సోమవారం 06 జూలై 2020
Rajanna-siricilla - Feb 17, 2020 , 01:44:27

గోదారమ్మ పరుగులు

గోదారమ్మ పరుగులు

(పెద్దపల్లి ప్రతినిధి, నమస్తే తెలంగాణ/ ధర్మారం/ బోయినపల్లి :కాళేశ్వరం లింక్‌-1లో గోదారి జలాల ఎత్తిపోతలు మొదలయ్యాయి. భూపాలపల్లి జిల్లాలో పంపులు నడుస్తుండగా, ఇక్కడ పెద్దపల్లి జిల్లా మంథని మం డలం కాసిపేటలోని సరస్వతి (అన్నారం) పంప్‌హౌస్‌లో ఆదివారం అధికారులు 4వ మోటర్‌ను ఆన్‌ చే సి, పార్వతి (సుందిళ్ల)బరాజ్‌లోకి నీటిని ఎత్తిపోస్తున్నారు. అలాగే లింక్‌-2లో భాగంగా ఆరో ప్యాకేజీలో భాగంగా ధర్మారం మండలం నందిమేడారంలోని నంది పంప్‌హౌస్‌లో శనివారం రాత్రి నడిచిన 2, 3, 5, 6 మోటర్లనే ఆదివారం రాత్రి సైతం నడిపించారు. 


వీటి ద్వారా 12,600 క్యూసెక్కుల నీటిని కాళేశ్వరం ఏడో ప్యాకేజీలోని నంది రిజర్వాయర్‌లోకి తరలిస్తున్నారు. ఇక్కడి నుంచి జలాలు ఎనిమిదో ప్యాకేజీ రామడుగు మండలం లక్ష్మీపూర్‌లోని గాయత్రి పంపుహౌస్‌ సర్జ్‌పూల్‌కు చేరుతున్నాయి. ఇక్కడ ప్రస్తుతం 3, 4 ,7 మోటార్లను అధికారులు నడిపిస్తున్నారు. ఒ క్కో పంపు 3,150 క్యూసెక్కుల నీటిని విడుదల చే స్తుండగా రోజుకు 9,450 క్యూసెక్కుల జలాలు ఎస్సారార్‌కు వెళుతున్నాయి. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు ప్రాజెక్టు ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు సూచనలతో జలాలను ఎత్తిపోస్తున్నారు. ఇక్కడ ఈఈ నూనె శ్రీధర్‌, ఏ ఈఈలు వెంకటేష్‌, సురేశ్‌, శ్రీనివాస్‌, రమేశ్‌నాయక్‌, మెగా ప్రతినిధులు రామకృష్ణ, అవినాష్‌ ఉన్నారు.


ఎస్సారార్‌ నుంచి నాలుగు గేట్ల ద్వారా.. 

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం శ్రీ రాజరాజేశ్వర జలాశయం నాలుగు గేట్లు అధికారులు ఎత్తారు. నాలుగు రివర్స్‌ స్లూయిస్‌ గేట్లతోపాటు ఎత్తిన నాలుగు గేట్ల ద్వారా నీటిని దిగువకు వదులుతున్నా రు. రాత్రి 9 గంటలకు 1598 క్యూసెక్కుల నీటిని దిగువమానేరు జలాశయానికి వదిలినట్లు ఈఈ అశోక్‌ కుమార్‌ తెలిపారు. ఎస్‌ఆర్‌ఆర్‌ జలాశయంలో ప్రస్తుతం 25.092టీఎంసీల నీరు నిలువ ఉన్నది. 


ఎల్‌ఎండీకి ఇన్‌ఫ్లో

ఎస్సారార్‌ రిజర్వాయర్‌ నుంచి రిజర్వాయర్‌లోకి 9,296 క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లో రూపంగా వస్తున్నది. 5,754  క్యూసెక్కుల నీరు ఔట్‌ఫ్లో రూపంలో వెళ్తున్నట్లు ఎస్సారెస్పీ అధికారులు తెలిపారు. ఎల్‌ఎండీలో ప్రస్తుతం 8.481టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు చెప్పారు.logo