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.


logo