శనివారం 11 జూలై 2020
Rajanna-siricilla - Feb 16, 2020 , 02:32:19

పట్టుచీరెపై కేసీఆర్‌ చిత్రం

పట్టుచీరెపై కేసీఆర్‌ చిత్రం

సిరిసిల్ల రూరల్‌: సీఎం కేసీఆర్‌ జనదినోత్సవాన్ని సిరిసిల్ల నేతకార్మికుడు కుసుమ నర్సింహస్వామి మరోసారి తన అభిమానం చాటుకున్నాడు. ఇటీవలే తన ఖర్ఖానాలోని ఎలక్ట్రానిక్‌ జకార్డ్‌ మరమగ్గంపై కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ చిత్రాలతో పాటు, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్‌భగీరథ పథకాల చిత్రాలను ఆవిష్కరించి అబ్బురపరిచిన సంగతి తెలిసిందే. తాజాగా ఎలక్ట్రానిక్‌ జకార్డ్‌ ప్రతినిధి వెంకట్రావు సౌజన్యంతో మూడు రోజుల్లోనే పట్టుచీరెపై హరితహారం కొటేషన్లతో పాటు, సీఎం కేసీఆర్‌ ముఖచిత్రాన్ని తీర్చిదిద్ది మరోసారి ఔరా అనిపించాడు. చీరపై ‘మానవ మనగడకు మొక్కలు ప్రాణం పోసేది పచ్చని చెట్లు’ అని తీర్చిదిద్దడమే గాక, సీఎం కేసీఆర్‌ పుట్టిన రోజున మొక్కలునాటాలంటూ క్యాప్షన్‌ను సైతం జోడించడం విశేషం. నేతకార్మికుడు నర్సింహస్వామి తీర్చిదిద్దిన ఈ పట్టుచీరెను సిరిసిల్ల మున్సిపల్‌ అధ్యక్షురాలు జిందం కళ -చక్రపాణి దంపతులు వారి స్వగృహంలో లాంఛనంగా ఆవిష్కరించారు. నేతకార్మికుడు నర్సింహస్వామి, ఉదయరవి క్రియోషన్స్‌ ప్రతినిధి వెంకట్రావును అభినందించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ మంచె శ్రీనివాస్‌, కౌన్సిలర్‌ రాపెల్లి దినేశ్‌, అడ్డగట్ల మురళి, శ్వర్‌, అశోక్‌, శ్రీనివాస్‌,మ్యానరవి తదితరులు పాల్గొన్నారు.


logo