శుక్రవారం 10 జూలై 2020
Rajanna-siricilla - Feb 15, 2020 , 00:43:07

జాతరకు రండి..

జాతరకు రండి..

వేములవాడ కల్చరల్‌ : వేములవాడ రాజన్న ఆలయంలో మూడు రోజులపాటు ఘనంగా నిర్వహించనున్న మహాశివరాత్రి జాతరకు త రలిరావాలని దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డిని శుక్రవారం ఆలయ ఈవో కృష్ణవేణి ఆహ్వానించారు. నిర్మల్‌లోని మంత్రి స్వగృహానికి వెళ్లి ఆహ్వానించారు. ఈనెల 21 నుంచి 23 వరకు జాతర ఘనంగా జరుగుతుందని, వేములవాడ రాజన్నను దర్శించుకు ని తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరారు. మ హా శివరాత్రి ఆహ్వానపత్రికతో పాటు స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. ఈవో కృష్ణవే ణి వెంట ఆలయ పర్యవేక్షకులు నాగుల మహే శ్‌, ఎడ్ల శివ, అర్చకులు మామిడిపెల్లి శరత్‌, గోపన్నగారి చందు, తదితరులు ఉన్నారు. 


logo