శుక్రవారం 27 నవంబర్ 2020
Rajanna-siricilla - Feb 13, 2020 , 03:46:21

సేవలకు గుర్తింపు

సేవలకు గుర్తింపు

సిరిసిల్లటౌన్‌: విధి నిర్వహణలో సేవ కనబరిచిన అధికారులకు ప్రజల్లో నిరంతరం గుర్తింపు ఉంటుందని టెస్కాబ్‌ చైర్మన్‌ కొండూరి రవీందర్‌రావు అన్నారు. జిల్లాలో జేసీగా విధులు నిర్వహించిన యాస్మిన్‌బాషా కలెక్టర్‌గా, డీఆర్వో ఖిమ్యానాయక్‌ అదనపు కలెక్టర్‌గా, జిల్లా ప్రత్యేకాధికారి రాహుల్‌శర్మ అదనపు కలెక్టర్‌గా ఉద్యోగోన్నతులు పొంది బదిలీపై వెళ్తున్న సందర్భంగా జిల్లా రెవెన్యూశాఖ ఆధ్వర్యంలో వీడ్కోలు సమావేశం నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని వాసవి కల్యాణ మండపంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యఅతిథులుగా టెస్కాబ్‌ చైర్మన్‌ కొండూరి రవీందర్‌రావు, జడ్పీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ, కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌, ఎస్పీ రాహుల్‌హెగ్డేలు హాజరయ్యారు. ఈ సందర్భంగా టెస్కాబ్‌ చైర్మన్‌, జడ్పీ అధ్యక్షరాలు మాట్లాడుతూ కొత్తగా ఏర్పడిన జిల్లాను అభివృద్ధి చేయడంలో జిల్లా అధికార యంత్రాంగం కీలకంగా పనిచేసిందని కొనియాడారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన  జాయింట్‌ కలెక్టర్‌గా యాస్మిన్‌బాషా మంత్రి కేటీఆర్‌ సహకారంతో జిల్లాను అభివృద్ధిలో ముందు వరుసలో నిలపడంలో కీలకంగా పనిచేశారని అన్నారు. ప్రభుత్వం అమలుచేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేయడంలో అహర్నిశలు కృషి చేశారని పేర్కొన్నారు.  పదోన్నతిపై వెళ్తున్న చోట కలెక్టర్‌గా అక్కడి ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని ఆకాంక్షించారు. 

జిల్లాతో అనుబంధం చిరస్మరణీయం: జేసీ 

జిల్లా మొదటి జాయింట్‌ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించి నాటి నుంచి మంచి వాతావరణంలో విధులు నిర్వహించానని యాస్మిన్‌ బాషాపేర్కొన్నారు. మంత్రి కేటీఆర్‌, కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌లు అందించిన ప్రోత్సాహంతో ఎన్నో ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేసుకున్నామని సంతో షం వ్యక్తం చేశారు. తనతో కలిసి పనిచేసిన అధికారులు, ప్రజలతో తనకు ఏర్పడిన అనుబంధా న్ని గుర్తు చేసుకుని బావోద్వేగంతో ప్రసంగించా రు. శ్రీరాజరాజేశ్వర ప్రాజెక్టు పనులలో భాగస్వా మ్యం అయినందుకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. జిల్లా ప్రజలతో తనకు ఏర్పడిన అనుబం ధం జీవితకాలం గుర్తిండిపోతుందన్నారు. అనంతరం డీఆర్వో ఖిమ్యానాయక్‌, జిల్లా ప్రత్యేకాధికారి రాహుల్‌శర్మలు మాట్లాడారు. విధి నిర్వహణలో తమకు సహకరించిన అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ప్రజాప్రతినిధులు, జిల్లా రెవెన్యూ అధికారులు జెసి యాస్మిన్‌బాషా, డీఆర్వో ఖిమ్యానాయక్‌, జిల్లా ప్రత్యేకాధికారి రాహుల్‌శర్మలను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ ఆకునూరి శంకరయ్య, రైతు సమన్వయ సమితి జిల్లా కోఆర్డినేటర్‌ గడ్డం నర్సయ్య, శిక్షణ కలెక్టర్‌ సత్యప్రసాద్‌, అదనపు కలెక్టర్‌ అంజయ్య, ఆర్డీఓ శ్రీనివాసరావు, మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ మంచె శ్రీనివాస్‌, టీఎన్‌జీవో జిల్లా అధ్యక్షుడు ఎలుసాని ప్రవీణ్‌కుమార్‌, ఆయా శాఖల జిల్లా అధికారులు, ఎంపీడీవోలు, తాసిల్దారు పాల్గొన్నారు.