బుధవారం 08 జూలై 2020
Rajanna-siricilla - Feb 10, 2020 , 02:03:15

నేడు జిల్లాకు కేటీఆర్‌

నేడు జిల్లాకు కేటీఆర్‌
  • రాజన్నసిరిసిల్ల ప్రతినిధి, నమస్తేతెలంగాణ

టీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మున్సిపల్‌ పరిశ్రమల శాఖల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు నేడు జిల్లాలో పర్యటించనున్నారు. సోమవారం ఉదయం 11.30 గంటలకు సిరిసిల్ల పట్టణంలోని పొదుపు భవన్‌లో కలెక్టర్‌ ఆధ్వర్యంలో నిర్వహించే అభివృద్ధి పనులపై అన్ని శాఖల అధికారులతో సమీక్షా సమావేశానికి హాజరు కానున్నారు. అనంతరం మధ్యాహ్నం 3గంటలకు తంగళ్లపల్లి మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన పోలీస్‌ స్టేషన్‌ భవనాన్ని ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 3.30గంటలకు అక్కడి నుంచి హైదరాబాద్‌కు తిరుగు పయనమవుతారు. మంత్రి రాకసందర్భంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 


logo