బుధవారం 15 జూలై 2020
Rajanna-siricilla - Feb 12, 2020 , 04:08:31

సంక్షేమానికి ఆకర్షితులయ్యే చేరికలు

సంక్షేమానికి ఆకర్షితులయ్యే చేరికలు

కలెక్టరేట్‌: గ్రామాలాభివృద్ధి కోసం స్థానిక ప్రజాప్రతినిధులంతా పార్టీలకతీతంగా కలిసి రావాలని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఉప సర్పంచుల  సంఘం జిల్లా అధ్యక్షుడు, తుర్కలమద్ధికుంట ఉపసర్పంచ్‌ ఈదునూరి జాన్‌ ఆధ్వర్యంలో పలువురు వార్డుసభ్యులు టీఆర్‌ఎస్‌లో చేరారు. వారికి ఎమ్మెల్యే దాసరి పార్టీ కండువా కప్పి టీఆర్‌ఎస్‌లోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలోకి వచ్చాక చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులవుతున్న వారంతా టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని అన్నారు. అభివృద్ధి సంక్షేమాలను కాంక్షిస్తున్న వారంతా టీఆర్‌ఎస్‌ పార్టీతో కలిసి రావాలని పిలుపునిచ్చారు. టీఆర్‌ఎస్‌ పార్టీలో ఉండటాన్ని గర్వంగా, గౌరవంగా భావించాలని పేర్కొన్నారు. గత పాలకుల హయాంలో చేయని అభివృద్ధి పనులను చేసి చూపిస్తున్నామని ఉద్ఘాటించారు. కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ ము త్యాల రాజయ్య,  టీఆర్‌ఎస్‌ నాయకులు బం డా రి శ్రీనివాస్‌గౌడ్‌, తంగెళ్ల సంజీవరెడ్డి, రాజబాబు, చంద్రయ్య, మధూకర్‌, జంపయ్య పాల్గొన్నారు. 

తాజావార్తలు


logo