బుధవారం 08 జూలై 2020
Rajanna-siricilla - Feb 15, 2020 , 00:41:25

సెస్‌లోకి యువ ఇంజినీర్లు

సెస్‌లోకి యువ ఇంజినీర్లు

సిరిసిల్ల టౌన్‌: సిబ్బంది కొరతతో సతమతమవుతున్న సెస్‌లోకి యువ ఇంజినీర్లు వచ్చి చేరా రు. దేశంలోనే అగ్రగామిగా నిలిచిన సహకార వి ద్యుత్‌ సరఫరా సంస్థ(సిరిసిల్ల)లో 13 ఏఈ పో స్టులు భర్తీ ప్రక్రియ ప్రారంభించారు. సంస్థాగత సేవలు వినియోగదారులకు సత్వరమే అందించాలన్న ఆశయంతో నియామకాలను పూర్తి చేశారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా కేంద్రంలోని సెస్‌ కార్యాలయంలో ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థుల విద్యార్హత, తదితర సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ ప్రక్రియను అధికారులు నిర్వహించారు. ఉద్యోగానికి అర్హత సాధించిన అభ్యర్థులను సెస్‌ చైర్మన్‌ దోర్నా ల లక్ష్మారెడ్డి ఈ సందర్భంగా అభినందించారు. ఈ సందర్భంగా మెరిట్‌ ఆధారితంగా చేపట్టిన ని యామకాలపై ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

నియామక ప్రక్రియ ఇలా..

సిరిసిల్ల సహకార విద్యుత్‌ సరఫరా సంస్థలో ఏఈ ఉద్యోగాల భర్తీ కోసం గత అక్టోబర్‌ 25న ఉస్మానియా యూనివర్సిటీ ద్వారా నోటిఫికేషన్‌ విడుదల చేశారు. కాగా 13ఏఈ పోస్టులకు గా నూ జోనల్‌ పరిధిలోని 1365 మంది ఆన్‌లైన్‌లో రిజిస్టర్‌ చేసుకోగా, ఈ నెల 2న హైదరాబాద్‌ ఓయూ క్యాంపస్‌లో పరీక్షను నిర్వహించారు. ఆ ఫలితాలను ఓయూ ఆన్‌లైన్‌లో ఈ నెల 12న వి డుదల చేసింది. అనంతరం మెరిట్‌ సాధించిన వారిలో 13మందిని ఉద్యోగానికి ఎంపిక చేసిన ట్లు సెస్‌ ఏఏవో రాజేందర్‌ తెలిపారు. కాగా సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ ప్రక్రియకు ఏడుగురు అభ్యర్థులు హాజరయ్యారు. కాగా వారందరి సర్టిఫికెట్ల ఆధారంగా ఉద్యోగ ఎంపికకు అర్హులుగా ప్రకటించి నియామక ఉత్తర్వులు అందించినట్లు ఈ సందర్భంగా ఆయన తెలిపారు.


logo