మంగళవారం 07 జూలై 2020
Rajanna-siricilla - Feb 17, 2020 , 01:53:29

మొక్కలు నాటుదాం..కానుక ఇద్దాం..

మొక్కలు నాటుదాం..కానుక ఇద్దాం..(సిరిసిల్ల, నమస్తే తెలంగాణ)ఎన్నో ఏండ్ల పోరాటాల తర్వాత సాధించుకున్న తెలంగాణను అనేక రంగాల్లో దేశంలోనే మొదటి స్థానంలో నిలిపిన సీఎం కేసీఆర్‌ పలు వినూత్న పథకాలను విజయవంతంగా అమలు చేస్తూ తన సామాజిక బాధ్యతను చాటుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రం లో అడవుల విస్తీర్ణం తగ్గిపోయి, ప్రకృతి విధ్వంసం పెరిగిన తర్వాత వన్యప్రాణులు జనారణ్యంలోకి రావడం ప్రారంభించాయి. ముఖ్యంగా కోతులు నివా స ప్రాంతాల్లో చొరబడి జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. అడవుల్లో వాటికి ఆహారాన్ని అందించే చె ట్లను నరకడంవల్ల కోతులు జనజీవనంలోకి వస్తున్నాయనే యధార్ధాన్ని గ్రహించిన సీఎం కేసీఆర్‌ అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారు. విరివిగా మొక్కలు నాటి తగ్గిన పచ్చదనాన్ని పెంచడం, భవిష్య త్‌ తరాలకు రాష్ట్రంలో మంచి బతుకును ఇవ్వడమే ల క్ష్యంగా ప్రారంభించిన ఈ కార్యక్రమం ఇపుడు విజయవంతంగా కొనసాగుతున్నంది. 


మొక్కల పెంచడం కోసం చట్టం.. 

ఎన్నో ఉద్దేశాలతో నాటుతున్న మొక్కలను సంరక్షించడంలో బాధ్యత లేక పోవడంతో అనేక మొక్కలు ఎండి పోవడం సహజంగా మారింది. ఈ నేపథ్యంలో మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యతలను చట్టం రూపంలో తెచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌దే. పంచాయతీ రాజ్‌ చట్టంతో నర్సరీల పెంపకం బాధ్యతలను పంచాయతీలకు అప్పగించారు. నాటిన మొక్కల్లో 85 శాతం బతికించని పక్షంలో సంబంధిత పంచాయతీలపై కఠిన చర్యలు తీసుకునేలా పంచాయతీ రాజ్‌ చట్టం-2018లో రూపొందించారు. ఈ చట్టంతో ప్రజ ల్లో అవగాహన పెరిగింది. నాటిన మొక్కలను సంరక్షించాలనే బాధ్యతను ఈ చట్టం తప్పనిసరి చేసింది. ఇపుడు గ్రామాల్లో హరిత హారం మొక్కలంటే ప్రత్యేకంగా చూడబడుతున్నాయి. మొక్కేకదాని పీకేస్తే తర్వా త జరిగే పరిణామాలు ప్రజలందరికీ తెలిసి పోయా యి. హరిత హారంలో నాటిన మొక్కలను పీకేసినా, పశువులచే మేపినా పంచాయతీలు పెద్ద మొత్తంలో జరిమానాలు వసూలు చేస్తున్నాయి. 


అంతే కాకుం డా ప్రతి పంచాయతీ పరిధిలో నర్సరీలు ఏర్పాటు చేసి మొక్కలు పెంచుకొని వాటిని అదే గ్రామాల్లో నాటుకుని సంరక్షించించుకునే విధంగా సీఎం కేసీఆర్‌ చర్యలు తీసుకున్నారు. గతంలో మొక్కలు కావాలంటే ఎక్కడికి వెళ్లి తెచ్చుకోవాలో తెలియని పరిస్థితి నుంచి ఇపుడు ప్రతి గ్రామంలో మొక్కలు లభించే పరిస్థితిని సీఎం కేసీఆర్‌ తెచ్చారని చెప్పవచ్చు. దీంతో గ్రామాల్లో ఇపుడు ఏ కాలంలోనైనా మొక్కలు నాటుకుని సంరక్షించుకోవాలనే సామాజిక బాధ్యత ప్రజకు క్రమంగా అలవడుతోంది. పూలు, పండ్ల మొక్కలే కాదు నీడ నిచ్చేవి, భవిష్యత్తులో ఆదాయాన్ని సమకూర్చే మొక్కలు కూడా ఇపుడు గ్రామాల నర్సరీల్లో అందుబాటులో ఉంటున్నాయి.. 


పుట్టిన రోజు కానుకగా మొక్కలు.. 

