ఆదివారం 05 జూలై 2020
Rajanna-siricilla - Feb 16, 2020 , 02:35:31

టీఆర్‌ఎస్‌కి సహకారం

టీఆర్‌ఎస్‌కి సహకారం

రాజన్న సిరిసిల్ల ప్రతినిధి, నమస్తే తెలంగాణ: సహకార సంఘాల ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. జిల్లాలో మొత్తం 24 సంఘాలు ఉండగా, బోయినపల్లి, నర్సింగాపూర్‌, మానాల సంఘా లు పూర్తి ఏకగ్రీవమయ్యాయి. 165 డైరెక్టర్‌ స్థానాలు ఏకగ్రీవం పోను మిగిలిన 144 స్థానాలకు శనివారం అధికారులు ఎన్నికలు నిర్వహించారు. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఎన్నికలు, 2 గంటల నుంచి కౌంటింగ్‌ నిర్వహించారు. జిలాల్లో మొత్తం 79.45 శాతం పోలింగ్‌ నమోదైంది. మొత్తం ఓటర్లు 19,164 మంది ఉండ గా, 15,226 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇందులో 11,446 మంది పురుషులు, 3,780 మంది మహిళలు ఉన్నారు. 


79.45 శాతం నమోదు..

జిల్లా వ్యాప్తంగా 79.45శాతం పోలింగ్‌ శాతం నమోదైంది. కాగా, సిరిసిల్లలో 70.78 శాతం, పెద్దూరు సంఘంలో 91, నేరెళ్లలో 70.99, కోనరావుపేటలో 85.40, కొలనూరులో 88.91, వేములవాడ 65.72, నాంపల్లి 84.39, రుద్రవరం 94.81, చందుర్తిలో 68.88, సనుగులలో 85.21, మానువాడలో 91.30, కోరెంలో 73.21 నమోదు అయ్యింది. ఇల్లంతకుంటలో 83.84 శాతం, గాలిపల్లిలో 89.21, ముస్తాబాద్‌లో 85.91, పోతుగల్‌లో 92.32, గంభీరావుపేటలో 70.20, కొత్తపల్లిలో 81.38, ఎల్లారెడ్డిపేటలో 84.52, అల్మాస్‌పూర్‌లో 86.27, తిమ్మాపూర్‌లో 89.19 శాతం నమోదయ్యింది. సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు వివిధ మండలాల పోలింగ్‌ స్టేషన్ల నుంచి సిబ్బంది బ్యాలెట్‌ బాక్సులతో పోలీస్‌బందోబస్తు మధ్య ప్రత్యేక వాహనాల్లో తిరిగి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానంలో గల పంపిణీ కేంద్రానికి చేరుకున్నారు. పోలింగ్‌ ప్రశాంతంగా ముగియడంతో కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌, ఎస్పీ రాహుల్‌హెగ్డేలు ప్రజలకు, ఓటర్లకు, ఎన్నికల సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. 


టీఆర్‌ఎస్‌ హవా..

పార్లమెంట్‌ మొదలుకొని, అసెంబ్లీ, పంచాయతీ, సహకార సంఘాల ఎన్నికలు ఏవైనా టీఆర్‌ఎస్‌ పార్టీ హవా కొనసాగిస్తున్నది. నిన్న మున్సిపల్‌ ఎన్నికలు, నేడు సహకార సంఘాలపైనా గులాబీ జెండా ఎగురవేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సంక్షేమ పథకాలు, మంత్రి కేటీఆర్‌ అభివృద్ధి మంత్రంతో ప్రజలు టీఆర్‌ఎస్‌ పార్టీకి వరుసగా పట్టం కడుతున్నారు. జిల్లాలో మొత్తం 24 సంఘాలు ఉండగా, అందులో 23 సంఘాలు టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంది. పెద్దూరు సహకార సంఘం మాత్రం 6 స్థానాలు బీజేపీ, టీఆర్‌ఎస్‌ 6 స్థానాలు గెలుచుకోగా, ఒక స్వతంత్ర అభ్యర్థి గెలిచాడు. కాగా ఎన్నికలకు ముందే బోయినపల్లి, నర్సింగాపూర్‌, మానాల ప్రాథమిక సహకార సంఘాలను పూర్తి స్థాయిలో టీఆర్‌ఎస్‌ ఏకగ్రీవం చేసుకుంది. శనివారం నిర్వహించిన పోలింగ్‌లోనూ 8 సంఘాలలో గులాబీ క్లీన్‌ స్వీప్‌ చేసింది. ఇందులో సిరిసిల్ల 13, నేరెళ్ల 13, గంభీరావుపేట 13, అల్మాస్‌పూర్‌ 13, తిమ్మాపూర్‌ 13, పోతుగల్‌ 13, ఇల్లంతకుంట 13, బోయినపల్లి 12, నర్సింగాపూర్‌ 13, సంఘాలలో మొత్తం స్థానాలు టీఆర్‌ఎస్‌ గెలుచుకుంది. ఇక మిగిలిన సంఘాలలోనూ టీఆర్‌ఎస్‌ అభ్యర్థులే మెజార్టీ స్థానాలు గెలుచుకున్నారు. మొత్తం 309 డైరెక్టర్‌ స్థానాల్లో టీఆర్‌ఎస్‌ 265 కాగా, బీజేపీ 12, కాంగ్రెస్‌ 21 స్థానాలకే పరిమితమైపోయాయి. ఇక ఇండిపెండెంట్లు 11 స్థానాల్లో గెలిచారు. వారు కూడ టీఆర్‌ఎస్‌ వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.


logo