శుక్రవారం 05 జూన్ 2020
Rajanna-siricilla - Feb 10, 2020 , 01:46:57

కవిత్వం.. నిరంతర సాధన

కవిత్వం.. నిరంతర సాధన
  • సీఎం ఓఎస్‌డీ దేశపతి శ్రీనివాస్‌
  • కవి శ్రీరామ్‌కు రంగినేని ఎల్లమ్మ
  • సాహిత్య పురస్కారం 2019 అందజేత

సిరిసిల్ల కల్చరల్‌: సాధన ద్వారా కవిత్వాన్ని మెరుగు పరుచుకోవచ్చుననీ.. కవిత్వం ఒక నిరంతర సాధననీ సీఎం ఓ ఎస్‌డీ కవి, రచయిత దేశపతి శ్రీనివాస్‌ అన్నారు. ఆదివా రం రంగినేని సుజాత మోహన్‌రావు ఎడ్యుకేషనల్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో రంగినేని ట్రస్టులో నిర్వహించిన రంగినేని ఎల్లమ్మ సాహిత్య పురస్కారం-2019 ప్రదానోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కవిత్వం ఒక సృజనాత్మక సాహితీ ప్రక్రియ, కవి త్వం అక్షర హింస కాదన్నారు. ఈ క్షణంలో కవిత రాయకపోతే చచ్చిపోతాం అన్నంత ఆవేశం వస్తేగాని ఒక మంచి కవిత జన్మించదని తెలిపారు. అనుభవాన్ని వ్యక్తం చేయడమే కాక, అది మనకు అనుభూతమయ్యేటట్లు చేయడం కవిత్వం పని అని ఆయన పేర్కొన్నారు. ఇటీవల కాలంలో చదువుకునే విద్యార్థులకు కవిత్వాల గురించి కవులు తెలియజేయాలని కోరారు. కవిత రాస్తే పాఠకుడిని కదిలించే విధంగా రాయాలని సూచించారు. నాలో ఒక కవిత్వాన్ని మరోసారి గుర్తు చేసుకోగలిగే అవకాశం ఈ సభ వల్ల వచ్చిందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం అద్వంద్వం పుస్తక కవి శ్రీరామ్‌ను సత్కరించి రంగినేని ఎల్లమ్మ పురస్కారం-2019ని అందజేశారు. ఈ కార్యక్రమంలో సభాధ్యక్షులుగా కవి, రచయిత జూకంటి జగన్నాథం, రంగినేని చారిటబుల్‌ ట్రస్ట్‌ అధ్యక్షుడు రంగినేని మోహన్‌రావు, పురస్కార కమిటీ కన్వీనర్‌ మద్దికుంట లక్ష్మ ణ్‌, నేషనల్‌ బుక్‌ ట్రస్ట్‌ ఆఫ్‌ ఇండియా పత్తిపాక మోహన్‌, రంగినేని చారిటబుల్‌ ట్రస్ట్‌ కోశాధికారి నవీన్‌కుమార్‌, పుస్తక పరిచయం కవి నాగిళ్ల రమేశ్‌, ట్రస్ట్‌ సభ్యులు, కవులు, విద్యార్థులు పాల్గొన్నారు.


logo