పర్యావరణ ప్రేమికుడుగా, తెలంగాణను ఆకుపచ్చ లోగిలా మార్చాలని కలలుకంటున్న సీఎం కేసీఆర్‌ 66వ పుట్టిన రోజు సందర్భంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని ఇటు ప్రభుత్వ యంత్రాంగం, అటు అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులు నిర్ణయించుకోవడం హ ర్షణీయం. సోమవారం ఆయన పుట్టిన రోజున ఒక్కో కార్యకర్త ఒక్కో మొక్కను నాటాలని టీఆర్‌ఎస్‌ వర్కిం గ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీ రామారావు పిలుపు నిచ్చా రు. దీంతో ఆ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున మొక్కలు నాటేందుకు సిద్ధపడుతున్నారు. ఎక్కడి వారు అక్కడ మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యతను తీసుకోవాలని కేటీఆర్‌ ఇచ్చిన పిలుపు కార్యకర్తలను పెద్ద ఎత్తున కదిలించే పరిస్థితి కనిపిస్తోంది. ఇక ప్రభుత్వ ప రంగా కూడా కేసీఆర్‌ పుట్టిన రోజు మొక్కలు నాటే కా ర్యక్రమాలను నిర్వహిస్తోంది. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పక్షాన సీఎం కేసీఆర్‌ పుట్టిన రోజున ఇంటికో మొక్క నినాదం ఇచ్చింది. జిల్లాలో ఆరు లక్షల మొక్క లు నాటాలని లక్ష్యంగా నిర్ణయించుకుంది. ఈ మేరకు అన్ని మండలాల ఎంపీడీఓలకు ఆదేశాలు జారీ చేసినట్లు డీఆర్‌డీఓ కౌటిల్యరెడ్డి తెలిపారు. ప్రతి మహిళా సంఘాలకు మొక్కలు నాటే బాధ్యతలను అప్పగించారు. ఇటు ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు, స్వచ్ఛం ద సంస్థలు, ప్రజా సంఘాలు కూడా పెద్ద ఎత్తున మొ క్కలు నాటేందుకు ఉత్సాహం చూపుతున్నారు. తమ ప్రియతమ నేత పుట్టిన రోజున నాటిన మొక్కలను కానుకగా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.. 


సీఎం కల సాకారం దిశగా..

జిల్లాలోని 12 మండలాల్లో  255 గ్రామపంచాయతీలలో 4.65 లక్షల మొక్కలు నాటేందుకు మున్సిపల్‌, ఐటీ శాఖ మంత్రి కేటిఆర్‌ ఆదేశాల మేరకు  ప్రణాళికలను అధికారులు రూపొందించారు. వీటితో పాటు వివిధ విభాగాల్లో 1,35,000 నాటేలా సన్నాహాలు చేస్తున్నారు. సిరిసిల్ల నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో మండలానికి 50వేల చొప్పున  నియోజకవర్గంలో 2.50లక్షల మొక్కలు, వేములవాడ నియోజకవర్గంలో కోనరావుపేటలో 50 వేలు, చందుర్తి మండలంలో 30 వేలు, రుద్రంగి, వేములవాడ రూరల్‌లో మండలానికి 15 వేలు, వేములవాడ అర్బన్‌లో 20 వేల మొక్కలతో వేములవాడ నియోజకవర్గంలో 1.30 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.బోయినపల్లి మండలంలో 35వేలు, ఇల్లంతకుంట మండలంలో 50 వేల మొక్కలను సీఎం కేసీఆర్‌ జన్మదినోత్సవాన నాటనున్నారు. జిల్లాలోని అన్ని గ్రామపంచాయితీ పరిధిలోని  పాఠశాలలతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ  గురుకుల పాఠశాలల్లో కూడా మొక్కలు నాటనున్నారు. సోమవారం అన్ని గ్రామపంచాయతీల్లో, దేవాలయాలు, మసీద్‌, చర్చిల ఆవరణలో కూడా మొక్కలు నాటేందుకు సిద్ధం అవుతున్నా రు. జిల్లాలో  జనాభా ప్రాతిపదికన మొక్కలను నాటేందుకు జిల్లా పంచాయ తీ అధికారులు ఆదేశించారు.


వివిధ శాఖల్లోనూ..

జిల్లాలో వివిధ శాఖలలో మొక్కలు నాటేందుకు అధికారులు లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. సిరిసిల్ల మున్సిపాలిటి పరిధిలోని  35వేలు, వేములవాడ మున్సిపాలిటి పరిధిలో 25 వేలు, వ్యవసాయ, మరియు ఉద్యానశాఖ అధికారులు 25 వేలు, అటవీ శాఖ అధికారులు 50వేలు మొక్కలను నాటనున్నారు.


logo