శుక్రవారం 29 మే 2020
Rajanna-siricilla - Feb 13, 2020 , 03:44:46

మడేలేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు

మడేలేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు

చందుర్తి : మండల కేంద్రంలోని శ్రీ మడేలేశ్వరస్వామి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ బైరగోని లావణ్య విగ్రహ ప్రతిష్ఠాపనలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు పండాలనీ, ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ తిప్పని శ్రీనివాస్‌, సర్పంచ్‌ లింగంపల్లి సత్యం, కో ఆప్షన్‌ స భ్యులు బత్తుల కమలాకర్‌, ఎంపీటీసీ కవితా ప్ర సాద్‌, ఉపసర్పంచ్‌ మనోహర్‌, నర్సయ్య, మల్లే శం, దేవయ్య, తదితరులున్నారు. 

ముద్ర కో ఆపరేటీవ్‌ బ్యాంకు ప్రారంభం.. 

  మండల కేంద్రంలో ముద్ర కోఆపరేటివ్‌ బ్యాంకును ఎంపీపీ బైరగోని లావణ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతు లు తమ ఆర్థిక లావాదేవీలు జరపడం మరింత సులభతరమవుతుందన్నారు. మండల ప్రజలు బ్యాంకు సేవలను వినియోగించుకోవాలని సూ చించారు. జడ్పీటీసీ నాగం కుమార్‌, మాజీ ఎం పీపీ శ్రీనివాస్‌, సర్పంచ్‌ సిరికొండ ప్రేమలత, లింగంపల్లి సత్యం, ఎంపీటీసీ పులి రేణుక, కవిత, ప్రసాద్‌, మనోహర్‌, నాయకులు బైరగోని రమేశ్‌, కో ఆప్షన్‌ మెంబర్‌ బత్తుల కమలాకర్‌, బ్యాంకు సిబ్బంది, రైతులు, తదితరులు పాల్గొన్నారు.


logo