శనివారం 05 డిసెంబర్ 2020
Rajanna-siricilla - Feb 10, 2020 , 02:17:45

ముగిసిన నామినేషన్ల పరిశీలన

ముగిసిన నామినేషన్ల పరిశీలన
  • 134 తిరస్కరణ
  • 256 స్థానాలకు 771 మంది అభ్యర్థుల పోటీ
  • 53 స్థానాలు ఏకగ్రీవం

రాజన్న సిరిసిల్ల ప్రతినిధి, నమస్తే తెలంగాణ: ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల (పీఏసీఎస్‌) నామినేషన్ల పరిశీలన ఆదివారం ముగిసింది. జిల్లా వ్యాప్తంగా 24సొసైటీల పరిధిలోని 256నియోజకవర్గాలకు 771మంది సభ్యులు పోటీలో ఉన్నా రు. వీటికి మూడు రోజుల్లో 958 నామినేషన్లు వచ్చాయి. ఆదివారం పరిశీలనలో 134 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. 309 స్థానాలకు 958మంది అభ్యర్థులుండగా ఇందులో 53 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. దీనితో 256 స్థానాలకు 771మంది అభ్యర్థులు బరిలో నిలవనున్నారు. 


గంభీరావుపేట: సహకార సంఘం ఎన్నికల్లో భాగంగా గంభీరావుపేట, కొత్తపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల నియోజకవర్గ స్థానాలకు దాఖలు చేసిన నామినేషన్‌ పత్రాలను ఆదివారం ఎన్నికల అధికారులు పరిశీలించారు. గంభీరావుపేటలో 31 నామినేషన్లు పరిశీలించగా, రెండు తిరస్కరించారు. అలాగే కొత్తపల్లిలో 41 నామినేషన్లు పరిశీలించి  రెండు నామినేషన్లను స్క్రూటింగ్‌లో తిరస్కరించామని ఎన్నికల అధికారులు రవీందర్‌, బాలెల్లయ్య తెలిపారు. గంభీరావుపేటలో 9స్థానాలకు 29 మంది, కొత్తపల్లిలో 12స్థానాలకు 39మంది అభ్యర్థులు పోటీలో ఉంటారని వారు తెలిపారు. 


ఇల్లంతకుంట: మండలంలోని రెండు సహకార సంఘాల నామినేషన్ల పరిశీలన ఆదివారంతో ముగిసిందని ఎన్నికల అధికారులు శ్రీనివాస్‌, శ్రావణ్‌కుమార్‌ తెలిపారు. ఇల్లంతకుంట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి 47నామినేషన్లు, గాలిపల్లి సహకార సంఘానికి 33నామినేషన్లు స్కూట్నీలో పరిశీలించామని తెలిపారు.  

ముస్తాబాద్‌: మండలంలోని రెండు సహకార సంఘాలకు అభ్యర్థులు వేసిన  నామినేషన్లు ఆదివారం సంబంధిత ఎన్నికల అధికారులు పరిశీలించారు. ముస్తాబాద్‌ సంఘానికి 40, పోత్గల్‌ సంఘంకు 54నామినేషన్లు వచ్చినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ముస్తాబాద్‌ సంఘం నుంచి రెండు నామినేషన్లు తిరస్కరించగా, పోత్గల్‌ నుంచి 8మంది రెండు సెట్లు వేయడంతో 46మంది నామినేషన్లు పరిగణంలోకి తీసుకున్నారు. సోమవారం వరకు విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉన్నది.  


వధూవరులను ఆశీర్వదించిన బాపురెడ్డి

కోరుట్లటౌన్‌: జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని శివసాయి గార్డెన్‌లో ఆదివారం జరిగిన కటుకం ప్రేమ్‌కుమార్‌-కవిత వివాహ రిసెప్షన్‌కు మార్క్‌ఫెడ్‌ చైర్మన్‌ లోక బాపురెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ఆయనతోపాటు కథలాపూర్‌ జడ్పీటీసీ నాగం భూమయ్య, ఎంపీటీసీ రమేశ్‌, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు కల్లెడ శంకర్‌, నాయకులు నాగేశ్వరరావు, తిరుపతిరెడ్డి, గడ్డం భూమరెడ్డి, దేవేందర్‌రెడ్డి, వేణు తదితరులు ఉన్నారు