గురువారం 09 జూలై 2020
Rajanna-siricilla - Feb 13, 2020 , 03:44:14

ఎలక్ట్రానిక్‌ జకార్డ్‌తో నాణ్యమైన పట్టుచీరెలు

ఎలక్ట్రానిక్‌ జకార్డ్‌తో నాణ్యమైన పట్టుచీరెలు

సిరిసిల్ల రూరల్‌: సిరిసిల్లలో ఎలక్ట్రానిక్‌ జకార్డ్‌పై నాణ్యమైన పట్టు చీరెలను తయారు చేయడం అభినందనీయమని, ఔత్సాహికులకు సంపూర్ణ సహకారాలు అందిస్తామని చేనేత జౌళిశాఖ ఏడీ అశోక్‌రావు అన్నారు. సిరిసిల్ల మున్సిపల్‌ పరిధిలోని శాంతినగర్‌లో నేతకార్మికుడు దూడం శ్రీనివాస్‌ కార్ఖానాలో మరమగ్గంపై ఏర్పాటు చేసుకున్న ఎలక్ట్రానిక్‌ జకార్డ్‌ యంత్రాన్ని బుధవారం సిరిసిల్ల మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ మంచె శ్రీనివాస్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈసందర్భం గా ఏడీ అశోక్‌రావు మాట్లాడుతూ సిరిసిల్ల మం డలం చంద్రంపేట పరిధిలోని జ్యోతినగర్‌కు చెం దిన కుసుమ నర్సింహస్వామి రాష్ట్రంలోనే మొట్ట మొదటగా ఎలక్ట్రానిక్‌ జకార్డ్‌ ఏర్పాటు చేసుకుని, పట్టు చీరెను తయారు చేయడం అందరినీ ఆకర్శించిందన్నారు. ఇప్పుడు నర్సింహస్వామి బాటలోనే పలువురు నేతకార్మికులు, యజానులు, ఆసాములు తమ కార్ఖానాల్లో ఎలక్ట్రానిక్‌ జకార్డ్‌ ఏర్పాటుకు ముందుకు వస్తున్నారని చెప్పారు. మంత్రి కేటీఆర్‌ ఆదేశాలతో చేనేత జౌళిశాఖలో ఇప్పటికే ఉదయ రవిక్రియేషన్స్‌ ప్రతినిధి వెంకట్రావు, నేత కార్మికుడు కుసుమ నర్సింహస్వామి, యజమానులు, ఆసాములు, కార్మికులకు పలుమార్లు అవగాహన కల్పించామని పేర్కొన్నారు. ఆసక్తి గల వారికి 25 శాతం సబ్సిడీతో పీఎంఈజీపీ పథకంలో రుణాలు మంజూరు చేయిస్తామని చెప్పారు. అంతకుముందు మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ మంచె శ్రీనివాస్‌ మాట్లాడుతూ ఎలక్ట్రానిక్‌ జకార్డ్‌ ఏర్పాటుతో బతుకమ్మ చీరలకు కేరాఫ్‌గా ఉన్న సిరిసిల్ల, పట్టుచీరలకు కేరాఫ్‌గా మారనుందని తె లిపారు. ఎలక్ట్రానిక్‌ జకార్డ్‌ యంత్రం ఏర్పాటు చే సుకున్న  నేత కార్మికుడు శ్రీనివాస్‌ను అభినందించారు. మండల సత్యం, అడ్డగట్ల మురళి, దూడం శ్రీనివాస్‌, నేత కార్మికుడు కుసుమ వెంకస్వా మి, ఉదయరవి క్రియేషన్స్‌ ప్రతినిధి వెంకట్రావు,  చేనే త జౌళిశాఖ సిబ్బంది, కార్మికులు ఉన్నారు.

పట్టుచీరెపై చిత్రాలు హర్షణీయం

ఎలక్ట్రానిక్‌ జకార్డ్‌తో పట్టుచీరలపై అద్భుతమైన చిత్రాలు నేయడం హర్షణీయమని సిరిసిల్ల మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ శ్రీనివాస్‌ అన్నారు. బుధవారం నర్సింహస్వామి నివాసానికి వెళ్లి, పట్టుచీరెపై నేసిన సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌, మిషన్‌ భగరీథ, కాళేశ్వరం ప్రాజెక్టు చిత్రాలను పరిశీలించారు. నర్సింహస్వామి, కొడుకు అశోక్‌తోపాటు ఎలక్ట్రానిక్‌ జకార్డ్‌ ప్రతినిధి వెంకట్రావులను అభినందించారు. ఆయన వెంట మండల సత్యం, అడ్డగట్ల మురళి, అశోక్‌, ఈశ్వర్‌లు ఉన్నారు.


logo