గురువారం 09 జూలై 2020
Rajanna-siricilla - Feb 14, 2020 , 03:43:11

అపర భగీరథుడికి ఆత్మీయ పలుకరింపు

అపర భగీరథుడికి ఆత్మీయ పలుకరింపు
  • హెలిప్యాడ్‌ నుంచి కలెక్టరేట్‌లోకి వస్తున్న సీఎం కేసీఆర్‌, మంత్రులు, ఈటల రాజేందర్‌, కొప్పుల ఈశ్వర్‌

కరీంనగర్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు వచ్చిన అపర భగీరథుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావును పలువురు ప్రముఖులు గురువారం ఆత్మీయంగా పలుకరించారు. బుధవారం రాత్రి నగరానికి చేరుకున్న సీఎం కేసీఆర్‌ తీగలగుట్టపల్లిలోని కేసీఆర్‌ భవన్‌లో బస చేశారు. గురువారం ఉదయం ముఖ్యమంత్రి వెంట మంత్రులు గంగుల కమలాకర్‌, ఈటల రాజేందర్‌, రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోశ్‌కుమార్‌, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌, నగర మేయర్‌ సునీల్‌రావు ఉండగా, ఎంఎఫ్‌సీ చైర్మన్‌ అక్బర్‌హుస్సేన్‌ సీఎంకు దట్టీ కట్టారు. డిప్యూటీ మేయర్‌ చల్ల స్వరూపరాణి, కార్పొరేటర్లు, పలువురు ప్రజాప్రతినిధులు, టీఆర్‌ఎస్‌ నాయకులు, ప్రముఖులు ముఖ్యమంత్రికి మొక్కలు అందించారు. సాయంత్రం కాళేశ్వరం నుంచి వచ్చిన సీఎం కేసీఆర్‌కు కలెక్టరేట్‌ హెలీప్యాడ్‌ వద్ద కలెక్టర్‌ శశాంక, రాజన్న సిరిసిల్ల కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. అక్కడి నుంచి సమీక్ష సమావేశం కోసం వెళ్తున్న క్రమంలో దారిలో పలువురు ఇచ్చిన వినతిపత్రాలను ముఖ్యమంత్రి స్వీకరించారు. ఈ సందర్భంగా అక్కడ ఓ చిన్నారిని ఎత్తుకున్నారు. తనను కలిసేందుకు ప్రయత్నిస్తున్న మానకొండూర్‌ మండలం కొండపల్కలకు చెందిన సంపత్‌కుమార్‌ను సీఎం కేసీఆర్‌ గమనించి దగ్గరికి పిలిపించుకున్నారు. దీంతో ఆయన సీఎం పక్కనే నడిచారు. అనంతరం కలెక్టరేట్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు.


logo