గురువారం 09 జూలై 2020
Rajanna-siricilla - Feb 15, 2020 , 00:38:30

సీఎం కేసీఆర్‌కు హరిత కానుక అందిద్దాం

సీఎం కేసీఆర్‌కు హరిత కానుక అందిద్దాం

గంభీరావుపేట: మండలంలో సమష్టిగా 50వేల మొక్కలు నాటి స్వరాష్ట్ర ప్రదాత ముఖ్యమంత్రి కేసీఆర్‌కు జన్మదినాన హరిత కానుక అందిద్దామని ఎంపీపీ వంగ కరుణ పిలుపునిచ్చారు. మండల పరిషత్‌లో గ్రామాల వారీగా హరితహారంపై నిర్వహించిన సమావేశానికి ఎంపీపీ శుక్రవారం హాజరై, మాట్లాడారు. పర్యావరణ పరిరక్షణతో ప్రతిఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని సీఎం కేసీఆర్‌ హరితహారం ప్రారంభించారని పేర్కొన్నారు. ఈ నెల 17న ముఖ్యమంత్రి జన్మదినాన్ని పురస్కరించుకుని వృథా ఖర్చులు చేయకుండా మంత్రి కేటీఆర్‌ పిలుపు మేరకు గ్రామాల్లో మొక్కలు నాటుకుందామని కోరారు. గ్రామా ల వారీగా గుర్తించిన స్థలాల్లో 50వేల మొక్కలు నాటుదామనీ, ఈ కార్యక్రమంలో అందరూ భాగస్వాములవ్వాలని పిలుపునిచ్చారు. పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్‌ అసిస్టెంట్లు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటే లక్ష్యంమేరకు మొక్కలు నాటి, కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్‌, ఈజీఎస్‌ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు, ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. 

క్రీడలతో మానసికోల్లాసం

క్రీడలతో మానసికోల్లాసం ఉంటుందని ఎంపీపీ వంగ కరుణ అన్నారు. మల్లారెడ్డిపేట గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో నిర్వహించిన వివిధ క్రీడాపోటీల బహుమతుల ప్రదానోత్సవానికి ఎంపీపీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వారంరోజుల నుంచి వాలీబాల్‌, క్రికెట్‌, కబడ్డీ పోటీలు నిర్వహించగా, సర్పంచ్‌తో విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ, విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలని కోరారు. గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ, విద్యార్థులు అన్నిరంగాల్లో ముందుకుసాగాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ శెట్టి మహేశ్వరి, ఉప సర్పంచ్‌ ఆంజనేయులు, ఎంపీటీసీ కమటం రాజేందర్‌, నేతలు వంగ సురేందర్‌రెడ్డి, శెట్టి రవి, భూంపల్లి హన్మాండ్లు, మహేందర్‌రెడ్డి, వార్డు సభ్యులు, క్రీడాకారులు పాల్గొన్నారు. 


logo