శుక్రవారం 29 మే 2020
Rajanna-siricilla - Feb 13, 2020 , 03:45:33

రైతు బంధువు

రైతు బంధువు

(రాజన్న సిరిసిల్ల ప్రతినిధి, నమస్తే తెలంగాణ):రైతులకు పంట పెట్టుబడి కష్టాలను దూరం చేయాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‘రైతుబంధు’ను అమల్లోకి తెచ్చారు. తనకు అన్ని విధాలా కలిసొచ్చిన ఉమ్మడి జిల్లాలోనే ఈ పథకాన్ని ప్రారంభించారు. 2018 మే 10న హుజూరాబాద్‌ మండలం ఇందిరానగర్‌-శాలపల్లిలో స్వయంగా సీఎం ప్రారంభించారు. ఏటా రెండు సీజన్లలో సాయం అందిస్తున్నారు. మొదట 2018వానాకాలం పంటల కోసం ఎకరాకు 4 వేల చొప్పున రైతులకు చెక్కు ల రూపంలో అందించారు. 

శరవేగంగా బదిలీ..

మొదటిసారి జిల్లాలోని 1,05,074మంది రైతులకు 97.37 కోట్లు ఇచ్చారు. ఆ తర్వాత యాసంగి సీజన్‌ కోసం 90,216 మంది రైతులకు 107 కోట్ల 45వేల 502 మంజూరు చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ సీఎం కేసీఆర్‌ ఎకరాకు అందించే సాయాన్ని 4 వేల నుంచి 5 వేలకు పెంచారు. గత వానాకాలం సీజన్‌ నుంచి ఎకరాకు 5 వేల చొప్పున ఏటా 10 వేల పెట్టుబడి సాయం ఇస్తున్నారు. ఈ సీజన్‌లో జిల్లాలో 90,216 మంది రైతులకు 107,45,502 మంజూరు కాగా, ఇందులో ఇప్పటికే సగం మందికి పైగా రైతుల ఖాతాల్లో నగదు జమ చేశారు. మిగిలిన అకౌంట్లకు శరవేగంగా బదిలీ చేస్తున్నారు. 

కష్టకాలంలోనూ అండ.. 

దేశంలో ఆర్థిక మాద్యం చోటు చేసుకున్న ప్రస్తుత సమయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతకు అండగా నిలిచింది. రైతు పక్షపాతిగా పేరున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ వారికి ఇచ్చిన హామీలు అమలు చేయడంలో ఏనాడు వెనకడుగు వేయలేదు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, రైతులను ఆదుకునేందుకు రైతుబంధు నిధులను విడుదల చేశారు. ప్రతి సీజన్‌లో ఎకరాకు 5 వేల చొప్పున ఇస్తుండగా, ఈ సీజన్‌లో జిల్లా రైతుల కోసం 107కోట్ల 45లక్షల 502 మం జూరు చేశారు. ఇందులో ఇప్పటికే 51,951 మంది రైతులకు రూ. 39 కోట్ల 24లక్షల 75వేల 957 ట్రెజరరీ కార్యాలయానికి చేరుకున్నాయి. వచ్చిన సాయాన్ని అధికారులు శరవేగంగా రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఇందులో ఇప్పటికే సగం  మందికి పైగా రైతుల ఖాతాల్లో నగదు జమ చేయగా, మిగిలిన అకౌంట్లకు శరవేగంగా బదిలీ చేస్తున్నారు. కష్టకాలంలోనూ పెట్టుబడి సాయాన్ని అందించాలని సీఎం కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయంపై జిల్లా రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సీజన్‌లో కాస్త ఆలస్యంగా పెట్టుబడి అందినా ప్రభుత్వ పరిస్థితిని అర్థం చేసుకుని సర్దుకుపోతున్నారు.

అన్నదాతల ధీమా.. 

రెండేళ్ల కిత్రం వరకు పెట్టుబడి కోసం రైతులు పడరాని పాట్లు పడేవారు. బ్యాంకుల చుట్టూ రుణాల కోసం తిరిగే వారు. అక్కడ రుణం లభించకపోతే వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి అధిక వడ్డీకి అప్పులు తెచ్చుకుని పెట్టుబడులు నెట్టుకొచ్చేవారు. ఇలా చేసిన అప్పులు తీర్చలేక, నెల నెలా వడ్డీలు కట్ట లేక సతమతమయ్యే వారు. వీటన్నింటిని గమనించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌, పెట్టుబడి కోసం ఇబ్బందులు పడుతున్న రైతులను ఆదుకునే లక్ష్యంతో రైతుబంధు పథకాన్ని ప్రారంభించారు. ఎకరాకు 5వేల చొప్పున పెట్టబడి సాయం అందుతుండగా రైతులు సంతోషంగా సాగుకు సిద్ధమవుతున్నారు. అప్పుల జోలికి వెళ్లకుండా ప్రభుత్వం ఇస్తున్న పెట్టుబడి సాయంతో విత్తనాలు, ఎరువులు కొంటున్నారు. ఇటు నిరంతర ఉచిత కరెంట్‌, పుష్కలంగా కాళేశ్వర జలాలు వస్తుండడంతో సంబురంగా సేద్యం చేసుకుంటూ ఆనందంగా ఉంటున్నారు.


logo