గురువారం 02 జూలై 2020
Rajanna-siricilla - Feb 16, 2020 , 02:30:44

శివార్చనకు రండి

శివార్చనకు రండి
  • మంత్రి ఈటల, ఎమ్మెల్యే రమేశ్‌బాబుకు జాతర ఆహ్వానం
  • పత్రికలు అందజేసిన వేములవాడ ఆలయ ఈవో కృష్ణవేణి

వేములవాడ, నమస్తేతెలంగాణ: వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామివారి క్షేత్రంలో నిర్వహించనున్న మహాశివరాత్రి వేడుకలకు మంత్రి, ఎమ్మెల్యేలను ఈవో కృష్ణవేణి ఆహ్వానించారు. శివార్చన పత్రికలను అందజేశారు. హైదరాబాద్‌లో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌, ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదార రమణాచారి, దేవాదాయశాఖ కమిషనర్‌ అనిల్‌కుమార్‌ను శనివారం కలిశారు. ఆహ్వానం పత్రికలను, స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. 21న జరగనున్న మహాశివరాత్రి వేడుకలకు ఆహ్వానం పలికారు. మహాశివరాత్రి జాతరను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నందున ఈ వేడుకలకు హాజరై స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆమె కోరారు. ఈవో వెంట పర్యవేక్షకులు శ్రీరాములు, ఆలయ ప్ర ధాన ఆర్చకులు శరత్‌, గోపన్నగారి చందు, తదితరులున్నారు. logo