శుక్రవారం 03 జూలై 2020
Rajanna-siricilla - Feb 15, 2020 , 00:39:11

అమర జవాన్లకు ఘన నివాళి

అమర జవాన్లకు ఘన నివాళి

సిరిసిల్ల టౌన్‌: జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో గతేడాది ఉగ్రవాదుల దాడిలో అమరులై న జవాన్లకు జిల్లా వ్యాప్తంగా శుక్రవారం ఘన నివాళులర్పించారు. సిరిసిల్ల పట్టణంలోని మహర్షి ఇంగ్లిష్‌ మీడియం ఉన్నత పాఠశాలలో విద్యార్థులతో కలిసి మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ మంచె శ్రీనివాస్‌ అమరవీరుల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీచౌక్‌లో బీజేపీ నేత లు నివాళులర్పించారు. లింగంపల్లి శంకర్‌, ఠాకూ ర్‌ రాజాసింగ్‌, మ్యాకల కమలాకర్‌, బొల్గం నాగరాజు, గూడూరి భాస్కర్‌ పాల్గొన్నారు.

గంభీరావుపేట/ ఇల్లంతకుంట/ ఎల్లారెడ్డిపేట/ వీర్నపల్లి: గంభీరావుపేటలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు కళాశాల నుంచి తెలంగాణ అమరవీరుల స్థూపం వరకు ఫ్లకార్డులతో శాంతి ర్యాలీ చేపట్టారు. రెండు నిమిషాలు మౌనం పాటించి, నివాళులర్పించారు. ఇక్కడ కళాశాల ప్రిన్సిపాల్‌ నర్సయ్య, ఉప సర్పంచ్‌ నాగరాజుగౌడ్‌, నేతలు గడ్డమీది ప్రసాద్‌రెడ్డి, రాగిశెట్టి నారాయణ, విజేందర్‌రెడ్డి పాల్గొన్నారు. వీర్నపల్లిలోని కేజీబీవీ పాఠ శాల విద్యార్థినులు అమరజవాన్ల చిత్రపటా నికి పూలమాల వేసి నివాళులర్పించారు. అమరుల త్యాగాలు వృథా కావనీ, భారతజాతి వారి సేవల ను స్మరించుకుంటుందని ఎస్‌వో నీలిమా తెలిపా రు. ఇల్లంతకుంట మండలంలోని అన్ని విద్యా సంస్థల్లో జవాన్లకు విద్యార్థులు నివాళులర్పిం చారు. కోఆప్షన్‌ సభ్యుడు శ్రీనివాస్‌ యాదవ్‌ రేపాక ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల కు పరీక్ష ప్యాడ్లు, బుక్కులు, పెన్నులు అందజేశారు. హెచ్‌ ఎం వీరారెడ్డి, ఉపాధ్యాయులు రవి, శ్రీనివాస్‌, రామేశ్వర్‌రెడ్డి, రాజశేఖర్‌, రాజమల్లు, వార్డు సభ్యుడు సాగర్‌ ఉన్నారు. అలాగే ఎల్లారెడ్డిపేట లో ఎస్‌ఐ వెంకటకృష్ణ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ తీసి అమర జవాన్లకు నివాళులర్పించారు. ఎల్లారెడ్డిపేట పోలీస్‌స్టేషన్‌ ఆవరణ నుంచి కొత్త బస్టాండ్‌ వరకు పోలీసులు, యువకులు ర్యాలీ తీశారు. గుండారం ప్రాథమిక పాఠశాల, మండల కేంద్రంలో చేయూత మిత్ర ఫౌండేషన్‌ ఆధ్వర్యం లో అమర జవాన్లకు నివాళులర్పించారు.


logo